Srikakulam Crime News: భార్య వివాహేతర బంధం పెట్టుకుందని కుమార్తెతో సహా ఆత్మహత్య - ఆ పాప ఏం పాపం చేసింది ?
Srikakulam: శ్రీకాకుళంలో భార్య వివాహేతర బంధం పెట్టుకుని కుమార్తెతో కలిసి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమార్తె ఏం పాపం చేసిందని చంపాడని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

Srikakulam Man commits suicide along with daughter: తాము పోయిన పిల్లలు బాగుండాలని కోరుకుంటారు పెద్దలు. ఆత్మహత్య లాంటి తీవ్ర నిర్ణయం తీసుకున్నప్పుడు పిల్లల్ని చంపి తాను చచ్చిపోవాలని అనుకుంటారు కొంత మంది విపరీత ప్రవర్తన గలవారు. శ్రీకాకుళం జిల్లాలో అలాంటి వ్యక్తే కుమార్తెను చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుదంని.. సెల్ఫీ వీడియో విడుదల చేసి కుమార్తెకు విషం ఇచ్చి అనంతరం తాను తాగాడు సంతోష్ అనే వ్యక్తి. రణస్థలం మండలం సంచాం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి ఇచ్చేది విషమని పదేళ్ల పాపకు తెలుసో లేదో కానీ.. అమాయకంగా తాగేసింది. తండ్రి సంతోష్ ఘటనా స్థలంలో చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుమార్తె హైమా మృతి చెందింది.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామానికి చెందిన సంతోష్.. దుప్పాడ పూసపాటిరేగ మండలం చింతపల్లికి చెందిన మహిళను 15 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేస కున్నాడు. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. దాంతో కొన్నాళ్ల తర్వాత రణస్థలం మండలం జీరుపాలెంకు చెందిన స్వాతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఓ పాప ఉంది.
సంతోష్ ఇద్దరు భార్యలతో విశాఖలో వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. చిన్న చిన్న పనులు చేసుకునే సంతోష్..కుమార్తెను గురుకుల పాఠశాలలో చదివిస్తున్నారు. పెద్దపాడు గురుకుల పాఠశాలలో చదువుతున్న కుమార్తె హైమా కి దసరా సెలవులు ఇవ్వడంతో ఇంటికి తీసుకుని రావాలని స్వాతిని శనివారం పంపించాడు. స్వాతి కుమార్తెను తీసుకు వచ్చేందుకు వెళ్లింది కానీ.. సంచాం గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తితో రోజంతా గడిపి రాత్రికి ఇంటికి చేరుకుంది. కుమార్తెను తీసుకుని అలా వేరే వ్యక్తితో ఎందుకు తిరిగుతున్నావని సంతోష్ ప్రశ్నించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
తన భార్య వివాహేతర బంధం పెట్టుకుని వేరే వ్యక్తితో తిరగడమే కాక.. ఎదురుతిరగడంతో మనస్తాపం చెందిన సంతోష్ .. భార్య, కుమార్తెను జీరుపాలెం కన్నవారింటికి దిగబెట్టాడు. తరువాత రోజు మళ్లీ కుమార్తెను తీసుకుని సంచాం వచ్చాడు. తండ్రి ఎందుకు తీసుకు వచ్చాడో ఆ పాపకు తెలియలేదు. అక్కడే సెల్ఫీ వీడియో తీసుకున్న సంతోష్..తన భార్యతో పాటు ఆమెతో వివాహేత బంధం పెట్టుకున్న రాంబాబు గురించి చెప్పి .. పురుగు మందు తాగాడు. సంతోష్ కుమార్తెకు పురుగుమందు తాగించి, తాను తాగాడు. వీడియోను చూసి వీడియోను చూసి ఘటనా స్థలానికి వచ్చిన కుటుంబ సభ్యులు సర్వజనాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే భార్య స్వాతి, ప్రియుడు రాంబాబు పరారయ్యారు.





















