X
Super 12 - Match 17 - 25 Oct 2021, Mon up next
AFG
vs
SCO
19:30 IST - Sharjah Cricket Stadium, Sharjah
Super 12 - Match 18 - 26 Oct 2021, Tue up next
SA
vs
WI
15:30 IST - Dubai International Cricket Stadium, Dubai

Online Class: ఆన్ లైన్ క్లాసుల్లోనూ ఆగని అరాచకం..టీచర్ పై వరస్ట్ కామెంట్లు..రేప్ చేస్తానని విద్యార్థికి బెదిరింపులు

ఆన్ లైన్ క్లాసుల్లోనూ ఆడపిల్లలకు అరాచకాలు తప్పడం లేదు. ఆన్ లైన్ క్లాసులోకి చొరబడిన ఆగంతకుడు ఓ విద్యార్థిని పేరు చెప్పిమరీ అత్యాచారం చేస్తానని బెదిరించాడు.

FOLLOW US: 

కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ పరిస్థితి మొత్తం మారిపోయింది. నిత్యం విద్యార్థులతో కళకళలాడాల్సిన విద్యాలయాలు బోసిపోయాయి. పరిస్థితి కాస్త కుదుటపడుతున్న కొద్దీ అన్నీ పట్టాలెక్కినా కూడా ఇంకా మొదలు కానిది ఏమన్నా ఉన్నాయంటే  అవి చదువులే. ఏడాదిన్నరగా విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు దూరంగా ఆన్ లైన్ క్లాసుల వెంటపడ్డారు. కళ్లు కాయలు కాసేలా కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్ ల ముందు గంటల తరబడి కూర్చుంటున్న పరిస్థితులున్నాయి. ఎప్పుడెప్పుడు ఈ నాలుగు గోడల మధ్యనుంచీ నలుగురి మధ్యకి వెళతామా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంతకీ  విషయం ఏంటంటే చదువుకునేందుకు బయటకు వెళ్లే ఆడపిల్లలకు రకరకాల వేధింపులు తప్పవు. కానీ  ఇంట్లో ఉన్నా అవి కొనసాగడం బాధాకరం. అదికూడా ఆన్ లైన్  క్లాసులోకి చొరబడి మరీ బెదిరిస్తున్నారంటే ఏమనుకోవాలి.   

హైదరాబాద్ కి చెందిన ఓ పేరొందిన కళాశాల విద్యార్థుల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులు జరుగుతుండ‌గా హ‌ఠాత్తుగా ఓ అగంత‌కుడు సెడన్ గా ఆన్ లైన్లోకి చొరబడ్డాడు. ఓ విద్యార్థిని పేరు ప్రస్తావించి రేప్ చేస్తానని బెదిరించాడు. క్లాసు చెబుతున్న లెక్చరర్ వరస్ట్ అంటూ అసభ్యకర కామెంట్స్ పెట్టాడు. దీంతో అప్పటి వరకూ సబ్జెక్ట్ లో నిమగ్నమైన విద్యార్థులకు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. లెక్చరర్ పరిస్థితి కూడా దాదాపు ఇదే. విద్యార్థికి అసభ్యకరమైన మెసేజెస్ చేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని యాజమాన్యం మరుసటి రోజు పాస్ వర్డ్ మార్చేసింది.
Also Read:తెలంగాణలో 'మెడిసన్ ఫ్రం స్కై'.. డ్రోన్ల ద్వారా కోవిడ్‌ వ్యాక్సిన్లు.. నేటి నుంచి ట్రయల్స్

పాస్ వర్డ్ మార్చినా అగంతకుడు మాత్రం అస్సలు తగ్గలేదు. మ‌ళ్లీ వారి ఆన్‌లైన్ క్లాసుల్లో చొర‌బ‌డ్డాడు. కాలేజీ టీచ‌ర్ జీమెయిల్‌ను హ్యాక్ చేసి ప‌లువురికి అస‌భ్య‌క‌ర‌మైన మెయిల్స్ పంపించాడు. విస్తుపోయిన కాలేజీ యాజ‌మాన్యం తప్పని పరిస్థితిలో  రాచ‌కొండ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న సైబర్‌ క్రైం పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Also read: ఇవాళ ఈ రాశుల వారు శుభవార్త వింటారు, ఆ రాశుల ఉద్యోగులకు అంతా శుభసమయమే..ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే..!

Also read: పసిడి ప్రియులకు ఈ రోజు కూడా శుభవార్త..నిన్నటి కన్నా మరింత తగ్గిన బంగారం ధర

Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Also read: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు.. ఆ ఐదు జిల్లాల వారికి అలెర్ట్..

Tags: Hyderabad Online Class Unknown Person Nuisance threatened to rape a student

సంబంధిత కథనాలు

India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...

India Vs Pak Match Betting: భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్... విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు...

Warangal Crime: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Warangal Crime: మద్యం షాపులను టార్గెట్ చేసిన జల్సారాయుళ్లు... చోరీల్లో సిద్ధహస్తులు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

Nalgonda Lovers Suicide: నల్గొండ జిల్లాలో విషాదం... ప్రేమను చంపుకోలేక ప్రాణాలు తీసుకున్నారు...

Husband Sells Wife: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

Husband Sells Wife: పెళ్లైన రెండు నెలలకే భార్యను అమ్మేసిన భర్త.. ఆమెకు ఏం చెప్పి అమ్మాడో తెలుసా!

Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది

Hyderabad Crime: నడిరోడ్డుపై ఆగిపోయిన కారు... డోర్ తీసి చూస్తే మృతదేహం... కూపీ లాగితే వివాహేతర సంబంధం బయటపడింది
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

IND vs PAK, Match Highlights: దాయాది చేతిలో దారుణ ఓటమి.. పాక్‌పై పది వికెట్లతో చిత్తయిన టీమిండియా!

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అయిన ప్రియా.. షాక్ లో హౌస్ మేట్స్..

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Tdp Vs Ysrcp: దిల్లీకి చేరిన ఏపీ రాజకీయం... సోమవారం రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ బృందం

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు

Zika Virus In UP: యూపీలో తొలి జికా కేసు నమోదు.. అప్రమత్తమైన అధికారులు.. స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు