Arrest: డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ టోని అరెస్టు.. హైదరాబాద్ లోని ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా
మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోని.. పోలీసులకు చిక్కాడు. తప్పించుకుని తిరుగుతున్న టోనీని టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబాయిలో అరెస్టు చేశారు.
మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ మాఫియా ప్రధాన నిందితుడు టోనిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి కేంద్రంగా డ్రగ్స్ నెట్ వర్క్ నిర్వహిస్తున్న టోని దేశంలోని.. ముఖ్య పట్టణాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడు. టోనిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ముంబాయిలో అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. టోని నైజిరియాకు చెందిన వ్యక్తి అని.. ముంబయి కేంద్రంగా ఏజెంట్స్ పెట్టుకుని.. ఇండియా మెుత్తం.. డ్రగ్స్, కొకైన్ రవాణా చేస్తున్నట్టు చెప్పారు. బెంగుళూరు, ముంబయిలో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్రత్యేక ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించామని సీవీ ఆనంద్ చెప్పారు.
అయితే హైదరాబాద్ లోని కొంతమంది ప్రముఖులకు సైతం.. టోని గ్యాంగ్ డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులు గుర్తించారు. టోనితోపాటు మరో 9 మందిని కూడా ముంబయిలో అరెస్టు చేశారు. టోని టెంపరరీ వీసా, పాస్ పోర్టుతో భారత్ వచ్చాడని సీవీ ఆనంద్ చెప్పారు. ఇక్కడ డ్రగ్స్ దందా నడుపుతున్నట్టు వెల్లడించారు. అయితే పాస్ పోర్టు గడువు తీరాక కూడా.. రహస్యంగా తల దాచుకున్నట్టు గుర్తించామని చెప్పారు. ముంబయిలోని ఈస్ట్ అంథేరిలో మకాం ఏర్పాటు చేసుకుని..ఉంటున్నాడన్నారు.
మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్న వారిపైనా.. ఇకపై కేసులు నమోదు చేస్తామని సీవీ ఆనంద్ చెప్పారు. 9 మంది డ్రగ్స్ వాడుతున్న వ్యక్తులను గుర్తించి.. సెక్షన్ 27 కింద రిమాండ్ కు పంపించినట్టు చెప్పారు. హైదరాబాద్ లో డ్రగ్స్ కట్టడి కోసమే ఈ అరెస్ట్‌లనిస్పష్టం చేశారు. టోనికి ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షైక్ గతంలోనే అరెస్టు అయ్యాడు.
Also Read: Dasari Arun Kumar: దాసరి అరుణ్ కుమార్ పై కేసు నమోదు... మద్యం మత్తులో కారుతో బీభత్సం
Also Read: Jagityala Crime: జగిత్యాలలో దారుణం... మంత్రాల నెపంతో ముగ్గురి దారుణ హత్య..!
Also Read: Chittoor: భర్తను చంపి తలను సంచిలో పెట్టుకున్న భార్య.. వెంటనే ఆటో ఎక్కి ఎక్కడికి వెళ్లిందంటే..!