అన్వేషించండి

మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్స్‌ రెండో భార్య దాడి

ఎన్టీఆర్ జిల్లా నందిగామ అయ్యప్పనగర్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. తన మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త ఆనంద్ బాబు మర్మాంగాలను గాయపరచింది రెండవ భార్య వరమ్మ.


ఇన్‌స్టా రీల్స్ వ్యవహరం ఆ కుటుంబంలో కలతలకు దారితీసింది. మొదటి భార్య పోస్ట్ చేసిన ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడనే కోపంతో రెండో భార్య అతని ప్రైవేట్ పార్ట్స్‌పై కొట్టింది. ఇప్పుడా వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడనే కోపంతో..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ అయ్యప్పనగర్‌లో జరిగిన ఘటన కలకలం రేపింది. తన మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడని భర్త ఆనంద్ బాబు మర్మాంగాలను గాయపరచింది రెండవ భార్య వరమ్మ. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబుకు గతంలోనే ఓసారి పెళ్లి అయింది. ఆమెతో విభేదాలు కారణంగా ఇద్దరూ విడిపోయివేర్వేరుగా ఉంటున్నారు. కాలం గడిచింది. ఆనంద్‌ రెండో పెళ్లి చేసుకున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం వరమ్మ అనే మహిళను పెళ్ళి చేసుకుని ముప్పాళ్ళలో నివాసం ఉంటున్నారు. ఐదు నెలలుగా నందిగామకు నివాసాన్ని మార్చాడు.

ఎప్పుడూ ఆన్‌లైన్‌లో తరచూ వీడియోలు చూసే ఆనంద్‌బాబుకు గతరాత్రి ఊహించని పరిణామం ఎదురైంది. తన మొదటి భార్య చేసిన ఓ వీడియో ఇన్‌స్టాలో కనిపించింది. దాన్ని చూస్తున్న టైంలో రెండో భార్య అటుగా వచ్చింది. ఆనంద్‌ చూస్తున్న వీడియోను చూసింది. అది తన భర్త మొదటి భార్యగా గుర్తించింది. 

తనను పెళ్లి చేసుకున్న తర్వాత మొదటి భార్య వీడియోలు ఎందుక చూస్తున్నావని వరమ్మ నిలదీసింది. ఇలా మాటామాట పెరిగింది. ఇద్దరు గట్టిగా గొడవ పడ్డారు. కొట్టుకున్నారు. ఆనంద్‌ ఆమెను కొట్టాడు. ఆమె కూడా కొట్టేందుకు ప్రయత్నించింది. 
ఇలా ఇద్దరి మధ్య ఫైటింగ్ నడుస్తున్న టైంలో పక్కనే ఉన్న బ్లేడ్ తీసిన వరమ్మ ఆనంద్‌బాబును బెదిరించబోయింది. అది కాస్త అదుపు తప్పి ఆయన ప్రైవేట్ పార్ట్స్‌పై తగిలింది. అంతే 
దీంతో భర్త ఆనంద్ బాబు పై బ్లేడ్ తో మర్మాంగాల పై గాయపరచింది, రెండవ భార్య వరమ్మ. దీంతో ఆనంద్ బాబు నొప్పితో విలవిల్లాడిపోయి కిందపడిపోయాడు. ఏం జరిగిందో అన్న కంగారులో వరమ్మ గట్టిగా కేకలు వేసింది. దెబ్బకు చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఏం జరిగిందో అని ఆరా తీశారు. 
 
రక్తపు మడుగులో ఉన్న ఆనంద్‌ను వెంటనే నందిగామ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. అయితే పరిస్దితి కొంత ఆందోళనకంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు కుటుంబ సభ్యులు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి నందిగామ పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్ స్టా రీల్స్‌పై మొదటి నుంచి వివాదం..
ఆనంద్ బాబు స్థానికంగా ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి భార్యతో వివాహం కూడా ఇన్ స్టా రీల్స్ కారణంగానే తెగిపోయింది. భార్య తనను కాదని ఎక్కువగా రీల్స్ పై నే శ్రద్ద చూపించటంతో ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. చివరకు పెద్దలు కూడ ఇరువురి మధ్య పంచాయితీ చేసినప్పటికి మార్పు రాలేదు. దీంతో భార్య భర్తలు విడిపోయి వేర్వుగా ఉంటున్నారు. భర్త వదిలేయటం వేరే వివాహం చేసుకోవడంతో ఆమె విచ్చలవిడిగా ఇన్ స్టాలో రీల్స్‌ను క్రియేట్ చేసి పోస్టు చేస్తోంది. రెండో భార్యను వివాహం చేసుకున్న తరువాత కూడా మెదటి భార్యకు చెందిన ఇన్ స్టా రీల్స్‌ను చూస్తూ కాలం గడుపుతున్నాడు ఆనంద్. ఇదే రెండో భార్యకు కోపాన్ని తెప్పించింది. చివరకు ఇలా ఆసుపత్రి పాల్జేసింది. 

అలా జరుగుతుందనుకో లేదు..
దాడి అనంతరం భార్య వరమ్మ మాట్లాడుతూ నిత్యం మొదటి భార్య రీల్స్ చూస్తుండటంతో చాలా సార్లు భర్తను వారించానని తెలిపింది. ఈ వ్యవహరం గొడవకు దారి తీసిందని, అయితే తన భర్త తలపై దాడి చేయటంతో ప్రాణ భయంతో బ్లేడ్‌తో దాడి చేశానని వరమ్మ చెబుతుంది. కుటుంబ వ్యవహరాలను పట్టించుకోకుండా నిత్యం సెల్ ఫోన్ చూస్తూ గడుపుతున్నాడని ఆమె చెబుతుంది.

సెల్ ఫోన్ కే పరిమితమైన భర్త
భర్త ఆనంద్ బాబు పనికి వెళ్లకుండా కేవలం సెల్ ఫోన్‌తోనే కాలక్షేపం చేస్తుండటంతో కుటుంబంలో గొడవలు స్టార్ట్ అయ్యియి. అది కూడా మొదటి భార్య వీడియోలు చూస్తూ వాటికి కామెంట్స్, షేర్ చేయటంతోపాటుగా ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. దీంతో ఇల్లు గడవకపోవటంతో ఆర్థిక ఇబ్బందులు మెదలయ్యాయి. అందుకే భార్య భర్తల మధ్య గొడవ మొదలైందిన స్థానికులు అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget