(Source: ECI/ABP News/ABP Majha)
Crime News: సూసైడ్ లెటర్ రాసి సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య - కారణం ఏంటంటే?
Sangareddy News: తన చావుకు కుటుంబ సమస్యలే కారణమని లెటర్ రాసి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Software Employee Forceful Death In Hyderabad: నగరంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన కిరణ్ (25) విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అతను కొల్లూరు పీఎస్ పరిధిలోని తెల్లాపూర్ (BHEL) విద్యుత్ నగర్‌లో నివాసం ఉంటున్నాడు. మంగళవారం ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కిరణ్ కుటుంబ సమస్యలతో డిప్రెషన్‌కు గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతను చనిపోయే ముందు రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కిరణ్ ఆత్మహత్యకు కుటుంబ సమస్యలేనా.? లేక మరేదైనా కారణాలున్నాయా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.
Also Read: Warangal News: అడవిలో చిక్కుకున్న పోలీస్ బలగాలు - 3 రోజులుగా ఆహారం లేక అవస్థలు, రక్షించిన అధికారులు