అన్వేషించండి

Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్

శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో ఏఈ లలిత కుమారి హత్య కేసులో నిందితుడైన ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమానంతోనే హత్య చేశాడని తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాజాం ఏఈ లలితకుమారి హత్య కేసు భర్త పనేనని తేలింది.
  • భార్య బదిలీపై అనుమానంతో గొడ్డలితో హత్యకు ప్లాన్ చేశాడు.
  • రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినా, డాగ్ స్క్వాడ్ నిందితుడిని పట్టించింది.
  • చివరకు నేరం ఒప్పుకున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Electricity Department AE Murder Case | రాజాం: శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో కలకలం రేపిన విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) లలిత కుమారి హత్య కేసును రాజాం టౌన్ పోలీసులు ఛేదించారు. భార్య ప్రవర్తనపై అనుమానంతోనే ఆమె భర్త సీతారామరాజు గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 2003లో వివాహం జరిగిన తర్వాత భర్త ప్రోత్సాహంతోనే లలిత కుమారి బి.టెక్ పూర్తి చేసింది. మొదట జీఎంఆర్‌ఐటీ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేశారు. ఆ తర్వాత కష్టపడి చదివి 2017లో రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్‌ (AE)గా ఉద్యోగం సాధించి, ఇటీవల చీపురుపల్లిలో విధులు నిర్వహిస్తున్నారు.

అనుమానంతో పక్కా ప్లాన్.. గొడ్డలితో ఘాతుకం

లలిత కుమారికి ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతానికి ట్రాన్స్‌ఫర్ అయినప్పటి నుంచి ఆమెపై భర్త సీతారామరాజుకు అనుమానం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమెను హత్య చేయాలని ప్లాన్ రచించి, ప్రత్యేకంగా ఒక గొడ్డలిని కొనుగోలు చేసి ఇంట్లో దాచాడు. అక్టోబర్ 25న ఉదయం లలిత కుమారి రోజులాగే డ్యూటీకి వెళ్లేందుకు స్కూటీపై బయలుదేరగా, బస్టాప్ దగ్గర దింపుతానని నమ్మించిన భర్త కొండంపేట శ్మశాన వాటిక సమీపంలోకి రాగానే వాహనం ఆపాడు. ఆపై ఆమెపై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశాడు. అనంతరం భార్య మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.


Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్

పోలీస్ డాగ్ స్క్వాడ్ గుర్తింపుతో నిందితుడి అరెస్ట్

సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్‌లోని నిఘా శునకం నేరుగా మృతదేహం వద్ద నుంచి వెళ్లి ఆమె భర్త సీతారామరాజు వద్ద ఆగడంతో పోలీసులకు అతనిపై అనుమానం వచ్చింది. రాజును అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తానే స్వయంగా గొడ్డలితో నరికి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. దీంతో నిందితుడు అయిన ఏఈ భర్త సీతారామరాజును పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Frequently Asked Questions

శ్రీకాకుళం జిల్లా రాజాంలో హత్యకు గురైన విద్యుత్ శాఖ అధికారి ఎవరు?

శ్రీకాకుళం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ లలిత కుమారి హత్యకు గురయ్యారు. ఆమె భర్త సీతారామరాజు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

ఏఈ లలిత కుమారిని ఎందుకు హత్య చేశారు?

భార్య ప్రవర్తనపై అనుమానంతోనే ఆమె భర్త సీతారామరాజు లలిత కుమారిని హత్య చేశాడు. ఉద్యోగ రీత్యా ట్రాన్స్‌ఫర్ అయినప్పటి నుంచి ఈ అనుమానం మొదలైంది.

ఈ కేసులో నిందితుడిని పోలీసులు ఎలా పట్టుకున్నారు?

డాగ్ స్క్వాడ్ సహాయంతో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. నిఘా శునకం మృతదేహం వద్ద నుంచి నేరుగా భర్త సీతారామరాజు వద్దకు వెళ్లింది.

లలిత కుమారిని ఎప్పుడు, ఎక్కడ హత్య చేశారు?

అక్టోబర్ 25న ఉదయం, కొండంపేట శ్మశాన వాటిక సమీపంలో లలిత కుమారిని ఆమె భర్త గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
Hyderabad Crime News: మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా ఫోన్, వీడియోలు రికార్డ్.. కవాడిగూడ పవర్ గ్రిడ్‌ ఆఫీసులో కలకలం
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
Ishan Kishan Out: మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
మూడో టీ20 నుంచి ఇషాన్ కిషన్ ఔట్.. నంబర్ 3లో సూర్యవంశీ ఫ్లాప్ షోపై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Rahul Gandhi Convoy Accident: రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
రాహుల్ గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఢీకొన్న కార్లు
Arnab Cyclone: ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
ఏపీ వైపు దూసుకొస్తోన్న'అర్నబ్' తుపాను.. బాపట్ల-విశాఖ మధ్య తీరం దాటే అవకాశం.. రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్!
Tadipatri Tension: తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్రించిన నేత
తాడిపత్రి పీఎస్ ఎదుట జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసన.. మంచం వేసుకుని నిద్ర
Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
సుకన్య సమృద్ధి యోజన స్కీమ్.. ముగ్గురు కుమార్తెలకు SSY అకౌంట్లు సాధ్యమేనా?.. పూర్తి వివరాలు ఇవే!
Tips To Focus at Work : ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
ఆఫీసులో పని మీద ఫోకస్ చేయలేకపోతున్నారా? ఏకాగ్రత పెంచే ఈ టిప్స్ ట్రై చేయండి
Telangana El Nino: ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
ఎల్‌నినో సవాల్.. రేవంత్ సర్కార్‌కు ఆర్థిక సంక్షోభం -రూ.10 వేల కోట్ల సాయం కేంద్రం చేస్తుందా?
Embed widget