![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Petrol-Diesel Price, 9 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి.
![Petrol-Diesel Price, 9 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా.. Petrol diesel price today 9 september 2021 know rates fuel price in your city telangana andhra pradesh amaravati hyderabad Petrol-Diesel Price, 9 September 2021: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/08/336f5aab6860c42a02bf7d6c09015900_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా గురువారం(సెప్టెంబర్ 9) ఉదయం ఆరు గంటలకు దేశంలో పలు ప్రధాన నగరాల్లో ఇంధన ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. ఏపీ, తెలంగాణలో ఇంధన ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా ఇవాళ పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని పెట్రోల్, డీజిల్ ధరలు
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్ప వ్యత్యాసాలు కనిపించాయి. రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, లీటర్ డీజిల్ ధర రూ. 96.69గా ఉంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 104.83 ఉండగా, లీటర్ డీజిల్ ధర రూ.96.28గా ఉంది. కరీంనగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.13గా ఉండగా, లీటర్ డీజిల్ ధర ధర రూ.96.56గా ఉంది. ఖమ్మంలో పెట్రోల్ ధర రూ. 106.13గా ఉండగా, డీజిల్ ధర రూ. 97.49గా ఉంది. మెదక్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.106గా ఉండగా డీజిల్ ధర రూ.97.39గా ఉంది. రంగారెడ్డి జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 105.26, డీజిల్ ధర రూ.96.69గా ఉంది.
Also Read: ‘సర్కార్ వారి పాట’ సెట్లో శశిథరూర్.. మహేష్బాతో చిట్‌చాట్
ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు
విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.107.60, లీటర్ డీజిల్ ధర రూ.98.52 వద్ద ఉంది. విశాఖపట్నంలో పెట్రోల్ ధర రూ.106.22 ఉండగా డీజిల్ ధర రూ. 97.19 గా ఉంది. కృష్ణా జిల్లాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 107.07గా ఉండగా డీజిల్ ధర రూ.98.04గా ఉంది. గుంటూరు జిల్లాలో లీటర్ పెట్రోల్ రూ. 107.60, డీజిల్ రూ.98.52 వద్ద ఉంది. చిత్తూరు జిల్లాలో పెట్రోల ధర రూ.107.66, డీజిల్ ధర రూ.98.53 వద్ద ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో
దేశ రాజధాని దిల్లీలోని లీటర్ పెట్రోల్ ధర రూ. 101.19 వద్ద ఉండగా, డీజిల్ ధర రూ. 88.62గా ఉంది. ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.26, లీటర్ డీజిల్ ధర రూ.96.19గా ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ. 98.96 ఉండగా డీజిల్ ధర రూ.93.26లకు లభిస్తోంది. కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ.101.62, డీజిల్ ధర రూ. 91.71గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.104.70, డీజిల్ ధర రూ.94.04 గా ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)