By: ABP Desam, Satyaprasad Bandaru | Updated at : 16 Apr 2023 07:06 PM (IST)
మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి
Ex Mla Neeraja reddy : కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత పాటిల్ నీరజారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బీచుపల్లి వద్ద టైర్ పేలి ఆమె ప్రయాణిస్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో నీరజారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను వెంటనే కర్నూలు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. పాటిల్ నీరజారెడ్డి భర్త శేషిరెడ్డి పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఫ్యాక్షన్ గొడవల కారణంగా హత్యకు గురయ్యారు. నీరజారెడ్డి కుమార్తె ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 2009 నుంచి 2014 వరకు ఆలూరు నియోజకవర్గం నుంచి నీరజారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకు ముందు పత్తికొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిపై 5వేల ఓట్ల మెజార్టీతో నీరజారెడ్డి గెలుపొందారు. అనంతరం ఆమె వైసీపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.
కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే బిజెపి అసేంబ్లీ ఇన్చార్జి నీరజ రెడ్డి గారు ఈ రోజు బీచుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 16, 2023
వారి ఆత్మకు శాంతిని చేకూర్చాలని,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. pic.twitter.com/gAFIrRXMaJ
అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై నల్లగుట్టపల్లి పంచాయతీ కొత్తపల్లి క్రాస్ వద్ద శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైఎస్‌ఆర్ జిల్లా బద్వేలుకు చెందిన పెనమాల లక్ష్మమ్మ(65) పక్షవాతంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం చిత్తూరు జిల్లా విరూపాక్షపురానికి బంధువులు కారులో తీసుకెళ్తున్నారు. కొత్తపల్లి క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మరో కారును వీరి కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో లక్ష్మమ్మతో పాటు వారి కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవర్ రాజారెడ్డి (35) ఘటనాస్థలిలోనే చనిపోయారు. కారులో ఉన్న బంధువులు చిన్నక్క(60), మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కడప రిమ్స్ కు తరలించారు పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నక్క చనిపోయింది. రాయచోటి నుంచి కడప వెళ్తున్న మరో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఈ ప్రమాదంలో గాయపడ్డారు.
కడపలో రోడ్డు ప్రమాదం
కడప శివారుల్లో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై-కర్నూలు జాతీయ రహదారిపై పాలెంపల్లె రాచిన్నాయ పల్లె బైపాస్ రోడ్డులో వేగంగా వస్తున్న లారీ బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు ఘటనాస్థలిలోనే మృతిచెందారు. మృతులు చెన్నూరుకు చెందినవారు పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన చెన్నూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
Nizamabad News: న్యూజెర్సీలో నిజామాబాద్ యువకుడు సజీవదహనం, రోడ్డు ప్రమాదమే కారణం!
Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !
Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం
Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!
Telangana As Number 1: జయహో తెలంగాణ, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హర్షం
Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ
Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?
TDP Leaders on YCP Govt: ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి అనాగరికం, అప్రజాస్వామికం: టీడీపీ నేతలు