Crime News: తొమ్మిదేళ్ల బాలికపై సోదరుడి అత్యాచారం - కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన అశ్లీల వీడియో
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. పోర్న్ వీడియో చూసిన బాలుడు ఉద్రేకాన్ని ఆపుకోలేక సోదరిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ సభ్యులను అరెస్టు చేశారు.
Crime News: పిల్లల్లో స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ వినియోగం ఎక్కువైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయనే దానికి ఈ ఘటనే ఉదాహరణ. ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసిన ఓ 13 ఏళ్ల బాలుడు ఉద్రేకాన్ని ఆపుకోలేక తన చెల్లిపైనే అత్యాచారానికి పాల్పడి అనంతరం అత్యాచారం చేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరహా వీడియో ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. తన వద్ద ఉన్న స్మార్ట ఫోన్‌లో పోర్న్ వీడియో చూసిన 13 ఏళ్ల బాలుడు సోదరిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేయగా, ఈ ఘటనను దాచే ప్రయత్నం చేసిన కుటుంబం కూడా కటకటాల్లోకి వెళ్లింది.
ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్‌లోని రీవా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో తొమ్మిదేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ కేసులో అదే కుటుంబానికి చెందిన బాలిక తల్లి, ఇద్దరు అక్కలను, సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను తాజాగా పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు. 3 నెలలు కిందట జవా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినట్టు పోలీసులకు సమాచారం అందగా.. విచారణ నిమిత్తం అక్కడికి వెళ్లారు. ఇంటి ఆవరణలో పడుకున్న బాలికను ఏదో విషపు పురుగు కుట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, దీనిపై అనుమానంతో పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. శవ పరీక్ష నివేదికలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. చిన్నారిపై అత్యాచారం జరిగిందని, ఆ తరువాత గొంతు నులిమి చంపినట్టు తేలింది. కేసు విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసిన పోలీసులు కుటుంబ సభ్యులపై అనుమానం వచ్చి వారిని విచారించారు. ఈ విచారణలో అసలు నిజం వెలుగు చూసినట్లు ఎస్సీ వివేక్ సింగ్ వెల్లడించారు.
అత్యాచారం.. హత్య
ఈ ఏడాది ఏప్రిల్ 24న బాలిక తన సోదరుడైన 13 ఏళ్ల యువకుడితో కలిసి ఇంటి ఆవరణలో నిద్రపోయింది. అనంతరం యువకుడు తన స్మార్ట్‌ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూశాడు. ఆ వీడియోలు చేసిన సమయంలో తీవ్ర ఉద్రేకానికి గురై పక్కనే ఉన్న తన సోదరిపై పడి అత్యాచారం చేశాడు. ఈ పరిణామంతో ఒకసారిగా ఉలిక్కిపడిన చిన్నారి ఏడుస్తూ నాన్నకు చెబుతా అని హెచ్చరించింది. దీంతో భయపడిన బాలుడు ఆమె గొంతు నులిమి చంపే ప్రయత్నం చేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తరువాత తల్లిని నిద్ర లేపి విషయాన్ని వివరించాడు. అప్పటికీ బాలిక కొన ఊపిరితతో ఉండగా, నిందితుడు మరోసారి ఆమె గొంతు నులిమి హతమార్చాడు. ఈ క్రమంలో చిన్నపాటి అలజడి కావడంతో ప్కనే నిద్రపోతున్న 17, 18 ఏళ్ల వయసున్న బాలుడి అక్కలు కూడా విషయం తెలుసుకున్నారు. అందరికీ జరిగిన దారుణం అర్థమయ్యాక.. అక్కడ ఉన్న ఆధారాలను తొలగించే ప్రయత్నం చేశారు. సమాచారం పోలీసులు దాకా వెళ్లడంతో వాళ్లు వచ్చి ఆరా తీశారు. విషపు పరుగు కుట్టి చనిపోయిందని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయితే, పలు అనుమానాలు ఉండడంతో పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 50 మందిని విచారించిన తరువాత నేరం జరిగినట్టు నిర్ధారణ వచ్చారు. పోలీసులు తమదైన శైలిలో కుటుంబ సభ్యులను విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడితో పాటు తల్లి, ఇద్దరు అక్కలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.