Nalgonda News: మర్రిగూడ ఎమ్మార్వో అక్రమాస్తులు రూ.4.75 కోట్లు, అవినీతి అధికారిని అరెస్ట్ చేసిన ఏసీబీ
Nalgonda News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈక్రమంలోనే భారీగా నోట్ల కట్టలు దొరికాయి.
Nalgonda News: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నల్గొండ జిల్లా మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిచారు. ఈక్రమంలోనే వనస్థలిపురం హస్తినాపురంలోని శిరిడీ సాయి నగర్‌లో ఎమ్మార్వో ఇంట్లో భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. మహేందర్‌రెడ్డి అక్రమాస్తులు రూ.4.75 కోట్లుగా అధికారులు గుర్తించారు. ఓ పెట్టెలో దాచి ఉంచిన సుమారు రెండు కోట్ల రూపాయల నగదును అధికారులు గుర్తించారు.
కుటుంబసభ్యుల పేర్లతో ఉన్న స్థిర, చరాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం. అలాగే భారీగా బంగారం సహా పలు ఆస్తి పత్రాలను పట్టుకున్నారు. వాటన్నిటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈక్రమంలోనే మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో మహేందర్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.