అన్వేషించండి

Chennai influencer killed: సిల్క్ చీరల వెనుక దాగి ఉన్న విషాదం - ఇన్‌ఫ్లుయెన్సర్ నాగలక్ష్మి దారుణ హత్య!

influencer killed: చెన్నై లో ఇన్ స్టాగ్రామ్‌లో లక్షలాది మందికి ఫ్యాషన్ పాఠాలు చెప్పిన ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్, తన భర్త చేతిలోనే హత్యకు గురయ్యారు. తాగడానికి డబ్బులివ్వలేదనే భర్త చంపేశాడు.

Chennai influencer killed by husband : సోషల్ మీడియాలో మెరిసే అందమైన వీడియోల వెనుక కొన్నిసార్లు భయంకరమైన చీకటి నిజాలు దాగి ఉంటాయని నిరూపించింది ఈ ఘటన. చెన్నైకి చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్,  శ్రీ సాయి సిల్క్స్ నాగలక్ష్మి తన సొంత ఇంట్లోనే భర్త చేతిలో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆమె భర్త సుబ్రమణ్యం కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. నంగనల్లూరులోని వారి నివాసంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.

 ఎవరీ నాగలక్ష్మి?                       

నాగలక్ష్మి అంటే కేవలం ఒక వ్యాపారవేత్త మాత్రమే కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 3 లక్షల మందికి పైగా ఫాలోయర్లు ఉన్నారు.  రంగురంగుల పట్టుచీరలను ఎలా ధరించాలి? ఏ చీరకు ఎలాంటి నగలు బాగుంటాయి? అంటూ ఆమె చేసే వీడియోలకు విపరీతమైన క్రేజ్ ఉండేది.   ఇంటికి ఏకైక ఆధారం ఆమెనే. నంగనల్లూరు, అన్నా నగర్ ప్రాంతాల్లో తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపిస్తూ, ఒక కొడుకును రష్యాలో ఎంబీబీఎస్, మరో కొడుకును డెంటిస్ట్రీ చదివిస్తున్నారు.

 కలత పెట్టిన డిస్టర్బింగ్ మెసేజ్              

పోలీసుల కథనం ప్రకారం.. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. రెండేళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయిన సుబ్రమణ్యం, ఇటీవల మళ్లీ ఇంటికి వచ్చారు. ఏప్రిల్ 27న తండ్రి నుండి వచ్చిన ఒక వింతైన మెసేజ్ చూసి భయపడ్డ చిన్న కొడుకు హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్లి చూసేసరికి అమ్మానాన్నలిద్దరూ విగతజీవులై పడి ఉండటంతో ఆ యువకుడు కుప్పకూలిపోయాడు.  

 గొడవకు కారణం ఏమిటి?

ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య తలెత్తిన తీవ్రమైన వాగ్వాదమే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య ఎదుగుదల చూసి కలిగిన అసూయనా? లేక ఆర్థికపరమైన గొడవలా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. నాగలక్ష్మిని చంపిన తర్వాత, సుబ్రమణ్యం కూడా బలవన్మరణానికి పాల్పడినట్లు నిర్ధారించారు. ప్రస్తుతం మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మద్యానికి బానిసై .. డబ్బులివ్వలేదని ఇలా చేసినట్లుగా అనుమానిస్తున్నారు.  సోషల్ మీడియాలో నవ్వుతూ కనిపించే ముఖాల వెనుక ఎన్ని బాధలు ఉంటాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.                               

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Kagaznagar Crime News: ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
ఐదేళ్ల చిన్నారిపై మేనమామ అత్యాచారం, కాగజ్‌నగర్‌లో ఉద్రిక్తత- నిందితుడి అరెస్ట్
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dhiraj Bommadevara Wins Gold: స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
స్వర్ణం సాధించిన ధీరజ్ బొమ్మదేవర.. విజయవాడ నుంచి విశ్వవేదికపై సత్తా చాటారని చంద్రబాబు అభినందనలు
Gannavaram News: గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
గన్నవరం సీఐ లంచాల సంపాదన రూ.20 కోట్లు! టీడీపీ కార్యకర్త సంచలన ఆరోపణలు
Telangana Assembly Protest Case: పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
పండుగ పూట కావాలనే ఇబ్బంది పెడుతున్నారు.. విచారణకు హాజరైన కేటీఆర్‌ పీఏ, పీఆర్వో
Vinayaka Chavithi At Chandrababu Home: ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో వినాయక చవితి వేడుకలు Photos చూశారా
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
Andhra Pradesh Rains: ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
ఏపీలో 12 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. పిడుగులు పడతాయని, అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!
Rashmika Mandanna : బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
బేబీ బంప్‌తో రష్మిక లుక్... భర్త విజయ్‌కు హగ్ - రణబాలి సెట్‌లో క్యూట్ మూమెంట్
Konda Surekha: పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
పదవి నుంచి తొలగించినందుకు బాధగా లేదు, మళ్లీ మంత్రిని అవుతాను: కొండా సురేఖ ధీమా
Embed widget