అన్వేషించండి

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. మంగళవారం రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఆందోళన.
  • రాజేంద్రనగర్ పరిసరాల్లో భూకంపం తరహా ప్రకంపనలు రావడంతో పోలీసుల విచారణ.
  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైనుంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజేష్ ఆత్మహత్య.
  • ఆత్మహత్యకు గల కారణాలు తెలియవు, మృతదేహం కోసం గాలింపు కొనసాగుతోంది.

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉదయం భారీ శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఉదయం 9:15 గంటల సమయంలో ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్‌, కేశవస్వామినగర్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం తీవ్రతకు రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు తెలిపారు. దీంతో ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగిందా? లేక భూకంపం వచ్చిందా? అని ప్రజలు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఈ భారీ శబ్దం వెనుక గల కారణాలపై ఆరా తీస్తున్నారు. 


Also Read: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!

సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. విశాఖపట్నానికి చెందిన రాజేష్ (25) నాచారంలో ఉన్న ఒక హాస్టల్‌లో ఉంటూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న తన స్నేహితులను కలవడానికి వచ్చాడు. అనంతరం దుర్గం చెరువును చూడటానికి వెళ్లిన రాజేష్, అక్కడ కేబుల్ బ్రిడ్జి పైనుంచి ఒక్కసారిగా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

రాజేష్ అక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే రాజేష్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. రాజేష్ మృతదేహాన్ని వెలికితీసేందుకు NDRF, DRF బృందాలు దుర్గం చెరువులో గాలింపు చర్యలు  చేపట్టాయి. 

Also Read: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్

Frequently Asked Questions

హైదరాబాద్‌లో భారీ శబ్దం ఎక్కడెక్కడ వినిపించింది?

మంగళవారం ఉదయం 9:15 గంటల సమయంలో ఉప్పర్‌పల్లి, ఎర్రబోడ, లంగర్‌హౌస్‌, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో ఈ శబ్దం వచ్చింది. రాజేంద్రనగర్‌లో ప్రకంపనలు కూడా వచ్చాయి.

హైదరాబాద్‌లో వినిపించిన భారీ శబ్దానికి కారణం ఏమిటి?

ఈ భారీ శబ్దం ఎందుకు వచ్చిందో ఇంకా తెలియరాలేదు. భూకంపం లేదా బ్లాస్టింగ్‌ వల్ల వచ్చిందా అని స్థానికులు ఆందోళన చెందారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఎవరు?

విశాఖపట్నానికి చెందిన 25 ఏళ్ల రాజేష్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను నాచారంలో ఒక హాస్టల్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాజేష్ ఆత్మహత్యకు కారణం ఏమిటి?

రాజేష్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదు. రాజేష్ అక్క ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Arnab Helpline Numbers: అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
అర్నబ్ తుపాను బీభత్సం.. జిల్లాల వారీగా కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే
Dhanush Political Entry: కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
కోలీవుడ్ నుంచి హస్తిన దాకా బిగ్ స్కెచ్ - తమిళ రాజకీయాల్లోకి ధనుష్ ఎంట్రీ నిజమేనా? పొలిటికల్ స్కోప్ ఎంత?
Trains Cancelled: అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
అర్నాబ్ తుపాను ప్రభావంతో అక్టోబర్ 27, 28 తేదీల్లో పలు రైళ్లు రద్దు.. లిస్ట్ చూశారా
Healthy Gut : కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
కడుపు శుభ్రం కావాలంటే డీటాక్స్ డ్రింక్స్ అవసరం లేదు.. ఈ 3 అలవాట్లు చాలు, మలబద్ధకం కూడా తగ్గిపోతుంది
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
BRS Harish Rao:ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
ఏపీలో లేని క్రాప్ హాలీడే తెలంగాణలో ఎందుకు? తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ నీళ్లు తెస్తే రాజీనామాకు సిద్ధం- హరీశ్‌రావు సవాల్
డీలర్ల దగ్గరకు వచ్చిన Hero Karizma XMR 250.. 30hp పవర్, USD ఫోర్క్, ధర రూ.2 లక్షల దగ్గర!
త్వరలో రాబోతున్న Hero Karizma XMR 250 లుక్ ఇదే.. రెడ్ కలర్‌లో అదిరిపోయే స్పోర్టీ డిజైన్!
Dube Selection Danger: యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
యువ ఆల్‌రౌండర్ల మెరుపులతో సీనియర్‌ ప్లేయర్ కు ముచ్చెమటలు..!! నితీష్ , నమన్ దెబ్బకు దూబే కెరీర్ క్లోజ్?
Embed widget