అన్వేషించండి

Matrimony Fraud: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ' - జరిగే పెళ్లి నిజం కానీ వధువు మాయం, కట్ చేస్తే!

Crime News: ఓ కుటుంబంగా ఏర్పడతారు. పేదింటి యువతికి పెళ్లి చేస్తున్నట్లు నమ్మిస్తారు. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంటారు. పెళ్లి కాని వారే టార్గెట్‌గా ప.గో జిల్లా ఈ తరహా మోసాలు ఇటీవల పెరుగుతున్నాయి.

Matrimony Fraud In Godavari Districts: 'తల్లిదండ్రులు లేని పిల్ల బాబూ.. ఎన్నో కష్టాలు పడింది. మీ ఇంటికెళ్లాక అయినా సుఖపడుతుంది.' అని కన్నీళ్లు పెట్టుకుంటారు. ఇదంతా నమ్మిన వారిని నట్టేట ముంచేస్తారు. పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్‌గా తెలివిగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా ఘటనలో ప.గో జిల్లాలో ఇటీవల ఎక్కువవుతున్నాయి. ఇప్పటివరకూ అందిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ అక్క, ఓ బావ, అన్న, వదిన.. ఆపై అత్తమామలు.. ఆడపడుచు.. వీరంతా ఓ కుటుంబంగా ఉంటారు. తల్లిదండ్రులు లేని ఆ పేద యువతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని చూస్తారు. అవసరమైతే ఎదురు డబ్బు ఇచ్చే వ్యక్తికి వివాహం చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఇది నిజమని నమ్మిన వారి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసి కనపడకుండా పోతారు. పెళ్లి కాని ప్రసాదులనే ఈ ముఠా లక్ష్యంగా చేసుకుంటుంది. వారి నుంచి డబ్బులు వసూలు చేసి పరారవుతున్నారు.

వాళ్లే టార్గెట్..

కొన్ని సామాజికవర్గాల్లో పెళ్లీడు ఆడపిల్లలు తక్కువగా ఉండడంతో అవివాహిత యువకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. పెళ్లి సంబంధాలు దొరక్క విసిగిపోయిన వీరు.. దూర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల్లో పేదింటి యువతులకు ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. వీరి బలహీనతనే ఆసరాగా చేసుకున్న కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ పరిణామాన్ని సొమ్ము చేసుకునేందుకు నకిలీ పెళ్లి ముఠాలు సైతం పుట్టుకొచ్చాయి. రాయలసీమలోని హిందూపురానికి చెందిన ఓ వ్యక్తికి 40 ఏళ్లు దాటాయి. ఆ ప్రాంతంలో వధువు కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో మధ్యవర్తులను సంప్రదించగా భీమవరానికి చెందిన అగ్రవర్ణ పేదింటి యువతి ఉందని ఆయనకు సమాచారం పంపారు. ఆ వ్యక్తి భీమవరం వచ్చి మధ్యవర్తులను కలవగా.. యువతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుని పెళ్లి చేసుకుని తీసుకెళ్లవచ్చని చెప్పి.. రూ.4.50 లక్షలు దండుకున్నారు.

యువతిని పెళ్లి చేసుకుని సొంతూరికి తీసుకెళ్లగా.. 2 రోజులకే అనారోగ్యమంటూ నాటకమాడింది. వారం తర్వాత తమ వారిని చూసొస్తామంటూ పట్టుబట్టడంతో భర్త ఆమెను భీమవరం తీసుకొచ్చాడు. రైల్వే స్టేషన్‌కు వచ్చాక మాయమాటలు చెప్పి కనిపించకుండా పోయింది. దీంతో మధ్యవర్తులకు ఫోన్ చేయగా.. మోసపోయినట్లు తేలింది. ఈ క్రమంలో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అటు, ధర్మవరానికి చెందిన ఓ యువకుడు సైతం ఇదే తరహాలో రూ.3 లక్షలు మోసానికి గురయ్యాడు. అలాగే, సత్యసాయి జిల్లా కొత్తచెరువుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నుంచి రూ.8 లక్షలు తీసుకుని కుచ్చుటోపీ పెట్టారు. కర్ణాటకలోనూ బాధితులు ఈ ముఠాల బారిన పడినట్లు తెలుస్తోంది. కొందరు నకిలీ వధువులైతే అత్తింటికి వెళ్లిన వెంటనే రాత్రికి రాత్రే నగదు, నగలతో పారిపోతున్నారు. ప.గో జిల్లా నవుడూరుకు చెందిన ఓ మహిళ ఈ ముఠాలో అక్క పాత్ర పోషిస్తోంది. ఇదే మండలానికి చెందిన ఓ పాల వ్యాపారి అన్న, బావగా నటిస్తున్నాడు. భీమవరంలో అత్తమామలు, తాడేపల్లిగూడెంలో ఆడపడుచు పాత్రధారులు ఉన్నారు. వీరంతా మాయమాటలతో కన్నీటిగాథలు చెప్పి పెళ్లి కాని వారి నుంచి డబ్బులు దోచేస్తున్నారు. అయితే, వివాహమైన కొద్దిరోజులకు కానీ తాము మోసపోయామన్న సంగతి వరులకు తెలియడం లేదు. ఈ తరహా మోసాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు కోరుతున్నారు.

Also Read: Andhra News: ఎంత మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు - ఏపీ పంచాయతీ సవరణ బిల్లుకు ఆమోదం

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Chittoor Crime News: సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
సీజ్ చేసిన రూ.50 లక్షల సిగరెట్లు మాయం..! భాకరాపేట ఫారెస్ట్ రేంజర్‌పై వేటు
Ganja Transport For Lover Birthday Gift: ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డ ప్రియుడు
ప్రియురాలి బర్త్ డేకు ఐఫోన్ గిఫ్ట్.. గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన ప్రియుడు

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Family Jumps Into Godavari River: గోదావరిలో దూకి మరో కుటుంబం ఆత్మహత్యాయత్నం.. ఒకర్ని కాపాడిన జాలర్లు, ముగ్గురి కోసం గాలింపు
Indians Missing In Nepal Floods: నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
నేపాల్ వరదల్లో 275 మంది భారత పౌరులు గల్లంతు.. విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
Bengaluru Vijayawada Economic Corridor: బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
బెంగళూరు-కడప- విజయవాడ ఎకనమిక్ కారిడార్‌లో కీలక మైలురాయిని సాధించిన NHAI
Guntur Minor Girl Kidnap Case: ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
ఇన్‌స్టాలో పరిచయంతో గుంటూరు విద్యార్థిని కిడ్నాప్.. ఛాలెంజ్ చేసిన నిందితుడు హర్యానాలో అరెస్ట్
Telangana Cabinet Expansion:తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
తెలంగాణ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రేవంత్ ముద్ర - సామాజిక సమీకరణాల కొత్త వ్యూహం - ముహుర్తం ఎప్పుడంటే ?
Iran War: సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
సెప్టెంబర్ 9వ తేదీ లోపు ఇరాన్‌పై దాడి? 6, 8 తేదీలు ఎందుకు అత్యంత సున్నితమైనవి?
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Embed widget