అన్వేషించండి

Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్

NTR statue inauguration: కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని విమర్శిస్తున్నారని ఎవరేమనుకున్నా భయపడనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. మైత్రివనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Revanth Reddy NTR statue inauguration:   హైదరాబాద్‌లోని అమీర్‌పేట మైత్రివనం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన   నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఘనంగా ఆవిష్కరించారు.  కాంగ్రెస్ సీఎం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏమిటని చాలా మంది విమర్శిస్తున్నారని..  ఎవరు ఏమనుకున్నా, ఎలాంటి విమర్శలు చేసినా నేను భయపడను, వెనక్కి తగ్గను  అని స్పష్టం చేశారు.  తెలుగు జాతి గర్వించదగ్గ మహానేతను గౌరవించడం ఏ పార్టీకి పరిమితం కాదని, అది అందరి బాధ్యత అని ఆయన ఉద్ఘాటించారు. జాతీయ స్థాయిలో ఇందిరా గాంధీ పి.వి. నరసింహారావు వంటి నాయకులను అందిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కూడా అదే స్థాయిలో సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేశారని కొనియాడారు.

 కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆరే! 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో మాజీ సీఎం కేసీఆర్‌పై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించారు.  నాడు ఎన్టీఆర్ లేకుంటే కేసీఆర్ గానీ, లేదా ఇతర నేతలు గానీ ఈ స్థాయికి వచ్చేవాళ్లా?  అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీ రామారావు అని, ఆయన నీడన బతికి ఈరోజు ఆయన గురించే తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయం చేస్తూ, ఆయన విగ్రహాల ఏర్పాటును వ్యతిరేకించడం లేదా తక్కువ చేయడం వారి  నకిలీ  ఆలోచనలకు నిదర్శనమని రేవంత్ ఎద్దేవా చేశారు.

 ఇందిరమ్మ ఇళ్లు - ఎన్టీఆర్ స్ఫూర్తి 

సంక్షేమ పథకాల విషయంలో ఎన్టీఆర్ దార్శనికతను రేవంత్ రెడ్డి ఆకాశానికెత్తారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన  పక్కా ఇళ్ల  పథకమే నేటి  ఇందిరమ్మ ఇళ్ల  పథకానికి పునాది అని ఆయన గర్వంగా ప్రకటించారు. పేదలకు గూడు కల్పించాలనే ఎన్టీఆర్ సంకల్పాన్ని తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోందని చెప్పారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి నేతలను రాజకీయాలకు పరిచయం చేసిన ఘనత ఎన్టీఆర్‌దేనని, ఆ వారసత్వాన్ని తాము గౌరవిస్తామని తెలిపారు.

 విమర్శలకు తావులేదు - రేవంత్ స్పష్టత 

కాంగ్రెస్ వేదికలపై ఎన్టీఆర్ నామాన్ని జపించడంపై వస్తున్న రాజకీయ విమర్శలను రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. రాజకీయాలకు అతీతంగా ఎన్టీఆర్ ఒక వ్యవస్థ అని, ఆయన విగ్రహం అమీర్‌పేట వంటి  ప్రాంతంలో ఉండటం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో ఎన్టీఆర్ వేసిన పునాదులను ఎవరూ విస్మరించలేరని, అలాంటి మహానుభావుడికి నివాళి అర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
 
మైత్రివనం వద్ద జరిగిన ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం కేవలం ఒక విగ్రహావిష్కరణలా కాకుండా, రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యానికి వేదికగా మారింది. ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులను ఆకట్టుకుంటూనే, మరోవైపు కేసీఆర్ , బీఆర్ఎస్ వైఖరిని ఎండగట్టడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఈ పరిణామం తెలుగుదేశం సానుభూతిపరులను కూడా కాంగ్రెస్ వైపు ఆలోచింపజేసేలా ఉందని  భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా  హాజరయ్యారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
NTR Health Update : ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ సక్సెస్ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Embed widget