అన్వేషించండి

Tanmayi murder: వీడిన అనంతపురం విద్యార్థిని హత్య కేసు - పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చినందుకు చంపేసిన నరేష్?

Anantapur Crime : అనంతపురంలో జరిగిన విద్యార్థిని హత్య కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకోవాలని అడిగినందుకే హత్య చేసినట్లుగా గుర్తించారు.

Police arrested  Stunden murder accused: అనంతపురంలో ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థిని   దారుణ హత్య కేసును పోలీసు చేధించారు. నరేష్ అనే   యువకుడ్ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది.   అతను  విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లుగా గుర్తించారు.  పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన విద్యార్థిని అడ్డు తొలగించుకోవాలని నరేష్ చంపేశాడు.  నరేష్‌కు అప్పటికే పెళ్లయిపోయి ఉండడంతో అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశాడు.  ఈ క్రమంలోనే నిర్మానుష్య ప్రాంతానికి తన్మయిని తీసుకెళ్లి బండరాయితో మోది చంపినట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా తన్మయిని నరేష్ తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

విద్యార్తిని  కనబడటం లేదని  4వ తేదీన ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.  3న ఒక యువకుడితో రాత్రి 9 గంటల సమయంలో బైక్ పై వెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాలు లభించాయి.  విద్యార్థిని కాల్ హిస్టరీ, ఇన్‌స్టా డేటాను పరిశీలించిన పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత పోలీసులు అసలు నిందితుడ్ని గుర్తించారు. నరేష్ అనే యువకుడు భయపడి అంతా చెప్పేశాడు. తానే తన్మయిని చంపేశానని చెప్పాడు. ఆధారాలన్నీ నరేష్ చెప్పిన దానికి సరిపోలడంతో హత్య కేసులో మిస్టరీ వీడిపోయినట్లయింది. 

హత్య గురించి తెలిసిన వెంటనే  హోంమంత్రి అనిత  జిల్లా ఎస్పీతో మాట్లాడారు.  నిందితులను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై నారాలోకేష్ కూడా స్పందించారు.   అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని  హత్య ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్ కు గురిచేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు. ఇంటర్ విద్యార్థిని  హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. 

అంతకు ముందు వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు.   రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న గిరిజన బాలిక  ను అత్యంత దారుణంగా హత్యచేశారని ఆరోపించారు.   ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 

ఈ కేసును చాలెంజింగ్ తీసుకున్న పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్టు చేశారు. ప్రేమికుడని గుడ్డిగా నమ్మి వెళ్లి  విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. 

టాప్ హెడ్ లైన్స్

హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
హనీమూన్ మర్డర్ కేసులో ట్విస్ట్! సోనమ్‌ బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు! 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశం!
Telangana DGP Office Constable Suicide:తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ ఆత్మహత్య! సూసైడ్‌ నోట్‌లో కీలక విషయాలు!
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Daughter in law Stab Mother in law: అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?
అత్తను విచక్షణారహితంగా పొడిచిన కోడలు - సికింద్రాబాద్‌లో ఘోరం - ఇలాంటి కారణంతో కూడానా?

వీడియోలు

Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Vaibhav Ready For Zimbabwe T20 Series | జింబాబ్వే సిరీస్‌కు ముందు వైభవ్ కామెంట్స్
Sachin Tendulkar’s Advice to Harbhajan Singh | తన సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన హర్భజన్
Gundenininda Gudigantalu Serial July 23 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Rahul Gandhi Delhi NEET Protest: ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
ఢిల్లీలో నీట్ మంటలు - గాంధీ స్మృతి వైపు రాహుల్ గాంధీ, విపక్ష ఎంపీల మార్చ్.. బారికేడ్లతో నిలిపివేత!
IND vs ZIM 1st T20 Result Update: శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
శ్రేయస్ కెప్టెన్సీలో తొలి విజయం! .. జింబాబ్వేపై ఇండియా గ్రాండ్ విక్టరీ.. వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర హాఫ్ సెంచరీ
Minster Lokesh: అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
అమ్మపై ప్రేమను చాటే అద్భుత అవకాశం.. చిన్నారుల కోసం మంత్రి నారా లోకేశ్ వినూత్న కాంటెస్ట్
Vallabhaneni Vamsi Letter to CM Chandrababu: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ - పట్టిసీమ నీరు గన్నవరం మెట్ట రైతులకు ఇవ్వాలని విజ్ఞప్తి!
Tech Mahindra Employee Protest: 3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
3 రోజులు సెలవు పెట్టినందుకు ఉద్యోగం నుంచి తీసేశారు - టెక్ మహింద్రా ముందు మహిళా ఉద్యోగిని ధర్నా
Land Dispute Selfie Suicide Attempt: కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
కదిరిలో భూవివాదం సెల్ఫీ కలకలం - రైల్వే ట్రాక్‌పై కుటుంబం ఆత్మహత్య యత్నం.. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్‌పై తీవ్ర ఆరోపణలు!
Embed widget