అన్వేషించండి

Bapatla Crime News: బావ పొట్టిగా ఉన్నాడని చంపేసిన బావమరిది- పెళ్లైన పది రోజులకే దారుణం

Bapatla Crime News: బాపట్ల జిల్లాల్లో దారుణం జరిగింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావమరిది చంపేశాడు.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • తమకు ఇష్టంలేని వ్యక్తితో చెల్లి వివాహం చేసుకుందని ఆగ్రహంతో బావమరిది హత్య చేశాడు.
  • ప్రేమ వివాహం చేసుకున్న పది రోజులకే అంజనీ దేవి భర్త గణేష్ హత్యకు గురయ్యాడు.
  • బావమరిది దుర్గారావు, అతని స్నేహితులు గణేష్‌ను కిరాతకంగా కొట్టి చంపారు.
  • పొట్టిగా ఉన్నాడనే కారణంతోనే హత్య చేసినట్లు నిందితుడు దుర్గారావు ఒప్పుకున్నాడు.

Bapatla Crime News: కులం, మతం, ఆస్తి కోసం జరిగిన పరువు హత్యల గురించి వినే ఉంటారు. ఇప్పుడు బాపట్ల జిల్లాలో జరిగిన హత్య హైట్‌కు సంబంధించింది. తన సోదరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి పొట్టిగా ఉన్నాడనే కారణంతో బావను చంపేశాడో బావమరిది. ఈ దారుణం గురించి తెలిసిన స్థానికులతోపాటు పోలీసులు కూడా షాక్ అయ్యారు. పెళ్లి అయిన పది రోజులకే ఇలా జరగడం అందర్నీ ఇరు కుటుంబాల వాళ్లను విషాదంలోకి నెట్టింది.  

బాపట్ల జిల్లా వేమూరు మండలం ఏడవురు గ్రామానికి చెందిన కుర్రా గణేష్‌, తెనాలి ప్రాంతానికి చెందిన కీర్తి అంజనీ దేవి ప్రేమించుకున్నారు. చాలా కాలంగా సాగుతున్న వీళ్ల ప్రేమను పెద్దలకు చెప్పారు. గణేష్ పొట్టిగా ఉన్నాడని కీర్తి పేరెంట్స్ పెళ్లికి నిరాకరించారు. వారు ఒప్పుకుంటారని చాలా కాలంగా ఎదురు చూశారు. అయినా పెద్దల మనసులు కరగలేదు. చివరకు పది రోజుల క్రితం అమరావతిలోని దేవాలయంలో గణేష్ కీర్తి జంట వివాహం చేసుకున్నారు. దీనికి స్నేహితులు సహకరించారు. 

కొత్తగా పెళ్లి చేసుకున్న కీర్తి గణేష్ పది రోజుల నుంచి ఆనందంగా ఉన్నారు. కానీ కీర్తి సోదరుడు మాత్రం విషయం తెలుసుకున్నప్పటి నుంచి పగతో రగిలిపోయాడు. తమకు ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందని తన పరిచయస్తుల వద్ద పదే పదే ప్రస్తావించారు. మాయ మాటలు చెప్పి గణేష్‌ తన సోదరిని వలలో వేసుకున్నాడని కీర్తి సోదరుడు దుర్గారావు అనేవాడు. అలా గణేష్‌   పై విమర్శలు చేస్తూ వచ్చాడు. వాళ్లు కనిపిస్తే మాత్రం ఏం చేస్తానో తెలియదని వార్నింగ్ ఇచ్చే వాడు. 

దుర్గారావు బెదిరింపులు గురించి తెలుసుకున్న కీర్తి గణేష్‌ తమ ప్రాణాలకు ముప్పు ఉందని భావించారు. అందుకే పోలీసులను ఆశ్రయించాడు. తనకు కీర్తి ఫ్యామిలీ నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు. ప్రేమ వివాహాల సమయంలో ఇలాంటివి సర్వసాధారణంగా జరుగుతుంటాయనే కారణంతో పోలీసులు వారికి నచ్చజెప్పి పంపించారు. కాని ఇలా ఫిర్యాదు చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే గణేష్‌ను దుర్గారావు చంపేశాడు. 

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న గణేష్‌ తన పెళ్లి విందును గ్రాండ్‌గా చేయాలని నిర్ణయించాడు. తన వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆ డబ్బులతో ధూంధాంగా పెళ్లి విందు ఇవ్వాలని కలలు కంటూ వస్తున్నాడు. బ్యాంకు నుంచి ఇంటికి వస్తున్న దారిలో దుర్గారావు తన స్నేహితులతో వచ్చి గణేష్‌ను అడ్డగించారు. తమ ఇష్టాఇష్టాలతో పని లేకుండా కీర్తిని మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటావా అని ప్రశ్నించాడు. కొట్టడం మొదలు పెట్టాడు. మాటా మాట పెరిగి గణేష్‌ను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. 

ఈ దారుణాన్ని చూసిన స్థానికులు నివ్వెర పోయారు. బావ పొట్టిగా ఉన్నాడనే ఒకే ఒక్క కారణంతో హత్య చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. దుర్గారావు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. పొట్టిగా ఉన్నాడనే కారణంతోనే పెళ్లికి అంగీకరించలేదని అయినా తన చెల్లికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడని అందుకే హత్య చేసినట్టు నేరాన్ని దుర్గారావు అంగీకరించాడు. బావమరిది బావ బతుకు కోరతాడని అంటారు. కానీ ఇక్కడ కేవలం ఎత్తు తక్కువగా ఉన్నాడనే కారణంతోనే బావను బావమరిది హత్య చేయడంతో అంతా షాక్ అయ్యారు. 

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget