అన్వేషించండి

Jeevan Reddy Case : పక్కాగా రెక్కీ చేసి సింపుల్‌గా దొరికిపోయాడు - ఎమ్మెల్యే హత్యకు కుట్ర కేసులో కీలక అంశాలు !

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర కేసులో పోలీసులు కీలక సమాచారం సేకరించారు. పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లుగా గుర్తించారు.

 

Jeevan Reddy Case :   ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీ హత్య చేయడానికి ప్రయత్నం చేసిన మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ లావణ్య మరియు భర్త ప్రసాద్ గౌడ్ లపై  452.120b.506.307. సెక్షన్లపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్ గౌడ్ ను రిమాండ్ కు తరలించారు.. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో నివాసం ఉండే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని కక్షపూరితంగా హత్య చేయడానికి పథకం రచించిన ప్రసాద్ గౌడ్ కటకటాల పాలయ్యాడు.

ప్రసాద్ గౌడ్‌పై పలు సెక్షన్ల కింద కేసులు

బంజారాహిల్స్ పోలీసులు శరవేగంగా విచారణ జరిపి ప్రసాద్ గౌడ్ పై  హత్య చేయటానికి కుట్ర. అక్రమ ఆయుధాల నిలువలు.. అనుమతులేని ఆయుధాల కొనుగోలు వంటి కేసులు పె్టటారు. ప్రసాద్ గౌడ్‌పై 452.120b.506.307  లాంటి సెక్షన్లు విధించడం జరిగిందని బంజర హిల్స్ పోలీసులు స్పష్టం చేశారు. అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు ప్రసాద్ గౌడ్ భార్య లావణ్య కూడా A2 చేరుస్తూ కేసు నమోదు చేశారు. హత్య పూరిత కుట్ర అక్రమ ఆయుధ నిల్వలు అనుమతులు లేని ఆయుధాల క్రయవిక్రయాలు లాంటి కేసులు నమోదు చేయడం వల్ల సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది.  

ఆర్మూర్‌లో కూడా హత్యకు ప్లాన్

హైద్రాబాద్ తో పాటు ఆర్మూర్ లో కూడా ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకుప్రసాద్ గౌడ్ ప్లాన్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మెల్యేను ఎయిర్ గన్ తో హత్యచేసేందుకు ప్లాన్ చేశారని... నాందేడ్  లో తుపాకీని కొనుగోలు చేశారని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది.  హైద్రాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటిని కూడా ప్రసాద్ గౌడ్ క్షుణ్ణంగా రెక్కీ చేశారని పోలీసులు గుర్తించారు. మూడో అంతస్థు వరకు వెళ్లి ప్రసాద్ గౌడ్ రెక్కీ నిర్వహించారని గుర్తించారు.  ఎప్పుడెప్పుడు ప్రసాద్ గౌడ్ ఎమ్మెల్యే ఇంటికి వచ్చాడనే విషయమై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారుగతంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ప్రసాద్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేకు వేల కోట్ల రూపాయాలు ఎలా వచ్చాయని కూడా ప్రసాద్ గౌడ్ ప్రశ్నించారు. 

గతంలో ఎమ్మెల్యేను హెచ్చరిస్తూ పలు వీడియోలు 

ప్రసాద్‌ గౌడ్‌ గతంలో మాట్లాడిన ఆడియో క్లిప్‌లు వైరల్‌ అవుతున్నాయి. ఓ వ్యక్తికి ఫోన్‌కాల్‌ చేసిన ప్రసాద్‌గౌడ్‌.. తాను ఎవరో తెలుసుకోవాలంటూ హెచ్చరించాడు. తాను కెల్లెడి సర్పంచ్‌ అని.. అవసరమైతే ఎవరికైనా కాల్‌ చేసి తన గురించి తెలుసుకోవాలన్నాడు. అంతేకాదు.. తాను ల్యాండ్‌ డీలింగ్స్‌ చేస్తున్నానని.. కొంత డబ్బు ఇవ్వాలని  డిమాండ్ చేశాడు. అలాగే ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అంతు చూస్తానంటూ   వార్నింగ్‌ ఇస్తూ ఓ వీడియో కూడా రిలీజ్‌ చేశాడు. ఖబద్దార్‌ జీవన్‌రెడ్డి అంటూ హెచ్చరించాడు. జీవన్‌రెడ్డి డబ్బులిస్తే తాను లీడర్‌ కాలేదని.. తనంతట తాను ఎదిగానంటూ చెప్పుకొచ్చాడు. జీవన్‌రెడ్డికి భయపడేది లేదని.. ఆయన ఏం చేయలేరంటూ వార్నింగ్‌ ఇచ్చాడు ప్రసాద్‌గౌడ్‌. ఇప్పుడు నేరుగా పోలీసులకు చిక్కడంతో  ఎమ్మెల్యే సేఫ్‌గా బయటపడ్డారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Seven Hills Satish: దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి?  కారణాలు తెలుసా?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి? కారణాలు తెలుసా?
Preventing Stroke in Diabetics : మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
Advertisement

వీడియోలు

1987 Opera House Jewelry Heist | 40 సంవత్సరాలుగా దొరకని దొంగ
టెస్ట్‌ సిరీస్ కెప్టెన్‌గా పంత్.. వైస్ కెప్టెన్‌గా సాయి సుదర్శన్
ఒరే ఆజామూ..  1000 రోజులైందిరా!
బీసీసీఐ వార్నింగ్‌కి బెదరని నఖ్వి.. ట్రోఫీ నేనే ఇస్తానంటూ మొండి పట్టు
బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలుపుతో ఇండియాకి లైన్ క్లియర్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Indlu in Urban Area: తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
తెలంగాణ పట్టణాల్లో గూడులేని పేదలకు గుడ్‌న్యూస్- జి ప్లస్1 తరహాలో ఇల్లు కట్టుకునేందుకు అవకాశం
Seven Hills Satish: దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
దర్శకుడిగా మారుతున్న నిర్మాత... ఎన్టీఆర్ బావమరిదితో చేసే ఛాన్స్?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి?  కారణాలు తెలుసా?
గుడిలోకి చెప్పులు లేకుండా ఎందుకు వెళ్ళాలి? కారణాలు తెలుసా?
Preventing Stroke in Diabetics : మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
మధుమేహంతో స్ట్రోక్ వస్తుందా? మెదడుపై బ్లడ్ షుగర్ ప్రభావం ఎలా ఉంటుందంటే
Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 45 రివ్యూ... ఇమ్మూపై దువ్వాడ మాధురి దౌర్జన్యం... మళ్ళీ నోరు జారిన సంజన... హౌస్‌లో ఏం జరిగిందంటే?
బిగ్‌బాస్ డే 45 రివ్యూ... ఇమ్మూపై దువ్వాడ మాధురి దౌర్జన్యం... మళ్ళీ నోరు జారిన సంజన... హౌస్‌లో ఏం జరిగిందంటే?
Love OTP Movie: బన్నీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా... కానీ ఆయన సలహా వినలేదు - హీరో అనీష్
బన్నీతో డ్యాన్స్ ప్రాక్టీస్ చేశా... కానీ ఆయన సలహా వినలేదు - హీరో అనీష్
OG OTT: ఓటీటీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 'ఓజీ'... నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందంటే?
ఓటీటీలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ 'ఓజీ'... నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతోందంటే?
Tuni Rapist Issue: తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
తుని కీచక వృద్ధుడిపై పోక్సో కేసు - తమ పార్టీ కాదన్న టీడీపీ - చంద్రబాబు,లోకేష్ స్పందన
Embed widget