అన్వేషించండి

Annamayya District: అన్నమయ్య జిల్లాల్లో తీవ్ర విషాదం - పిల్లలతో సహా నీటిలో దూకి తల్లి ఆత్మహత్య

Andhrapradesh News: అన్నమయ్య జిల్లాలో ఓ మహిళ కుటుంబ కలహాలతో తన ముగ్గురు పిల్లలతో కలిసి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Mother Forceful Death With Her Children In Annamayya District: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి నీటిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాలోని గాలివీడు (Galiveedu) మండలం చిలుకలూరిపేటకు చెందిన నాగమణి, విక్రమ్ భార్యాభర్తలు. వీరికి నవ్యశ్రీ (10), దినేశ్ (6), జాహ్నవి (3) ముగ్గురు పిల్లలు ఉన్నారు. విక్రమ్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక సమస్యలతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇదే విషయమై శుక్రవారం రాత్రి భార్య నాగమణితో విక్రమ్ ఘర్షణ పడ్డాడు. దీంతో నాగమణి మనస్తాపంతో పిల్లలతో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అనంతరం వెలిగల్లు ప్రాజెక్ట్ వద్ద ఉన్న గండిమడుగులో పిల్లలతో సహా దూకేసింది. గండిమడుగు ఒడ్డున ఉన్న చెప్పులు, సెల్ ఫోన్ ను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మృతదేహాలను వెలికితీసి.. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు నాగమణి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

తల్లిపై కత్తితో తనయుడు దాడి

అటు, ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కసాయి కొడుకు కన్నతల్లిపైనే కత్తితో దాడి చేశాడు. గ్రామానికి చెందిన సురేష్ తన కన్నతల్లిని కత్తితో పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను స్థానికులు నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చెడు వ్యసనాలకు బానిసైన కొడుకుని తల్లి తరచూ మందలించేది. ఇరువురి మధ్య తరచూ ఘర్షణ జరుగుతున్న నేపథ్యంలో ఆస్తి పంపకాలు చేయాలని కొడుకు తల్లిపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి నిరాకరించిన తల్లి నోటీసు పంపించడంతో ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.

భర్తను చంపిన భార్య

నిత్యం తాగొచ్చి వేధిస్తున్నాడని తన భర్తను ఓ మహిళ తన మామ సహకారంతో దారుణంగా హతమార్చింది. ఈ ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలసలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పన్న, దేవి భార్యభర్తలు. మద్యానికి బానిసైన అప్పన్న తరచూ భార్యను డబ్బుల కోసం ఇబ్బంది పెడుతూ.. ఆమెపై వేధింపులకు పాల్పడేవాడు. శుక్రవారం ఇంటికి తాగొచ్చిన భర్తతో భార్య గొడవకు దిగింది. దీంతో గొడవ తీవ్రం కాగా ఆవేశంతో భర్తను ఉరేసి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ హత్యకు మామ సహకరించినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Bonda Uma: 'పోలీసులు నన్ను వేధిస్తున్నారు' - తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే న్యాయ పోరాటానికి దిగుతానన్న బొండా ఉమ

టాప్ హెడ్ లైన్స్

Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి
Tirumala Road Accident: తిరుమల ఘాట్ రోడ్డులో లోయలో రోడ్డు ప్రమాదం.. కర్ణాటకకు చెందిన భక్తుడి మృతి

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Gen Z Protests India 2026: జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
జెన్‌జీ ఉద్యమాలు, ప్రశాంత్ కిషోర్ విజయం బీజేపీ స్క్రిప్టేనా - దేశ రాజకీయాల్లో అసలేం జరుగుతోంది?
Telangana BJP: తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
తెలంగాణలో ఇకపై పోరు కాంగ్రెస్ Vs బీజేపీ మాత్రమే - రోడ్ మ్యాప్ రెడీ చేసిన హైకమాండ్ - ఇక కమలం దూకుడేనా?
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - ఈ వారం థియేట్రికల్ రిలీజెస్... మీరు ఛాయిస్ ఏంటి?
Vizag and Vijayawada Metro Rail:విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులో కదలిక!లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
కారు నుంచి లారీ వరకు.. ఫిట్‌నెస్‌ను ఇక యంత్రాలే పరీక్షిస్తాయి! తెలంగాణలో 15 చోట్ల కొత్త వ్యవస్థ
మీ కారు ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఇక కొత్త రూట్‌లో.. మాన్యువల్‌ పరీక్షలకు చెక్‌!
Gold- Silver Price Today 10 August 2026: ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
ఆగస్టు 10న బంగారం ధర ఎంత? వెండి ధరలు కూడా మారాయా?  
Embed widget