అన్వేషించండి

Revanth Reddy CM Change Rumors: తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్! కాంగ్రెస్ అధిష్ఠానం కార్యాచరణ సిద్ధం చేస్తోందా?

Revanth Reddy CM Change Rumors: కర్ణాటకలో సిద్దరామయ్య స్థానంలో డీకే శివకుమార్ రాకతో తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ వేడి పెరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వం మార్పు ఉంటుందా? ఆ నేతల ఎత్తుగడలు ఫలిస్తాయా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రస్తుతానికి తెలంగాణలో సీఎం మార్పు ఆలోచన లేదని, మంత్రివర్గ విస్తరణపై కసరత్తు.

Telangana CM Revanth Reddy Change Rumors: కర్ణాటకలో టీంను మార్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మూడేళ్లు సీఎంగా ఉన్న సిద్ధరామయ్యను తప్పించి ఆయన స్థానంలో డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టబోతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను సజావుగా జరిగేలా చూస్తోంది. అయితే కర్ణాటకలో నాయకత్వం మార్చినట్టు తెలంగాణలో కూడా చేయించాలనే ఆలోచనలో కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారట. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేసి రెండున్నరేళ్లు అయ్యింది. అందుకే నాయకత్వంలో మార్పు దిశగా ఎందుకు అధిష్ఠానం ఆలోచించకూడదని ప్రశ్నిస్తున్నారట. కర్ణాటకలో అనుసరించే విధానం తెలంగాణకు ఎందుకు అప్లై చేయకూడదని కూడా అధిష్ఠానం వద్దకు రాయబారం పంపుతున్నట్టు తెలుస్తోంది. 

తెలంగాణపై కర్ణాటక ఎఫెక్ట్!

కర్ణాటకలో మారుతున్న రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలోనూ షేక్ చేస్తున్నాయి. అక్కడి మాదిరిగానే ఇక్కడ కూడా మార్పులు చేర్పులు జరిగేలా అధిష్ఠానాన్ని ఒప్పించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని సీఎంగా అంగీకరించని ఓ వర్గం నేతలు వీలుచిక్కినప్పుడల్లా అధిష్ఠానం వద్ద తమ అభిప్రాయాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే ఇప్పుడు కర్ణాటకలో మార్పులు చేస్తున్నందున పనిలో పనిగా తెలంగాణలో మార్పులు చేర్పులు చేయాలని రిక్వస్ట్ చేస్తున్నారు. ఎలాగూ మంత్రి వర్గ విస్తరణ చేయాల్సిన సమయం వచ్చిందని దానికి బదులు మొత్తం టీంను మారిస్తే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత బలపడుతుందని వారు విశ్లేషణలు వినిపిస్తున్నారు. 

Also Read: రేవంత్ సర్కార్ మైలేజీ మ్యాజిక్ - సునీల్ కనుగోలుతో కలిసి కొత్త ప్లాన్ - ఇమేజ్ మారిపోతుందా?

ఎప్పటి నుంచే రేవంత్ వ్యతిరేకంగా ప్రచారం

కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డికి అధిష్ఠానానికి ఫిర్యాదులు చేయడం, ఆయన్ని మార్చాలని డిమాండ్‌లు చేయడం ఇదేమి కొత్త కాదు. ఆయన పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సాగుతోంది. ఆయన పదవీ ప్రమాణం చేసిన నాటి నుంచే ఇలాంటి ప్రచారం సాగుతోంది. ఆయనకు అధిష్ఠానం వద్ద ప్రతిష్ట లేదని, అపాయింట్‌మెంట్స్ కూడా ఇవ్వడం లేదని కొన్ని రోజులు ప్రచారం సాగింది. ఎప్పటికప్పుడు వాటిని తన మార్క్ రాజకీయంతోనే తిప్పికొడుతూ వస్తోంది రేవంత్ వర్గం. ఇప్పుడు కర్ణాటకలో జరిగిన పరిణామాలతో ఇప్పుడు ఇలాంటి ప్రచారం ఊపందుకుంది. 

నేరుగా ఢీకొట్టిన నేత ఎక్కడ?

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి నాటి నుంచి నేరుగా ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేతలు కనిపించలేదు. అడపాదడపా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వారు మాత్రమే తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తర్వాత ఆయనపై కొందుర పార్టీ నుంచి వెళ్లిపోయిన తర్వాత రేవంత్‌ను విమర్శించారు. అటు మంత్రివర్గంలో కానీ, ఇటు పార్టీలో కానీ నేరుగా రేవంత్‌తో ఢీ కొట్టిన నేత కనిపించ లేదు. కానీ సమయం వచ్చినప్పుడల్లా అధిష్ఠానానికి మాత్రం రిపోర్టులు పంపిస్తున్నారని పార్టీ ఇన్‌సైడ్ టాక్. ఇది ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. 

