Mumbai Murder: మహిళ బాడీని ముక్కలుగా నరికాడు, కుక్కర్‌లో ఉడికించాడు - ఒళ్లు జలదరించే దారుణం
Mumbai Murder: ముంబయిలో సహజీవనం చేస్తున్న మహిళ బాడీని ముక్కలుగా నరికిన ఘటన షాక్‌కి గురి చేసింది.
Mumbai Murder:
ముంబయిలో ఘటన...
ముంబయిలో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. ఓ మహిళను ముక్కలు ముక్కలుగా నరికాడు ఓ వ్యక్తి. వీళ్లిద్దరూ చాన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం...డెడ్‌బాడీని ముక్కలు చేయడమే కాదు. వాటిలో కొన్ని భాగాల్ని కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్ని అవయవాలను మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. తలుచుకుంటేనే ఒళ్లు వణికిపోయేంత పాశవికంగా ప్రవర్తించాడు. ఇంటిని సీజ్ చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గీతానగర్‌లోని ఫేజ్-7 లో ఈ దారుణం జరిగింది. 56 ఏళ్ల మనోజ్ సానే, 32 ఏళ్ల సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఆమెను ఇలా రాక్షసంగా చంపేశాడు. పొరుగింటి వాళ్లకు దుర్వాసన రావడం వల్ల వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లు రంగంలోకి దిగాక కానీ ఈ మర్డర్ గురించి తెలియలేదు. అప్పటికే స్పాట్‌లో ఉన్న నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. శ్రద్ధావాకర్ హత్యను గుర్తు చేసింది ఈ మర్డర్. బాడీని ముక్కలు నరికి ఎక్కడ పడితే అక్కడ పారేయాలని అనుకున్నాడు. వాటిని కట్ చేయడానికి కట్టర్ మెషీన్‌ని వాడాడు. పోలీసులు ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. ప్రాథమికంగా కొన్ని వివరాలు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న ఆమె బాడీని కనిపించకుండా చేయాలని ఈ దారుణానికి పాల్పడినట్టు చెప్పారు.
"మనోజ్ సానే, సరస్వతి వైద్య మూడేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. సరస్వతి వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని మనోజ్ గమనించాడు. దీనిపై మూడు, నాలుగు రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతోంది. ఈ వివాదం ముదిరింది. మూడు రోజుల క్రితమే ఆమె విషం మింగి చనిపోయింది. పోలీసులు తనను అనుమానిస్తారేమో అన్న భయంతో డెడ్‌బాడీ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూశాడు. కట్టర్‌తో శరీరాన్ని ముక్కలుగా కోశాడు. వాటిని దాచి పెట్టాడు. కొన్నింటిన కుక్కర్‌లో వేసి ఉడికించాడు. మరి కొన్నింటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేశాడు. బైక్‌పై వాటిని పెట్టుకుని వాటిని పారేసేందుకు ప్రయత్నించాడు. ప్రస్తుతం ఈ ఇంటిని సీజ్ చేసి ఆ మహిళ శరీర భాగాల్ని సేకరించాం"
- పోలీసులు
#WATCH | Maharashtra | 32-year-old woman killed by 56-year-old live-in partner | As per Police, the accused Manoj Sahni killed Saraswati Vaidya 3-4 days back and after that, he purchased a tree-cutter to chop her into pieces. Police say that the accused boiled pieces of her body… pic.twitter.com/ilFUfWVOLY
— ANI (@ANI) June 8, 2023
శ్రద్ధా వాకర్ అనే 27 ఏళ్ల యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా అనే యువకుడు గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో భద్రపరిచాడు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని ముక్కలు పారవేశాడు. శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులు 6,636 పేజీల చార్జిషీట్‌ను విడుదల చేశారు. కేసు నమోదైన 75 రోజుల్లో చార్జిషీట్‌ను సమర్పించారు. గతేడాది నవంబర్ 12న ఢిల్లీ పోలీసులు నిందితుడు అఫ్తాబ్ ను అరెస్ట్ చేశారు.