అన్వేషించండి

బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం- గర్భం దాలచ్చడంతో వెలుగులోకి!

14 ఏళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే బాలికలో మార్పులు కనిపించడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీకెళ్లగా అసలు విషయం బయటపడింది. 

కల్లా కపటం‌ ఎరుగని హృదయం వారిది. అంతా తన వాళ్లే అనే‌ భావనలో ఉంటారు చిన్నారులు. కాని కొందరు దుర్మార్గులు తమ కామవాంఛ తీర్చుకుని బాలికల‌ జీవితాలను చిదిమేస్తున్నారు. వావి వరుసలు మరిచి పసికందుల వద్ద నుంచి పండు ముసలి వాళ్ల వరకు ఎవరినీ వదలడం లేదు. ముఖ్యంగా మహిళల రక్షణకు అనేక చట్టాలు అమలు చేస్తున్నా, కామాంధుల‌ వెన్నులో మాత్రం ఏమాత్రం‌ వణుకు పుట్టడం‌ లేదు. తాజాగా ఇద్దరు కామాంధులు 14 ఏళ్ల బాలికపై వరుస అత్యాచారాలకు పాల్పడి గర్భవతిని చేసిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పథకం ప్రకారమే మాట కలిపిన మధుసూదన రావు..!

తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప తెలిపిన వివరాల‌ మేరకు... వెంకట గిరికి చెందిన మధుసూదన రావు(26) ఆర్థిక ఇబ్బందులు కారణంగా గత కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని తన అక్క ఇంటికి వచ్చాడు. అయితే  బతుకుదెరువు కోసం మధుసూదన్ రావు పెయింటింగ్ పనులు చేస్తూ ఇక్కడే జీవించే వాడు. ఈ క్రమంలో సమీప బంధువైన 14 ఏళ్ల బాలికపై మధుసూదన్ రావు కన్ను పడింది. ఎలాగైనా ఆ 14 ఏళ్ళ బాలికను లోబరుచుకోవాలని పన్నాగం పన్నాడు. పెయింటింగ్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బాలికను పలకరిస్తూ, బాలికకు దగ్గర అయ్యే ప్రయత్నం చేసేవాడు.

చిరుతిళ్లు తెచ్చిస్తూ బాలికతో స్నేహం..

అంతే కాకుండా బాలికకు చిరుతిండ్లు వంటివి తీసుకుని వస్తూ, బాగా మచ్చిక చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయపడి మధుసూదన్ రావు వద్ద నుంచి తప్పించుకుని వెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే బాలికను పట్టుకుని భయపెట్టిన మధుసూదన్ రావు, పలుమార్లు బాలికపై అత్యచారంకు పాల్పడ్డాడు. అయితే ఇటీవల బాలిక గర్భం దాల్చిందని అనుమానం వచ్చిన‌ మధుసూదన్ రావు తిరుపతి నుంచి వెళ్ళి పోయాడు. ఆ సమయంలోనే బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళిన 14 ఏళ్ళ బాలిక తల్లి తిరిగి వచ్చింది. బాలిక శరీరంలో మార్పులు గమనించిన బాలిక తల్లి స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించింది. 

కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలింపు!

అయితే వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ఏడు నెలలు గర్భవతి అని నిర్ధారించడంతో ఆమె తల్లి ఒక్కసారిగా షాక్ కి గురైంది. బాలిక తల్లి, గర్భానికి కారణమైన వారి పేరు చెప్పాలని బాలికను గదమాయించడంతో బాలిక జరిగిన విషయం తల్లికి వెల్లడించింది. దీంతో బాలిక తల్లి ముత్యాల రెడ్డి పల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ నరసప్ప విచారించారు. విచారణ సమయంలో తనపై అదే ప్రాంతానికి చెందిన మరోక వ్యక్తి వెంకటేశ్ (48) అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పేర్కొనగా పోలీసులు విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందుతులపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

టాప్ హెడ్ లైన్స్

Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Splendor Siddha Reddy Arrest: అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
అతడి పేరు సిద్ధారెడ్డి..స్ప్లెండర్ సిద్ధారెడ్డి.. స్ప్లెండర్ బైకుల్ని మాత్రమే మాయం చేస్తాడు !
Ketan Agarwal Murder Case Pune: పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్
పుణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ - సియా మీద తోసేసి తప్పించుకుంటున్న బాయ్ ఫ్రెండ్ చేతన్

వీడియోలు

IND W vs BAN W T20 World Cup Highlights | బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం
Shree Charani Creates History In T20 World Cup | శ్రీ చరణి హిస్టారికల్ రికార్డ్
94-Year-Old Woman Renounces US Citizenship | US సిటిజన్‌షిప్ వద్దని తిరిగొచ్చిన బామ్మ
Bhumika Ramesh Biography | మేఘసందేశం భూమి రియల్ లైఫ్ స్టోరీ ఇదే
NBK112 Pooja Ceremony Balakrishna | NBK112 పూజా కార్యక్రమం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tadipatri Latest News: తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
తాడిపత్రిలో మళ్లీ పొలిటికల్ అలజడి! పోటాపోటీ నిరసనలతో ఉద్రిక్తత! ప్రభాకర్ రెడ్డి, పెద్దారెడ్డి హౌస్ అరెస్టు!
Hyderabad Bullet Train Corridor: బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
బుల్లెట్ రైలు డీపీఆర్‌కే ఏళ్లకేళ్లు - ఇక నిర్మాణం ఎప్పటికీ - చెప్పుకోవడానికేనా ?
Khairatabad Ganesh Idol 2026: 2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
2026లో ఖైరతాబాద్ గణపతి రూపం, విశిష్టత ఇదే!
Gade Sai Krishna Case: సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
సాయికృష్ణ మృతదేహం ఎక్కడ? కూపీ లాగుతున్న సిట్ అధికారులు! ఇంకా అజ్ఞాతంలోనే కానిస్టేబుల్స్‌!
Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
Baahubali 3 Update : బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
బాహుబలి 3 ఉంటుంది - అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
Singer Sunitha : మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
మై బాడీ మై విష్... అలాంటి సొసైటీలో ఉన్నాం - చిన్మయి కామెంట్స్‌కు సింగర్ సునీత కౌంటర్
Embed widget