News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Peddapalli Operation Chabutra : అర్ధరాత్రి అనవసరంగా రోడ్లపై తిరిగితే ఇక కేసులే, పెద్దపల్లిలో ఆపరేషన్ చబుత్రా- ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్

Peddapalli Operation Chabutra : అర్ధరాత్రి అకారణంగా తిరుగుతున్నా, గల్లీల్లో మద్యం సేవించి బైక్ లపై చక్కర్లు కొట్టినా ఇకపై కేసులు పెడతారు. పెద్దపల్లి జిల్లాలో ఆపరేషన్ చబుత్రా అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

FOLLOW US: 
Share:

Peddapalli Operation Chabutra :  శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆపరేషన్ చబుత్రా కార్యక్రమం చేపడుతున్నట్లు పెద్దపల్లి ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏసీపీ గిరి ప్రసాద్, సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆపరేషన్ చబుత్రా చేపట్టారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రధాన రహదారుల్లో పెట్రోలింగ్ చేపట్టి రాత్రి సమయంలో అకారణంగా రోడ్లపై తిరుగుతున్న 45 మంది అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు. రాత్రి 10:30 గం.ల తరువాత రోడ్లపై అనవసరంగా తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న వారిపై గతంలో కేసులు, నేరచరిత్ర ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మొబైల్ ఫింగర్ ప్రింట్స్ చెక్ డివైజ్ తో చెక్ చేశామన్నారు. అలాగే అర్ధరాత్రి గల్లీలో మద్యం సేవించి ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్న వారిని పోలీస్ స్టేషన్ కి తరలించి కౌన్సిలింగ్ ఇచ్చామని ఇన్ ఛార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. మరోసారి అకారణంగా బయట తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్ తో పాటు సీఐ రమేష్ బాబు, టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

" ఇక్కడ ఆపరేషన్ చబుత్రా అమలు చేస్తున్నాం. గతంలో ఇక్కడ కొందరు యువకులు తాగి డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాలు జరిగాయి. వాటిని అరికట్టేందుకు పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి నెలలో ఒకటి రెండు సార్లు ఆపరేషన్ చబుత్రా చేపడుతున్నాం. ఎవరైన బయట తాగుతూ కనిపిస్తే మహిళలకు కూడా భయంగా ఉంటుంది. అధి శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ఇవాళ 60 మంది పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.   "
-- అఖిల్ మహాజన్, ఇన్ ఛార్జ్ డీసీపీ, పెద్దపల్లి

ఆపరేషన్ చబుత్రా

హైదరాబాద్ పాతబస్తీలోని కాలాపతేర్‌లోని ఓ వీధిలో అర్ధరాత్రి పూట తిరుగుతున్న యువకులను నవ్వుతూ, కేకలు వేస్తూ కాలనీ వాసులను చాలాసేపు ఇబ్బంది పెట్టారు. అకస్మాత్తుగా ఒక పోలీసు వ్యాన్ వచ్చి ఆగింది. పోలీసులు యువకులను వ్యాన్‌లోకి ఎక్కించారు. వారిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా సమీపంలోని ఒక ఫంక్షన్ హాల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ పోలీసులు వారిని కూర్చొపెట్టి కౌన్సెలింగ్ ఇస్తారు. ఇదే పోలీసులు చేపట్టిన ఆపరేషన్ చబుత్రా. అర్ధరాత్రుళ్లు రోడ్లపై అనవసరంగా తిరుగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేసే యువకులకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి గత కొన్ని సంవత్సరాల క్రితం ‘ఆపరేషన్ చబుత్రా’లో నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ చబుత్రాలో రాత్రిపూట వీధుల్లో తిరిగే వారిని పట్టుకునే కార్యక్రమం. వీధి చివర్లో ఖాళీగా కూర్చోవడం, తరచుగా స్థానిక నివాసితులకు ఇబ్బందిని సృష్టిస్తుంది. 

Published at : 31 May 2022 07:35 PM (IST) Tags: Peddapalli News Operation Chabutra Youth roaming Roaming on roads

ఇవి కూడా చూడండి

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

UP Crime: టెస్ట్ చేస్తుండగా పేలిన గన్, మహిళ తలలోకి బులెట్ - పోలీస్ స్టేషన్‌లోనే ఘటన

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Mexico Voilent Clash: మెక్సికోలో గ్యాంగ్‌స్టర్‌లు గ్రామస్థులకు మధ్య కొట్లాట, 11 మంది మృతి

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

Hyderabad Crime News : అప్పు తీర్చలేదని దంపతుల హత్య- హైదరాబాద్‌లో దారుణం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

తాకట్టు కోసం వచ్చిన బంగారంతోనే వ్యాపారం- ఎస్బీఐ ఉద్యోగి ఘరానా మోసం - శ్రీకాకుళంలో సంచలనం

Vikarabad Serial killer arrest: మహిళల హత్యల కేసులో సైకో కిల్లర్ అరెస్ట్, సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు

Vikarabad Serial killer arrest: మహిళల హత్యల కేసులో సైకో కిల్లర్ అరెస్ట్, సంచలన విషయాలు వెల్లడించిన పోలీసులు

టాప్ స్టోరీస్

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో నూతన ఎమ్మెల్యేల ప్రమాణం - తొలుత సీఎం, తర్వాత మంత్రుల ప్రమాణ స్వీకారం, 14కు శాసనసభ వాయిదా

Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌

Chandra Babu Comments on Tickets: తెలంగాణ ఫలితాలతో చంద్రబాబు అలర్ట్ -అలాంటి వారికి డోర్స్‌ క్లోజ్‌

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

KCR And KTR Absent: అసెంబ్లీకి కేసీఆర్, కేటీఆర్ గైర్హాజరు - ప్రమాణస్వీకారం చేయకముందే ముగ్గురు రాజీనామా

ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ

ఎందుకు ఓడిపోయాం, ఎక్కడ తప్పు జరిగింది - ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ రివ్యూ