అన్వేషించండి

Bengaluru: అరుంధతి సినిమా చూశాడు, పెట్రోల్ పోసుకుని కాల్చుకున్నాడు - మోక్షం కోసం దారుణం

Bengaluru: మోక్షం వస్తుందనే మూఢ నమ్మకంతో బెంగళూరులోని ఓ వ్యక్తి తనపై తానే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

టాపర్‌ స్టూడెంట్..చివరకు ఇలా..

మోక్షం వస్తుందని, తనకు తానుగా నిప్పంటించుకుని మృతి చెందాడో వ్యక్తి. అరుంధతి సినిమాను చూసి స్ఫూర్తి పొందిన 23 ఏళ్ల రేణుకా ప్రసాద్..ఈ దారుణానికి పాల్పడ్డాడు. బెంగళూరులోని తుమకూరు జిల్లాలో జరిగిందీ ఈ ఘటన. 20 లీటర్ల పెట్రోల్‌ తన శరీరంపై పోసుకుని నిప్పంటించుకున్నట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధరించారు. రేణుకా ప్రసాద్ తండ్రి...ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడికి వెళ్లి షాక్‌కు గురయ్యారు. "నాకు మోక్షం ప్రసాదించు" అంటూ తనను బతిలాడినట్టు తండ్రి చెబుతున్నారు. "నేను ఎన్నోసార్లు చెప్పాను. ఆ అరుంధతి సినిమా చూడకు అని. ఇప్పుడు నీకే గతి పట్టిందో చూడు" అని వాపోయినట్టు తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌కు తరలించే సమయానికే రేణుకా ప్రసాద్ శరీరం దాదాపు 60%మేర కాలిపోయింది. SSLCలో టాపర్‌గా రాణించిన ప్రసాద్‌ను ఉన్నత చదువుల కోసం తుమకూరుకు పంపారు తల్లిదండ్రులు. "ప్రసాద్..సినిమాలకు అడిక్ట్ అయ్యాడు. ముఖ్యంగా అరుంధతి సినిమాను పదేపదే చూసేవాడు. ఆ సినిమాలోని పాత్రల్ని ఇమిటేట్ చేసేవాడు. ప్రీ యూనివర్సిటీ ఫస్ట్‌ ఇయర్‌లో ఫెయిల్ అయ్యాక ఇంటికి వచ్చేశాడు. అప్పటి 
నుంచి ఉద్యోగం చేయకుండా ఖాళీగానే ఉన్నాడు. ఆ సమయంలోనే అరుంధతి సినిమాను చూడటం వ్యసనంగా మారింది" అని రేణుకా ప్రసాద్ కజిన్ ఒకరు చెప్పారు. కొడిగెనహల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అంత పెద్ద మొత్తంలో పెట్రోల్ ఎక్కడి నుంచి వచ్చింది..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

మదనపల్లిలోనూ ఇలాంటి దారుణ ఘటన..

ఇలా మూఢనమ్మకాలతో ప్రాణాలు పోగొట్టుకున్న వారు కొందరైతే..ప్రాణాలు తీసిన వారు ఇంకొందరు. ఏపీలోని మదనపల్లిలో గతేడాది ఇలాంటి దారుణమే జరిగింది. ఉన్నత విద్యావంతులైన తల్లిదండ్రులు ఓ బాబా చెప్పిన మాటలు నమ్మి, ఇద్దరు కూతుళ్లను తమ చేతుల్తోనే హత మార్చారు. క్షుద్రపూజలు చేసి కన్న కూతుళ్లనే బలి ఇవ్వటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కూతుళ్లను చంపి, వారికి పునర్జన్మనివ్వాలనే మూఢ విశ్వాసంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. డంబెల్స్‌తో కొట్టి చంపారు. ముందుగా చిన్న కూతురుని చంపి, ఆ తరవాత పెద్ద కూతురుని చంపారు తల్లిదండ్రులు. ఇదంతా వాళ్లు ఓ ప్రణాళికా ప్రకారం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. కేవలం పునర్జన్మ అనే అంశాన్ని గుడ్డిగా నమ్మి ఇలా చేసినట్టు పోలీసులు వెల్లడించారు. చెల్లి చనిపోతానంటే..అక్క ప్రోత్సహించినట్టు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. మొదట్లో ఈ తీరు సరికాదంటూ కూతుళ్లను వారించినా..చివరకు వాళ్లూ అదే మూఢ విశ్వాసంలో కూరుకుపోయారు. భోపాల్‌లో చదువుతున్నప్పుడు తమ కూతురు పలువురు ప్రబోధకుల ప్రసంగాలకు ఆకర్షితురాలైనట్టు నిందితులు తెలిపారు. అంతకు ముందు దిల్లీలో బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది చనిపోయిన ఘటన కూడా సంచలనం రేపింది. 

Also Read: Viral News : రూ.20 కోసం రైల్వే శాఖపై పోరాటం- 22 ఏళ్ల తర్వాత విజయం

Also Read: Duck Oil: బాతు నూనె గురించి తెలుసా? దీనితో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan: సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
సోషల్ మీడియా కేసులతో జగన్‌కు తంటా - అవినాష్‌ రెడ్డితోనూ బంధం తెంపుకోవాల్సిందేనా ?
KTR Arrest: కేసీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
కేటీఆర్ అరెస్ట్‌ ఖాయమని ప్రచారం - కాంగ్రెస్ రిస్క్ చేస్తుందా ? టైం కోసం చూస్తుందా ?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
Latest Weather: అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వర్షాలు- ఈ జిల్లాలపైనే ఎక్కువ ఎఫెక్ట్‌
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
Karthika Pournami Pooja Vidhanam: కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
కార్తీక పౌర్ణమి పూజా ముహూర్తం.. సులువుగా పూజ చేసుకునే విధానం!
Embed widget