News
News
X

Rajanna Siricialla News: కుటుంబ సభ్యులనే తుపాకీతో కాల్చబోయిన యువకుడు, ఏమైందంటే?

Rajanna Siricialla News: కుటుంబ సభ్యులతో గొడవ పెట్టుకున్న ఓ వ్యక్తి. తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్పులు జరపబోయాడు. విషయం గుర్తించిన ఇంటి సభ్యులు బయటకు పరుగులు తీశారు. 

FOLLOW US: 
 
Rajanna Siricialla News: రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేట్ గ్రామంలో ఓ వ్యక్తి తుపాకీ చేతపట్టుకొని కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. కానీ అదృష్టవశాత్తు ముందుగానే విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీసి.. ప్రాణాలు దక్కించుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

అసలేం జరిగిందంటే..?

జిల్లాలోని కోనరావుపేట మండలం బావుసాయిపేటలో ఓ వ్యక్తి తుపాకీతో తన కుటుంబ సభ్యులను కాల్చడానికి ప్రయత్నించాడు. బావుసాయిపేటకు చెందిన నేవూరి హునుమంతు.. తన కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో అదికాస్తా గొడవకు దారితీసింది. దీంతో కోపాద్రిక్తుడైన హునుమంతు తన వద్ద ఉన్న తుపాకీ తీసి కాల్పులు జరపడానికి యత్నించాడు. భయాందోళనకు గురైన వారు ప్రాణాలు అరచేత పట్టుకుని బయటకు పరుగులు తీశారు. కాగా.. హనుమంతు గతంలో జనశక్తి సానుభూతిపరుడిగా పనిచేశాడు. జనశక్తి డంపు చేసే ఆయుధాల్లో ఒక ఆయుధాన్ని అతడు దాచుకున్నట్లు సమాచారం. అయితే కుటుంబ సభ్యులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. హుటాహుటిన రంగంలోకి దిగారు. హనుమంతుపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.

News Reels

వారం రోజుల క్రితం మాదాపూర్ లో కూడా ఇలాంటి ఘటనే..

మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాలీవుడ్ నిర్మాత దగ్గుపాటి సురేష్ బాబు భూమిలో జరుగుతున్న కన్‌స్ట్రక్షన్  వద్ద ఓ వ్యక్తి తుపాకీతో హల్ చల్ చేశాడు. అయితే గత కొంత కాలంగా దగ్గుపాటి సురేష్ బాబుకు, రామకృష్ణారెడ్డికి మధ్య భూ వివాదం చోటు చేసుకుంది. కొన్ని రోజుల క్రితం సురేష్ బాబు భూమిలో జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి సంజీవరెడ్డి అనే ఓ వ్యక్తి కాంట్రాక్టు తీసుకున్నాడు. తన భూమిలోకి జరిగి నిర్మాణం చేస్తున్నారనడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. ఇదే విషయమై మొదట మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో  దగ్గుపాటి సురేష్ బాబు సూపర్ వైజర్ ఫిర్యాదు చేశారు. నిన్న మధ్యాహ్నం మరోసారి రామ కృష్ణారెడ్డి రావడంతో వివాదం మొదలైంది. కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్ సంజీవ రెడ్డికి రామ కృష్ణారెడ్డికి మధ్య వాగ్వాదం మొదలైంది. అయితే తీవ్ర కోపోద్రిక్తుడైన కాంట్రాక్టర్ సంజీవ రెడ్డి తన వద్ద ఉన్న తుపాకీని తసి రామకృష్ణారెడ్డిని బెదిరించాడు. గాల్లోకి కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి వచ్చేసిన రామకృష్ణారెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సంజీవ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరించడానికి ఉపయోగించిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మాదాపూర్ లో కాల్పుల కలకలం...

హైదరాబాద్ లో రెండు నెలల క్రితం కాల్పుల కలకలం రేగింది. మాదాపూర్ లోని నీరూస్ సిగ్నల్ వద్ద ఉదయం మూడు గంటల సమయంలో రౌడీ షీటర్‌ ను దారుణంగా హతమార్చిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. రౌడీ షీటర్ ఇస్మాయిల్‌పై పాయింట్ బ్లాంక్‌ లో మరో రౌడీషీటర్ ముజ్జు కాల్పులు జరిపాడు. ఇస్మాయిల్ కారులో వెళుతుండగా.. మాదాపూర్ నీరూస్ వద్దకు రాగానే బైక్‌పై వచ్చిన ముజ్జు అతడిని ఆపాడు. ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగినట్టు తెలుస్తోంది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ముజ్జు ఆరు రౌండ్‌లు కాల్పులు జరపాడు. పాయింట్ బ్లాంక్ లో కాల్చడంతో ఇస్మాయిల్ అక్కడిక్కడే మరణించాడు. అయితే ఈ ఘటనలో మరో వ్యక్తి తీవ్రంగా గాయ పడ్డాడు.

Published at : 27 Oct 2022 05:42 PM (IST) Tags: Rajanna Siricilla News Telangana Crime News Man Hulchal With Gun Rajanna Siricilla Crime News Latest Gun Fire

సంబంధిత కథనాలు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Sathya Sai District News: వాషింగ్ మెషిన్ పెట్టిన చిచ్చు - మహిళను కొట్టి చంపేసిన పక్కింటి వ్యక్తులు

Hyderabad Crime News: అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు - 17 మందిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Hyderabad Crime News: అంతర్జాతీయ సెక్స్‌ రాకెట్‌ ముఠా గుట్టురట్టు - 17 మందిని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ పోలీసులు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

AP Drugs Smuggling Cases: గంజాయి స్వాధీనంలో ఏపీ టాప్- స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ సంచలనం

AP Drugs Smuggling Cases: గంజాయి స్వాధీనంలో ఏపీ టాప్- స్మగ్లింగ్ ఇన్ ఇండియా రిపోర్ట్ సంచలనం

Siddipet News: డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆటోడ్రైవర్ ఆత్మహత్య, కౌన్సిలరే కారణమంటూ సెల్ఫీ వీడియో!

Siddipet News: డబుల్ బెడ్రూం ఇళ్లు రాలేదని ఆటోడ్రైవర్ ఆత్మహత్య, కౌన్సిలరే కారణమంటూ సెల్ఫీ వీడియో!

టాప్ స్టోరీస్

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

MLA Poaching Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆ నలుగురూ నిందితులు కానట్లే - సిట్ మెమోను తిరస్కరించిన ఏసీబీ కోర్టు !

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

North Korea Crime news: కిమ్ సైకోయిజం- ఆ సినిమాలు చూశారని ఇద్దరు చిన్నారులకు మరణశిక్ష!

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Hyderabad Green Channel: 18 కిలోమీటర్లు 18 నిమిషాల్లో - గచ్చిబౌలి నుంచి సికింద్రాబాద్‌కు గుండె తరలింపు

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్

Keerthy Suresh: నన్ను కమిట్మెంట్ అడిగితే అదే చెప్తా - కాస్టింగ్ కౌచ్‌పై కీర్తి సురేష్