Viral News: భార్యతో వివాహేతర బంధం - ఇంట్లో అద్దెకున్న యువకుడ్ని సజీవసమాధి చేసిన భర్త !
Haryana: హర్యానాలో ఓ యువకుడి మిస్సింగ్ కేసు విషాదంతం అయింది. అయితే ఏం జరిగిందో తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు.

Wife affair with tenant: హర్యానాలోని రోహ్ తక్‌లో ఓ యువకుడ్ని సజీవంగా సమాధి చేసిన వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసులో ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. యువకుడ్ని ఏడు అడుగుల గొయ్యి తీసి అందులో పాతి పెట్టారు.ఎందుకు ఈ పని చేశారో పోలీసులు ఆరా తీశారు. వివాహేతర బంధమే కారణం అని తేలింది.
చనిపపోయిన యువకుడికి పేరు జగదీప్. రోహ్ తక్ లోని ఓ ఇంట్లో అదద్దెకు ఉంటున్నాడు. రోహ్‌తక్‌లోని బాబా మస్త్‌నాథ్ విశ్వవిద్యాలయంలో యోగా టీచర్ గా పని చేస్తున్నాయి. ఆ ఇంటి యజమాని భార్యతో ఏర్పడిన బంధం పరిచయం వివాహేతర బంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని గుర్తించిన ఇంటి యజమాని హర్ దీప్..యువకుడ్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు మరో వ్యక్తితో కలిసి కిడ్నాప్ చేశాడు. కాళ్లు చేతులు కట్టేసి ముందుగానే తీసి ఉంచిన గొయ్యిలో సజీవం పెట్టేసి మట్టి కప్పేశారు. తరవాత ఏమీ తెలియనట్లుగా వెళ్లిపోయారు.
మిస్సింగ్ కేసును నమోదు చేసుకున్న పోలీసులు చాలా రోజుల పాటు వెదికారు కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే అతడిని కిడ్నాప్ చేసిన తర్వాత ఇంటి యజమాని, అతని స్నేహితుడు దాద్రిలోని ఓ ఇంట్లో ఉంచారు. మెల్లగా తీగ దొరకడంతో కథ అంతా బయటకు తీశారు. చివరికి వారు పాతి పెట్టిన చోటు కనిపెట్టారు. జగదీప్ మృతదేహాన్ని వెలికి తీశారు.
#WATCH | Rohtak, Haryana | CIA-1 incharge Kuldeep says, "A missing report of Jagdeep was registered in Shivaji Colony police station. It was filed around 2-2.5 months ago. Later, it was found that after being abducted, his body was kept in Dadri. Accused Hardeep and Dharampal… pic.twitter.com/CRuZ1qAWnq
— ANI (@ANI) March 25, 2025
ముందుగానే హత్య చేయాలని నిర్ణయించుకోవడంతో బోరుబావి కోసం అని కూలీలతో దాద్రిలోని పాంటవాస్ గ్రామంలో బోరుబావి కోసం 7 అడుగుల లోతు గల గొయ్యిని తవ్వించి పెట్టాడు. సరైన సమయం చూసి కిడ్నాప్ చేశారు. అతన్ని కొట్టి దాద్రికి తీసుకెళ్లి లోతైన గొయ్యిలో పాతిపెట్టారు. జగ్దీప్ కాల్ రికార్డులను యాక్సెస్ చేసిన తర్వాత పోలీసులు తమ దర్యాప్తులో పురోగతి సాధించారు. నిందితుల్ని అరెస్టు చేశారు.
ఎక్కువగా నేరాలు వివాహేతర బంధాల వల్లనే జరుగుతున్నాయన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. ఇటీవల మీరట్ లో జరిగిన మర్చంట్ నేవీ ఉద్యోగి హత్య ఘటన పై ఇంకా పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్న సమయంలో నే.. వివాహేతర బంధాల వల్ల జరుగుతున్న నేరాలు ఇంకా ఇంకా బయటపడుతున్నాయి.





















