Baby Boy Dies: బైక్ వెనక చక్రంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి
ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా.. ప్రమాదవశాత్తూ ద్విచక్రవాహనంలో ఇరుక్కొని మూడు నెలల పసికందు మృతి చెందాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలో ఈ విషాదం చోటు చేసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి. కొన్ని కుటుంబాలు ప్రాణ నష్టంతో విలవిల్లాడగా, మరికొన్ని కుటుంబాలు కరోనాతో ఆస్పత్రులలో చేరి చికిత్స పొంది ఆర్థికంగా నష్టపోయాయి. ఈ మధ్య చిన్నారులకు సైతం కరోనా లక్షణాలు రావడం తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ క్రమంలో తమ పసికందుకు దగ్గు, జ్వరం, జలుబు ఉందని ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా విషాదం చోటుచేసుకుంది.
కోడుమూరు మండలంలోని ఎర్రదొడ్డి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం లో ఇరుక్కొని మూడు నెలల బాలుడు మృతి చెందాడు. అల్వాల మల్లికార్జున, సుభాషిణి దంపతులు తమ కుమారుడు మూడు నెలల బాబుకు జ్వరం వచ్చింది. చిన్నారిని కోడుమూరు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. డాక్టర్ల వద్ద నుంచి ఆ దంపతులు మెడిసిన్, బేబీ కిట్ తీసుకున్నారు.
అనంతరం తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా తమ ఇంటికి సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు బేబి కిట్లు ద్విచక్రవాహనం వెనుక టైర్ లోకి జారి పోయింది. దీంతో అందులో ఉన్న ఆ పసికందు సైతం చక్రాల మధ్య ఇరుక్కొని పోవడంతో తల్లిదండ్రులు కేకలు వేశారు. చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి బాలుడుని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ బాలుడు మృతిచెందినట్లు వారు తెలిపారు.
అనంతరం తిరిగి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా తమ ఇంటికి సమీపంలోకి రాగానే ఊహించని విషాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనంపై నుంచి ప్రమాదవశాత్తు బేబి కిట్లు కింద పడిపోయాయి. వీటిని పట్టుకునే ప్రయత్నం చేసింది ఆ మహిళ. అంతే క్షణాల్లో వారు తట్టుకోలేని విషాదం జరిగిపోయింది. మహిళ చేతిలో నుంచి మూడు నెలల పసికందు బైకు వెనుక టైర్ లోకి జారి పోయింది. చక్రాల మధ్య ఇరుక్కున్న బైక్ కొంచెందు ముందుకు వెళ్లి ఆగిపోయింది.
అసలేం జరిగిందో కన్నతల్లి తెలుసుకునేలోగా జరగరాని నష్టం జరిగిపోయింది. తల్లిదండ్రులు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు వచ్చి పసికందుని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ బాలుడు చక్రాల మధ్య నలిగిపోవడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తే ఏకంగా పసివాడు ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఏడుపు చూపురులను సైతం కంటతడి పెట్టించింది. బైకుపై వెళ్లేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలని అధికారులు, పోలీసులు సూచిస్తుంటారు. అనుకోని ప్రమాదం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.
Also Read: Subhas Chandra Bose Jayanti 2022: 125వ జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ అరుదైన చిత్రాలు చూద్దాం...