అన్వేషించండి

Coimbatore petrol bomb attack: ఇలా ఉన్నారేంట్రా? ప్రేమను నిరాకరించిందని ఇంటిపై పెట్రోల్ బాంబులేశాడు !

rejected love attack Tamil Nadu : కోయంబత్తూరు జిల్లా తొండముత్తూరులో ప్రేమను నిరాకరించిందని యువతి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి తెగబడ్డాడు ఓ యువకుడు. సిసిటివీలో రికార్డైన ఈ దృశ్యాలు వైరల్ గా మారాయి.

CCTV footage petrol bomb Coimbatore :  ఆ అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి ప్రేమించలేదు. కానీ అలా ప్రేమిచంకపోవడాన్ని  మరో విదంగా తీసుకున్నాడు. అదేదో శత్రువులు చంపేసుకోవాలన్నట్లుగా మారిపోయాడు. అమ్మాయి ఇంటిపై పెట్రోలు బాంబులేశాడు. కోయంబత్తూరులోని తొండముత్తూరులో జరిగిన ఈ సంఘటన నాగరిక సమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమ పేరుతో వేధించడమే కాకుండా, తన ఇష్టాన్ని నిరాకరించిందనే కక్షతో ఒక యువకుడు ఏకంగా పెట్రోల్ బాంబులతో యువతి ఇంటిపై దాడికి తెగబడ్డాడు.  

తొండముత్తూరు సమీపంలోని ఒక గ్రామానికి చెందిన యువతిని, చెన్నైకి చెందిన మారియప్పన్   అనే యువకుడు కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ వేధిస్తున్నాడు. వీరిద్దరికీ గతంలో కళాశాల రోజుల్లో పరిచయం ఏర్పడింది. అయితే, తన ఇష్టాన్ని ఆ యువతి ఖరాఖండిగా నిరాకరించడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో, బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మారియప్పన్ తన స్నేహితులతో కలిసి బైక్‌పై యువతి నివాసానికి చేరుకున్నాడు. అందరూ నిద్రపోతున్న సమయంలో వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాంబులను  ఒకదాని తర్వాత ఒకటిగా ఇంటి ముఖద్వారంపైకి విసిరాడు. బాంబులు పేలిన ధాటికి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదు. 

 సిసిటివీలో   దృశ్యాలు 

నిందితుడు  బాంబులు విసురుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సిసిటివీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. హెల్మెట్ ధరించి వచ్చిన మారియప్పన్, పక్కా పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు తొండముత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడు మారియప్పన్ , అతనికి సహకరించిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇలాంటి ఘటనలు పెరిగిపోతూండటంతో విషయం రాజకీయం అవుతోంది. విజయ్ పగ్గాలు చేపట్టిన తరవాత పోలీసు వ్యవస్థలో సీరియస్ నెస్ తగ్గిపోయిందని.. నేరగాళ్లు రెచ్చిపోతున్నారన మండిపడుతున్నారు.                                                          

టాప్ హెడ్ లైన్స్

ACB Raids Civil Supplies DM: సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
సివిల్ సప్లైస్ డీఎం ఇళ్లపై ఏసీబీ దాడులు.. రూ.40 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు , గతంలో రెండు సార్లు సస్పెండ్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Nadargul Land Scam: రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
రూ.700 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర.. ఫేక్ ఫర్మానాలతో ప్లాన్, 10 మంది అరెస్టు
Hyderabad Crime News: కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్
కుమార్తెను హుస్సేన్ సాగర్‌లో విసిరేసిన కన్నతల్లి.. ప్రాణాలకు తెగించి కాపాడిన ఆటో డ్రైవర్

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila House Arrest: ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
ఛలో లోక్ భవన్ నిరసన.. విజయవాడలో మూడంచెల భద్రత, పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Embed widget