By: ABP Desam | Updated at : 20 Jan 2022 02:03 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
భార్య భర్తల అనుబంధం ప్రేమ, అప్యాయతలకు, అనురానికి నిలయం. ఒకరిపై మరొకరి ప్రేమ అభిమానాలకు నిదర్శనంగా దాంపత్య జీవితం సాగాలి. కానీ, నేడు చిన్న పాటి విభేదాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇంకొందరు పరాయి వారితో వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. క్షణికావేశంలో ఒకరి ప్రాణాలు మరొకరు తీసేందుకు కూడా వెనకాడడం లేదు. తాజాగా కట్టుకున్న భర్తనే అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి భార్య హత్య చేసిన ఘటన జరిగింది. అనంతరం భర్త తలను వేరు చేసి పోలీసులకు లొంగిపోయిన ఘటన చిత్తూరు జిల్లాలో సంచలనం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్ళితే.. తాళి కట్టిన భర్తను భార్యే విచక్షణారహితంగా కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నరసారావు పేటకు చేందిన రవిచందర్‌కు గిద్దలూరుకి చేందిన వసుంధరకు 25 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుండి రేణిగుంటలోని బుగ్గ వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. రవిచందర్ చిన్న పరిశ్రమను నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో తాను నడిపే పరిశ్రమ వద్ద ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇలా కొద్ది నెలల పాటు అక్రమ సంబంధం బయటకు రాకుండా రవిచందర్ రహస్యంగా కొనసాగించేవాడు.
అయితే తన భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని తెలుసుకున్న వసుంధర తరచూ రవిచందర్‌తో గొడవ పడేది. భర్తను మందలించే ప్రయత్నం చేసింది. కానీ, భర్తలో ఎటువంటి మార్పు రాకపోవడంతో రవిచందర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను నిలదీసింది. అయినా పలితం లేకపోవడంతో రోజూ ఇంట్లో భర్తతో గొడవకు దిగేది. ఈ వివాదం కాస్త రోజు రోజుకి అధికం అయ్యేది. ఇంట్లో కుమారుడికి మతిస్తిమితం లేని కుమారుడిని చూసుకోవాల్సింది పోయి మరొక మహిళతో అక్రమ సంబంధం ఎందుకని వసుంధర గట్టిగా భర్తను నిలదీసేది. ఇలా మాట మాట పెరిగి.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్లింది.
ఆ కోపంతో ఉన్న వసుంధర ఒక్కసారిగా భర్త రవిచందర్ పై ఓ కత్తితో దాడి చేసింది. రవిచందర్ ను అత్యంత క్రూరంగా హత్య చేయడమే కాకుండా అతని తలను, మొండేన్ని వేరు చేసి ఆ తలను ఓ కవర్‌లో వేసుకుని పోలీసులకు లొంగి పోయేందుకు ఆటోలో బయలు దేరింది. ఇంతలో ఆమె ఒంటిపై రక్తం మరకలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలం చేరుకున్న పోలీసులు వసుంధరను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు విచారణలో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తన భర్తతో విభేదాల కారణంగానే హత్య చేసినట్లు పోలీసులకు వసుంధర తెలిపినట్లు సమాచారం.
Also Read: Hyderabad: తెలంగాణలో మరో కుంభకోణం? గిడ్డంగుల సంస్థలో రూ.కోట్లు కాజేసేందుకు కుట్ర!
Also Read: హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు వాడాల్సిన మందుల లిస్టు ఇదే.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన
Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు
Accidents In Tirumala Ghat Road: తిరుమల ఘాట్‌లో ఒకే రోజు రెండు ప్రమాదాలు, 12 మందికి గాయాలు
రూమ్‌లో ఫుల్‌గా ఏసీ పెట్టుకుని పడుకున్న డాక్టర్, చలికి తట్టుకోలేక ఇద్దరు పసికందులు మృతి
Hyderabad Drug Case: డ్రగ్స్ కేసులో దర్శకుడు సహా రచయిత అరెస్టు, వాళ్లెవరంటే?
సోషల్‌మీడియా ఖాతాలకు లైక్ కొట్టారో, మీ ఖాతా ఖాళీ
Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా
Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!
AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం
God Trailer: మీరు సెన్సిటివ్ అయితే ఈ ట్రైలర్ చూడకండి - డిస్టర్బింగ్ సైకోథ్రిల్లర్‌తో వచ్చిన జయం రవి!
/body>