ముందు నుంచి డీకే, సిద్ద మధ్య వర్గపోరు

కర్ణాటక కాంగ్రెస్ రాజకీయానికి, తెలంగాణలో రాజకీయానికి చాలా తేడా ఉంది. కర్ణాటకలో అధికారం చేపట్టిన మొదట్లోనే డీకే వర్గం, సిద్ధరామయ్య వర్గం మధ్య స్పష్టమైన ఒప్పందం జరిగిందని అంటున్నారు. రెండున్నరేళ్లు చొప్పున పదవిలో ఉండేందుకు అంగీకరించారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు ఇద్దరు నేతలు కూడా ఆఖరి నిమిషం వరకు ఫైట్ చేశారు. చివరకు డీకేను శాంతింపజేసిన అధిష్ఠానం సిద్ధరామయ్యకు కుర్చీని అప్పగించింది. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య తీవ్రమైన ఫైట్ నడిచింది. ఎప్పటికప్పుడు అధిష్ఠానం జోక్యం చేసుకొని వారికి సర్ది చెప్పింది. ఒకానొక స్టేజ్‌లో డీకే బీజేపీలోకి జంప్ అవుతారనే ప్రచారం సాగింది. అయితే ఇప్పుడు తన వర్గం నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో సీఎం కుర్చీ కోసం డీకే పట్టుబట్టారు. మూడేళ్లు పూర్తి కావడంతో తన సంగతి ఏంటని డీకే శివకుమార్ ప్రశ్నించడంతో సిద్ధరామయ్యను తప్పుకోమని కాంగ్రెస్ అధినాయకత్వం చెప్పింది.   

కాంగ్రెస్‌కు తలనొప్పి కలిగించే వర్గపోరు తెలంగాణలో లేదు

తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. ఎన్నికల దశ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అనధికారికంగా రేవంత్ రెడ్డి కొనసాగారు. పార్టీని తన కష్టంతో అధికారంలోకి తీసుకొచ్చారనే పేరు తెచ్చుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి కోసం ఒకరిద్దరు నేతలు ప్రయత్నాలు చేసినా అధిష్ఠానం మాత్రం రేవంత్ రెడ్డి పేరును మాత్రమే పరిశీలించింది. మిగతా ఆశావాహులతో చర్చించి వాస్తవాన్ని వివరించింది. దీంతో వారంతా సైలెంట్ అయిపోయారు. తమకు తగిన గౌరవం లభిస్తే చాలు అన్నట్టు ఉండిపోయారు. ఎప్పటికప్పుడు అధిష్ఠానం వద్దకు వెళ్లి తలనొప్పి కలిగించే నేతలు ఇక్కడ కనిపించడం లేదు. 

సీనియర్ల గౌరవానికి భంగం కలగకుండా..

ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత తన కంటే సీనియర్లను మంత్రివర్గంలో తీసుకున్న రేవంత్ రెడ్డి వారి గౌరవానికి భంగం కలగుండా జాగ్రత్త పడుతున్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడ వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు. ఇప్పటికుప్పుడు రేవంత్‌ను దించేసి సీఎం సీట్లు కూర్చోవాలనే ఆలోచన ఉన్న మంత్రులు కనిపించడం లేదు. ఉన్నా అలాంటి వారి చర్యలు ఆ దిశగా కనిపించడం లేదు. మరోవైపు కర్ణాటకలో జరిగినట్టు పవర్ షేరింగ్ ఒప్పందాలు జరగలేదు.  దీంతో రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేని కాంగ్రెస్ నేతలు కొందరు మాత్రమే అధిష్ఠానం వద్దకు వెళ్లి తమ మనసులోని మాటను చెబుతున్నారు. 

అందుకే అధిష్ఠానం మైండ్‌లో తెలంగాణలో టీం మార్చే ఆలోచన ఏదీ లేదని తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మంత్రివర్గ విస్తరణ విషయంలో మాత్రం కసరత్తు సాగుతోందని చెబుతున్నారు. దీనిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని, త్వరలోనే కీలక ప్రకటన వస్తుందని కూడా అంటున్నారు.  

Frequently Asked Questions

ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రేవంత్ రెడ్డి సీనియర్లకు గౌరవం ఇస్తున్నారా?

అవును, రేవంత్ రెడ్డి తనకంటే సీనియర్లను మంత్రివర్గంలో చేర్చుకుని, వారి గౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget