The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చూపించినా మారని మనసు, ముస్లిం యువకుడితో వెళ్లిపోయిన యువతి
The Kerala Story: ముస్లింని ప్రేమించిన యువతికి ప్రగ్యా ఠాకూర్ కేరళ స్టోరీ సినిమా చూపించినా, ఆ యువతి మనసు మారలేదు.
![The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చూపించినా మారని మనసు, ముస్లిం యువకుడితో వెళ్లిపోయిన యువతి BJP MP Pragya Singh Thakur takes 19-year-old girl to watch The Kerala Story The Kerala Story: కేరళ స్టోరీ సినిమా చూపించినా మారని మనసు, ముస్లిం యువకుడితో వెళ్లిపోయిన యువతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/08/c0babc035b95f89bd557bdb1d65935781686204816605517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
The Kerala Story:
సినిమా చూపించిన ప్రగ్యా ఠాకూర్
దేశవ్యాప్తంగా కొద్ది రోజుల పాటు The Kerala Story సినిమా సంచలనం సృష్టించింది. అదే సమయంలో రికార్డు వసూళ్లు సాధించింది. దీనిపై ఎవరి వాదనలు వాళ్లు వినిపించినా...బీజేపీ మాత్రం వెనకేసుకొచ్చింది. "నిజాన్ని బయట పెట్టారు" అంటూ మేకర్స్‌పై ప్రశంసలూ కురిపించింది. కొన్ని చోట్ల ట్యాక్స్ ఎత్తివేసింది. కొందరు బీజేపీ నేతలైతే కావాలనే అమ్మాయిలని, అబ్బాయిలను వెంటపెట్టుకుని సినిమా చూపించారు. బీజేపీ భోపాల్ ఎంపీ సాధ్వి ప్రగ్యా సింగ్ ఠాకూర్ కూడా ఇలానే ఓ 20 ఏళ్ల యువతికి సినిమా చూపించారు. అప్పటికే ఆమె ముస్లిం అబ్బాయితో ప్రేమలో ఉంది. ఆ వ్యక్తి నుంచి యువతిని దూరం చేయాలనే ఉద్దేశంతో సినిమా చూపించారు ప్రగ్యా ఠాకూర్. ఈ సినిమా చూసి మనసు మార్చుకుంటుందని అనుకున్నా..అది జరగలేదు. ఆ వ్యక్తినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి పారిపోయింది. రూ.70 విలువైన నగదు, బంగారాన్ని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. ఆ తరవాత ఓ వీడియో పంపింది. "నేను పెద్దదాన్నే. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు" అని తేల్చి చెప్పింది.
తెలిసే చేస్తున్నా: యువతి
మే 11వ తేదీన అదృశ్యమైంది ఆ యువతి. తల్లిదండ్రులు కంగారుపడి ఎంపీ ప్రగ్యా ఠాకూర్ సాయం కోరారు. పోలీసుల సాయంతో ఆమెను ఎలాగోలా గుర్తించారు. కొంత మంది మహిళలతో కేరళ స్టోరీ సినిమాకు వెళ్తున్న ఠాకూర్...ఆ యువతినీ తీసుకెళ్లారు. అలా అయినా తన ఆలోచన మారుతుందని అనుకున్నారు. నాలుగు రోజుల వరకూ ఇంట్లోనే ఉన్న ఆ యువతి...మే 15 న మళ్లీ అదృశ్యమైంది. రాత్రి కనిపించిన అమ్మాయి, పొద్దున లేచి చూసే సరికి లేదని తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోడం లేదని ఆరోపిస్తున్నారు. తన చెల్లెలి ద్వారా ఓ ముస్లిం కుర్రాడిని పరిచయం చేసుకున్న యువతి...ఆ తరవాత ప్రేమలో పడింది. ఆ యువకుడిపై లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఛార్జ్ షీట్ ఫైల్ అయింది. అప్పటి నేర చరిత్ర ఉన్న యువకుడిని ప్రేమించింది. "నా కొడుకు చేసే పనులు చూడలేక ఇంట్లో నుంచి గెంటేశాను" అని ఆ యువకుడి తండ్రి స్పష్టం చేశాడు. ప్రస్తుతానికి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. ఆమెని గుర్తించిన తరవాతే...ఏ చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని తెలిపారు.
కమల్ హాసన్ స్పందన..
చిత్రాన్ని కొన్ని చోట్ల బ్యాన్ చేయడం పై కమల్ హాసన్ స్పందించారు. ఇదే సమయంలో తమిళనాడులో తన సినిమా ‘విశ్వరూపం’ మీద బ్యాన్ విధించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. “’ది కేరళ స్టోరీ’ ట్రైలర్ లో 32 వేల మంది మహిళలు ఐఎస్ఐఎస్ లో చేరారని చెప్పారు. ఆ తర్వాత 32 వేలు కాదు ముగ్గురు అని నిర్మాతలు సవరించారు. ఈ నిర్ణయంతోనే సినిమా క్రెడిబిలిటీపై అనుమానాలు పెరిగాయి. నేను ఈ సినిమా చూడలేదు. కానీ, ప్రజలు దాని గురించి ఏం మాట్లాడారో విన్నాను. సినిమా దర్శక నిర్మాతలు సంఖ్యలతో అతిశయోక్తి చేయలేరు అని గుర్తు పెట్టుకోవాలి” అన్నారు కమల్ హాసన్.
Also Read: Mumbai Murder: మహిళ బాడీని ముక్కలుగా నరికాడు, కుక్కర్‌లో ఉడికించాడు - ఒళ్లు జలదరించే దారుణం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)