అన్వేషించండి

Boy Died: నాగోల్ అయ్యప్ప కాలనీలో అదృశ్యమైన బాలుడు, చెరువులో మృతదేహంగా కనిపించడంతో విషాదం

Boy Died: నాగోల్ అయ్యప్ప కాలనీలో నిన్న అదృశ్యమైన బాలుడు అర్ధరాత్రి చెరువులో శవంగా కనిపించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Boy Died: హైదరాబాద్ నాగోల్  అయ్యప్ప కాలనీలో మూడేళ్ల బాలుడి అదృశ్యం విషాదాంతమైంది. ఆడుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలుడు మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బాలుడి మృతదేహాన్ని పక్కనే ఉన్న చెరువులో గుర్తించారు. ఒక్కగానొక్క కొడుకు ఇలా చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల వివరాల మేరకు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగోల్ అయ్యప్పనగర్ కాలనీకి చెందిన షేక్షావలి, సాకీరా భార్యభర్తలు. పదేళ్లుగా ఇదే కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి మూడేళ్ల కొడుకు షాహిద్ ఉన్నాడు. నిన్న షేక్షావలి బయటకు వెళ్లగా, సాకీరా ఇంట్లోనే ఉంది. అదే సమయంలో సాహిత్ ఆడుకుంటూ బయటకు వెళ్లాడు. అయితే, చాలా సమయమైనా షాహిద్ ఇంట్లోకి రాకపోవడంతో.. సాకీరా చుట్టుపక్కల గమనించగా ఎక్కడా కనిపించలేదు.

అర్ధరాత్రి శవంగా చెరువులో కనిపించిన బాలుడు.. 
బంధువులు, తెలిసిన వాళ్ల ఇంట్లో ఏమైనా ఉన్నాడా అని సాకీరా ఆరా తీసింది. ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో.. భర్త వచ్చిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో అదృశ్యమైన బాలుడి కోసం స్థానికులు కూడా వెతికారు. ఈ క్రమంలోనే కొందరు స్థానికులు కాలనీకి సమీపంలో ఉన్న చెరువులో అర్ధరాత్రి 12 గంటలకు ఓ మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే వారు విషయాన్ని పోలీసులకు తెలపడంతో.. హుటాహుటిన రంగంలోకి దిగారు. ఈతగాళ్ల సాయంతో ఆ మృతదేహాన్ని బయటకు తీయించారు. అయితే చెరువులో లభ్యం అయిన మృతదేహం అదృశ్యమైన షాహిద్ గా గుర్తించారు. వెంటనే బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆడుకునేందుకు బయటకు వెళ్లి మృతదేహంగా మారిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అనంతరం బాలుడిని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

"కావాలనే బాబును చెరువులో పడేసి చంపేశారు".. 
తన కొడుకును ఎవరో కావాలనే చెరువులో తోసేసి ఉంటారని, షాహిద్ మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ సాకీరా ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే స్థానికులు చూపించిన చొరవ పోలీసులు చూపించలేంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం ఫిర్యాదు చేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. 

కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగిన చిన్నారి!

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా భీంపూర్ గ్రామానికి చెందిన రాజేష్, లావణ్య దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల శాన్వి గుండి గ్రామంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో LKG చదువుతోంది. ఆదివారం పెద్దనాన్న ఇంటి వద్ద శాన్వి ఆడుకుంటోంది. పంటకు పిచికారీ చేయగా మిగిలిన పురుగుల మందును కూల్ డ్రింగ్ బాటిల్ నింపి ఇంటి దగ్గర పెట్టారు. అక్కడే ఆడుకుంటున్న పాప సీసాను చూసి కూల్ డ్రింక్ అనుకుని తాగింది. ఇంటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో వాసనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుటాహుటిన కాగజ్‌నగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం మంచిర్యాల ఆసుపత్రికి పంపారు. అక్కడ పది ఆసుపత్రులు తిరిగినా చోర్చుకోడానికి ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ఓ ఆసుపత్రిలో చేర్చుకున్నా అప్పటికే బాలిక ప్రాణాలు విడిచింది. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారి కళ్లముందే విగత జీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

వీడియోలు

ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ
టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nidhhi Agerwal : హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
హీరోయిన్స్ డ్రెస్సింగ్‌ కామెంట్స్‌పై శివాజీ క్షమాపణలు - హీరోయిన్ నిధి అగర్వాల్ రియాక్షన్!
Sivaji Reaction : ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
ఆ రెండు వర్డ్స్ తప్పు - నా స్టేట్మెంట్స్‌కు కట్టుబడి ఉంటా... హీరోయిన్స్ డ్రెస్సింగ్ కామెంట్స్‌పై శివాజీ రియాక్షన్
Pawan Kalyan In Ippatam: ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
ఇచ్చిన మాట కోసం ఇప్పటంలో పవన్‌ కళ్యాణ్ పర్యటన.. వృద్ధురాలి ఫ్యామిలీకి ఆర్థిక సాయం..
Hyderabad Crime News: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగురి అరెస్ట్
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. నలుగుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
Rohit Sharma: విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీతో మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ కొట్టేసిన రోహిత్‌ శర్మ- సిక్కింపై ముంబై విజయం
The Paradise Movie : నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
నాని 'ది ప్యారడైజ్'లో హీరోయిన్ ఫిక్స్? - కన్ఫర్మ్ చేసేసిన బ్యూటీ!
Vaibhav Suryavanshi: 36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
36 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపు సెంచరీ.. రికార్డులు తిరగరాసిన చిచ్చరపిడుగు
H1B visa: హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
హెచ్-1బీ వీసాలకు లాటరీ విధానం ఎత్తివేత - భారతీయులపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?
Embed widget