అన్వేషించండి

Crime News: ఈ హలో బ్రదర్స్ మహా ముదుర్స్ - ఒకడు చోరీ చేస్తే ఇంకొకడు తప్పిస్తాడు, వీరి క్రైమ్ కథలకు ఎండ్ కార్డ్ పడిందిలా!

Twin Brothers Robbery Trick: మధ్యప్రదేశ్‌కు చెందిన హలో బ్రదర్స్ పోలీసులకు చుక్కలు చూపించారు. వరుస దొంగతనాలు చేస్తూ ఒకరి ఆసరాతో ఇద్దరూ తప్పించుకున్నారు. చివరకు చిన్న తప్పు చేసి పోలీసులకు చిక్కారు.

Madhyapradesh Police Busted Robbery Brothers Trick: వామ్మో వారిద్దరు సోదరులు మామూలు వాళ్లు కాదు. ఎలాగంటారా.? నిమిషాల వ్యవధిలోనే పుట్టిన ఈ హలో బ్రదర్స్.. చోరీలు చేయడంలో దిట్ట. చూసేందుకు ఒకేలా ఉండే వీరిలో ఒకడు చోరీ చేస్తే ఇంకొకడు వేరే ప్రదేశంలో ఉంటూ ఆ సీసీ ఫుటేజీ ఆధారంగా తప్పించుకునేందుకు ప్లాన్ చేస్తాడు. ఇదిగో నేను అక్కడ ఉన్నానంటూ పోలీసులను సైతం బోల్తా కొట్టిస్తాడు. కొన్నేళ్లుగా వరుస చోరీలు చేస్తూ పోలీసులకే సవాల్ విసిరిన ఈ హలో దొంగ బ్రదర్స్ ఆటలకు తాజాగా చెక్ పెట్టారు. తెలుగు సినిమా కథను తలపించేలా ఉన్న ఈ స్టోరీ తెలియాలంటే ఇది చదవాల్సిందే..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు (Madhyapradesh) చెందిన సౌరభ్‌వర్మ, సంజీవ్‌వర్మ కవల సోదరులు. దొంగతనాలు చేస్తూ జీవిస్తుంటారు. అసలు వీరిద్దరూ అన్నదమ్ములు అన్న సంగతి ఆ గ్రామస్థులకు మినహా బయటి వ్యక్తులకు ఎవరికీ పెద్దగా తెలియదు. చోరీల్లో భాగంగా ఎవరూ గుర్తు పట్టకూడదనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసుండడం కూడా అరుదే. ఒకేలాంటి దుస్తులు ధరించడం, ఒకేలాంటి ఆహార్యంతో అందరినీ ఏమారుస్తున్నారు. ఏళ్లుగా వరుస దొంగతనాలు చేస్తూ పోలీసుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటున్నారు. ఇందులో సౌరభ్‌వర్మ దొంగతనాలు చేయడంలో దిట్టైతే.. సంజీవ్‌వర్మ తప్పుదోవ పట్టించడంలో ఆరితేరాడు. సౌరభ్ ఎక్కడైనా దొంగతనం చేస్తే.. సంజీవ్ వేరే చోట తాను ఉన్న సీసీ టీవీ ఫుటేజీ సంపాదించి పోలీసులను ఏమారుస్తాడు. అలా చోరీ చేసిన డబ్బులతో అందరికీ మస్కా కొట్టి జల్సాలు చేశారు.

పోలీసులు చెక్ పెట్టారిలా..

ఈ నెల 23న మౌగంజ్ సిటీలోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు రూ.లక్షల్లో నగదు, నగలు దోచుకెళ్లారు. ఈ కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. ఇందులో సౌరభ్‌వర్మ సైతం ఉన్నాడు. అయితే, సౌరభ్ కోసం సంజీవ్ రావడంతో ఇక్కడే కథ అసలు మలుపు తిరిగింది. లోపల ఉన్నవాడు బయటకు ఎలా వచ్చాడంటూ పోలీసులే షాక్ అయ్యారు. ఇద్దరూ అన్నదమ్ములు అన్న విషయం తెలుసుకుని.. వరుస చోరీలపై విచారణ చేశారు. తమదైన శైలిలో విచారించగా అసలు నిజం వెలుగుచూసింది. కవల సోదరుల క్రైమ్ స్టోరీ బయటపడింది. నిందితుల నుంచి పోలీసులు లక్షలాది రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Racist comments on Sriram Krishnan: మన శ్రీరామ్‌ కృష్ణన్ అమెరికన్లకు బటన్ చికెన్‌లా ఉన్నాడట - ట్రంప్ సలహాదారుడికే తప్పని వివక్ష !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget