Rachakonda: రాచకొండ పరిధిలో 60 శాతం పెరిగిన సైబర్ నేరాలు... 55 శాతం కేసుల్లో నేరస్తులకు శిక్షలు... నేరాల జాబితాను ప్రకటించిన సీపీ మహేష్ భగవత్
హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 21685 నమోదు అయ్యాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. ఈ కేసుల్లో 55 శాతం నేరస్తులు శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు.
హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జరిగిన నేరాల జాబితాను సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. ఈ ఏడాదిలో 5779 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
NDPS Act కింద 33 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. 122 బాల్య వివాహాలను రాచకొండ పోలీసులు అడ్డుకున్నారని సీపీ మహేష్ భగవత్ అన్నారు. ఈ ఏడాది 55 శాతం నేరస్తులకు శిక్షలు ఖరారయ్యాయని తెలిపారు. 2021లో మొత్తం 21685 కేసులు నమోదు అయ్యాయన్నారు. ఈ ఏడాదిలో 1360 సైబర్ క్రైమ్ కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో రూ.14 కోట్లకు పైగా కేటుగాళ్లు కొల్లుకొట్టారని, వీటిల్లో రూ.8 కోట్లు రికవరీ చేశామన్నారు. ఈ ఏడాది 75 హత్యలు, 285 కిడ్నాప్ లు, 375 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 2446 అని ప్రకటించారు.
గృహ హింస కేసులు
17 కేసుల్లో వరకట్న వేధింపులతో మరణాలు, వరకట్న కోసం హత్యలు 3 జరిగాయని సీపీ మహేష్ భగవత్ తెలిపారు. మహిళ హత్యలు 11, పోక్సో కేసులు 394 నమోదు అయ్యాయన్నారు. గృహ హింస కేసులు 1403 నమోదు అయ్యాయని ప్రకటించారు. 2021లో 93 డ్రగ్స్ కేసులు నమోదు అయ్యాయని, ఈ కేసుల్లో 175 మంది అరెస్ట్ చేశామని, మరో 33 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని పేర్కొన్నారు.
మానవ అక్రమ రవాణా సంబంధించి 106 కేసులు నమోదు అవ్వగా, 354 మంది నిందితులను అరెస్ట్ చేశామని, 55 మందిపై పీడీ యాక్ట్ పెట్టామని సీపీ తెలిపారు. గేమింగ్ యాక్ట్ కింద రూ.కోటి యాభై లక్షలు స్వాధీనం చేశామని, ఈ కేసుల్లో 1079 మందిని అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు.
Also Read: జగన్ బెయిల్ రద్దుపై తీర్పు రిజర్వ్ - తెలంగాణ హైకోర్టులో పూర్తయిన వాదనలు !
డ్రంకన్ డ్రైమ్ కేసుల్లో రూ.2.02 కోట్లు జరిమానా
2020లో షీ టీమ్స్ 187 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, ఈ ఏడాది 140 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని సీపీ మహేష్ భగవత్ ప్రకటించారు. ఆఫరేషన్ స్మైల్ అండ్ ఆఫరేషన్ ముస్కాన్ ద్వారా 459 మంది చిన్నారులను పోలీసులు రెస్క్యూ చేశారని ప్రకటించారు. రాచకొండ పరిధిలో ఈ ఏడాది 2615 రోడ్డు ప్రమాదాలు జరిగాయాని సీపీ తెలిపారు. ఈ ప్రమాదాల్లో 642 మంది మృతి చెందారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కు పాల్పడిన 580 మందికి జైలు శిక్ష పడింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో రూ.2.02 కోట్ల జరిమానాలు విధించారు. 15 మంది మందుబాబుల లైసెన్సన్ లు రద్దు చేశారు. హెల్మెట్ ధరించని వారిపై 15.33 లక్షలు కేసులు నమోదు చేశారు. కోడి పందేలకు పాల్పడిన 16 మందిని అరెస్ట్ చేశారు.
Also Read: గ్రే హౌండ్స్, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి, కొనసాగుతున్న ఆపరేషన్
సైబర్ క్రైమ్స్
రాచకొండ పోలీసు కమిషనరేట్ లో గత ఏడాదితో పోలిస్తే 60 శాతం సైబర్ క్రైమ్ నేరాలు పెరిగాయి. సైబర్ క్రైమ్ 1360 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో 116 మంది నిందితులు అరెస్ట్ అయ్యారు. రూ.2.02 కోట్లు రికవరీ చేయగా, రూ.3.8 కోట్లు బ్యాంక్ అకౌంట్ ల నుంచి ఫ్రీజ్ చేశారు. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా 3291 ఫిర్యాదులు అందుకున్న రాచకొండ పోలీసులు.. 257 ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. రాచకొండలో ఈ ఏడాది 171 మంది పై పీడీ యాక్ట్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా 5630 ఫిర్యాదులు అందాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా 655, వాట్సాప్ ద్వారా 4665 ఫిర్యాదులు అందాయని సీపీ తెలిపారు. రాచకొండలో అలజడి సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ కు న్యాయస్థానం ఐదేళ్లు శిక్ష విధించిందని సీపీ ప్రకటించారు.