అన్వేషించండి

Crime News: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి డ్రగ్స్ కలకలం, వ్యాపారవేత్తలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

Hyderabad News : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Telangana Crime news: ఇటీవల కాలంలో డ్రగ్స్ కేసులు తరచూ వెలుగు చూస్తున్నాయి. పోలీసులు డ్రగ్స్ కట్టడికి ఎన్ని కఠిన చర్యలు చేపడుతున్నా  కేటుగాళ్లు మాత్రం కొత్త మార్గాల్లో నగరానికి తీసుకొస్తూనే ఉన్నారు.  పోలీసుల కళ్లు గప్పి అక్రమంగా వ్యాపారస్తులను అంటగడుతున్నారు. తాజాగా.. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో పోలీసులు సోదాలు నిర్వహించారు.  ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కి డ్రగ్స్ తరలిస్తున్న సాయి చరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్‌ని చిన్న చిన్న ప్యాకెట్లలోకి మార్చి  ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్స్ ద్వారా సాయి చరణ్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్స్ బస్సు డ్రైవర్ ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.   

నిందితుడు అరెస్ట్
డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నలుగురు  వ్యాపారవేత్తలతో పాటు ప్రధాన నిందితుడు సాయిచరణ్‌ను పోలీసులు  అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి పెద్ద మొత్తంలో ఎండీఎంఏ(MDMA) డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారవేత్తలు మాలిక్ లోకేష్, సందీప్ రెడ్డి, రాహుల్, సుబ్రహ్మణ్యం‌లను నార్కోటిక్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. గతంలోనూ సాయిచరణ్ ను డ్రగ్స్ కేసులో  డ్రగ్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు దాదాపు  50 మంది వ్యాపారవేత్తలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు. హైదరాబాద్ మాత్రమే కాకుండా నెల్లూరు, విజయవాడ,  రాజమండ్రి, వైజాగ్‌లో ఉన్న వ్యాపారవేత్తలకు డ్రగ్ సరఫరా చేస్తున్నారని చెప్పారు. రాజేశ్వరి ట్రావెల్స్ , జీవీఆర్, స్టార్ట్, చెర్రీ ట్రావెల్స్ ద్వారా సాయిచరణ్​ డ్రగ్స్ రవాణా చేస్తు్న్నాడని పోలీసులు వివరించారు. మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అహ్మదాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
అటు అహ్మదాబాద్ లోనూ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేపట్టిన యాంటీ డ్రగ్ ఆపరేషన్ లో భాగంగా చేసిన తనిఖీల్లో రూ.3.5కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 2023 - 24కు సంబంధించి రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న రూ.3,500 కోట్ల విలువైన అక్రమ ఆస్తుల్లో డ్రగ్స్, బంగారం వాటా ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అలాగే థానే పోలీసులు 25 ఏళ్ల నైజీరియన్ మహిళ నుండి సుమారు రూ. 5.6 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేశారు.  గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుండి 56.3 గ్రాముల ఎండీ క్రిస్టల్ స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 5.6లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.  

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
ఫేక్ కరెన్సీ కోసం వెళ్లి మోసపోయి! రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసి అడ్డంగా బుక్కై
Live Murder in Hyderabad: నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
నాగోల్‌లో రౌడీషీటర్ దారుణహత్య.. అంతా చూస్తుండగానే స్నేహితుడి గ్యాంగ్ అరాచకం! నిందితుల అరెస్ట్
Pulivendula Firing: పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. రాళ్లదాడిలో వాహనాలు ధ్వంసం
Hyderabad Crime News: అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు
అల్వాల్‌లో ఇంటర్ విద్యార్థినిపై 8 మంది అత్యాచారం.. మత్తు ఇచ్చి దారుణాలు- POCSO కేసు నమోదు

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
భాద్రపద మాసంలో చలిమిడి దీపం ఏ రోజుల్లో వెలిగించాలి? ప్రాముఖ్యత ఏంటి?
Embed widget