అన్వేషించండి

Rajasthan News : రాజస్థాన్‌లో కిరాతకం - వెండి కడియాల కోసం వృద్ధురాలి కాళ్లు నరికేసిన దుండగులు

Rajasthan Crime: చిన్న చిన్న వస్తువుల కోసం మహిళలపై అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు దుండగులు. రాజస్థాన్‌లో మహిళ పెట్టుకున్న కడియాల కోసం కాళ్లు నరికేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది.

Rajasthan 65 year old mutilated for silver anklets రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లా గంగాపూర్ సిటీలో దొంగలు అత్యంత దారుణానికి ఒడిగట్టారు. 65 ఏళ్ల మహిళ కమలా దేవి  వెండి కడియా కోసం  దుండగులు ఆమె పాదాలను కట్ చేశారు. ఈ ఘటనకు ముందు ఆమెకు రొట్టెలు పెట్టారు వాటిని తిన్న తర్వాత ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. దాంతో వారు కాళ్లు నరికేసి కడియాలు తీసుకుని వెళ్లిపోయారు. 
 
బాధితురాలు ప్రస్తుతం జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ (SMS) హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు అనుమానిత దొంగల్ని పట్టుకున్నారు. వారు భార్యభర్తలుగా గుర్తించారు. రామోతర్ అలియాస్ కాడు బైర్వా (32), అతని భార్య తాను అలియాస్ సోనియా (భైసా నివాసి) ఈ ఘోరానికి పాల్పడినట్లుగా గుర్తించారు. వీరు గతంలోనూ ఇలాంటి ఘోరాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. 

కమలా దేవి తన కుమార్తె ఇంటికి వెళ్లేందుకు  గంగాపూర్ సిటీలో వచ్చారు. అక్కడ  రామోతర్‌ వారితో మాట్లాడారు.  కుమార్తె ఇంటి వద్ద దిగబెడతానని నమ్మించి వృద్ధురాలితో పాటు మరో ముగ్గురిని తన వాహనంలో ఎక్కించుకుని గంగాపూర్ సిటీ బైపాస్‌కు తీసుకెళ్లాడు.   మొదట మరో ముగ్గురిని డ్రాప్ చేసి, తర్వాత కమలా దేవిని తన భార్యతో కలిపి బైపాస్‌లో కూర్చోబెట్టాడు.

సాయంత్రం 8 గంటలకు  నిందితుడు వృద్ధురాలిని తన  ఇంటికి తీసుకెళ్లాడు. "పెద్దమ్మ, ఈ రోజు  కుమార్తె ఇంటికి తీసుకెళ్లలేను.. రేపు  తీసుకెళ్తా" అని చెప్పి  పరాటా, రొట్టెలు తినమని ఇచ్చాడు. తర్వాత ఆమెకు మగత ఆవహించింది. అక్కడ్నుంచి వృద్ధురాలిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె స్పృహ కోల్పోయింది.  తర్వాత వారు ఆమె  కాళ్లను నరికేసి.. వెండి కడియాలు దోచుకుని ఆమెను అక్కడ పడేసిపోయారు. తెల్లవారిన తర్వాత కాళ్లు నరికేసిన వృద్ధురాలిని కొంత మంది గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు.  ఆమెను గంగాపూర్ హాస్పిటల్‌కు తరలించారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @pro_writerx

 

హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మీడియాతో మాట్లాడిన కమలా దేవి తన కాళ్లు నరికిన వైనాన్ని వివరించి కన్నీరు పెట్టుకున్నారు.  గంగాపూర్ సిటీ పోలీసులు వారి మొబైల్ లొకేషన్ ట్రాక్ చేసి, నిందితులు గుర్తించారు. నిందితులు ఒంటరిగా ఉన్న మహిళల్ని నమ్మించి ఒంటరి ప్రదేశాలకు తీసుకెళ్లి కాళ్లు కట్ చేసి వెండి కడియాలు దోచుకుంటారని పోలీసులు గుర్తించారు.           

ఈ ఘటన రాజస్థాన్ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చిన్న చిన్న  ఆభరణాల కోసం ఆమె కాళ్లను అత్యంత కిరాతకంగా నరికేసిన ఆ దారుణమైన దంపతుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.         

 

                            

టాప్ హెడ్ లైన్స్

Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Fake High Court Judge: హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget