News
News
X

Kothapeta News : కన్ను పడితే కనకమంతా మాయం, తాళం వేసిన ఇళ్లే టార్గెట్!

Kothapeta News :పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన దొంగల ముఠాను కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 172 గ్రాముల బంగారం స్వాధీనం చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

Kothapeta News : చెడు వ్యాసనాలకు బానిసలైన కొందరు ఈజీ మనీ కోసం దొంగతనాలు బాట పడుతున్నారు. ఈ క్రమంలో బంగారం, నగదునే టార్గెట్ చేసుకుని రాత్రి వేళల్లో ఇళ్లల్లోకి  చొరబడుతూ ఇంట్లో దాచుకున్న బంగారాన్ని కొట్టేస్తున్న కేటుగాళ్ల ఆట కట్టించారు కొత్తపేట పోలీసులు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తపేట పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో జరిగిన పలు దొంగతనం కేసులపై దృష్టి సారించారు పోలీసులు. ఈ కేసుల దర్యాప్తులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి వివరాలను కొత్తపేట డీఎస్పీ కేవీ రమణ మంగళవారం వెల్లడించారు. దొంగల నుంచి రూ.8,29,200 విలువ చేసే 172 గ్రాముల బంగారం, రూ. 4,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.  

తాళం వేసిన ఇళ్లే టార్గెట్ 

పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఏ పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేయడం, ఒంటరిగా వెళ్తోన్న మహిళలే లక్ష్యంగా  బంగారం దొంగిలించడం వీరికి పరిపాటిగా మారింది. ఇటీవల కాలంలో కోనసీమ ప్రాంతంలో ఎక్కువగా దొంగతనాలు మొదలుపెట్టారు.  కొత్తపేటలో జరిగిన ఓ దొంగతనం కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు వీరి గురించి  ఆధారాలు లభించాయి. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకు వీరి ఆగడాలు తెలిసొచ్చింది. దీంతో వీరి కదలికలపై నిఘా ఉంచిన క్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముక్కామలలో అనుమానాస్పదంగా తిరుగుతున్న  నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నమోదైన కేసులపై నలుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ కేవీ రమణ తెలిపారు. కొత్తపేటలో నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టిన పోలీసులు మరిన్ని కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు.

కళ్లలో కారం కొట్టి దొంగతనాలు 

ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని అక్కడ పని చేస్తున్న వారిని ఫాలో అవుతూ వారి కదలికలపై దృష్టి సారించి 'భయ్యా అంటూ పిలిచి వారు తేరుకునేలోపే కళ్లలో కారం కొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను ఇరానీ గ్యాంగ్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నెల (నవంబర్) 22న రాత్రి హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లోని కృష్ణా జ్యువెలర్స్ యజమాని అంకిత్ అగర్వాల నివాసం వద్ద అక్కడ పని చేస్తున్న ఉద్యోగి కళ్లల్లో కారం కొట్టి బ్యాగుతో ఉడాయించారు. ఇదే గ్యాంగ్ ఈ నెల 24న రాత్రి నారాయణగూడలో డివినిటి ఆభరణాల షాపు నుంచి వెళ్తున్న ఉద్యోగిని సైతం కళ్లల్లో కారం కొట్టి 25 తులాల బంగారు నగలున్న బ్యాగుతో ఉడాయించారు. ఒక్క రోజు వ్యవధిలోనే ఈ రెండు ఘటనలు చోటు చేసుకోగా అటు నారాయణగూడ క్రైం పోలీసులకు, ఇటు జూబ్లీహిల్స్ క్రైం పోలీసులకు ఈ ముఠాను పట్టుకోవడం సవాల్‌గా మారింది. రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ గత మూడు రోజుల నుంచి సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ ముఠా స్నాచింగ్లకు పాల్పడుతున్న తీరు, వీరి కదలికల ఆధా రంగా నిందితులు మహారాష్ట్రకు చెందిన ఇరానీ గ్యాంగ్ గుర్తించారు. గతంలోనూ వీరు స్నాచింగ్ చేసిన పద్ధతులను కూడా పరిశీలించారు. నెంబర్ ప్లేట్ లేని బైక్పై మంకీ క్యాపులు ధరించిన ఇద్దరు యువకులు ఈ చోరీలకు పాల్పడినట్లుగా నిర్ధారణకు వచ్చారు.  

నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మాత్రం బ్యాగులో 25 తులాల బంగారు ఆభరణాలు ఉండగా బాధితుడు జితేంద్ర శర్మ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ప్రధాన రహదారుల్లో సీసీ పుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఎక్కడా క్షణం కూడా నిలబడకుం డా దూసుకుపోతున్నట్లు తేలింది. ఇంకోవైపు మంకీ క్యాంప్ ధరించడంతో ముఖ ఆనవాళ్లు గుర్తించలేకపోతున్నారు. బైక్ నెం బర్ ప్లేట్లు కూడా తొలగించడంతో కేసు దర్యాప్తు జఠిలంగా మారిందని ఓ అధికారి తెలిపారు. అయితే పాత నేరస్తుల కద లికలపై దృష్టి పెట్టిన పోలీసులు మరో రెండు, మూడు రోజుల్లో ఈ గ్యాంగ్ను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Published at : 29 Nov 2022 04:42 PM (IST) Tags: gold AP News Crime News Konaseema News Kothapeta News four thieves arrest

సంబంధిత కథనాలు

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Kakinada Crime: జల్సాలకు అలవాటుపడి వరుస చోరీలు, నిద్రపోతున్న ప్రయాణికులే వీరి టార్గెట్!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Mancherial Crime: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య ఆత్మహత్య కలకలం!

Maharashtra Crime News: అంత్యక్రియలు జరిగిన వారం రోజులకు మృతుడి నుంచి వీడియో కాల్ - దర్యాప్తు చేస్తున్న పోలీసులు!

Maharashtra Crime News: అంత్యక్రియలు జరిగిన వారం రోజులకు మృతుడి నుంచి వీడియో కాల్ - దర్యాప్తు చేస్తున్న పోలీసులు!

Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !

Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !

Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...

Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం -  కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...

టాప్ స్టోరీస్

Kadiyam Srihari On Sharmila: జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !

Kadiyam Srihari On Sharmila:   జగన్ జైలుకు వెళ్తే సీఎం చాన్స్ - ఏపీకి వెళ్లాలని షర్మిలకు కడియం శ్రీహరి సలహా !

Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!

Kiranmayee Alivelu: మిసెస్ ఇండియా పోటీల్లో సత్తా చాటిన తెలంగాణ అందం!

YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన

YS Jagan: 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు - ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం జగన్ ప్రకటన

Khammam Politics : సస్పెండ్ చేయమంటున్న పొంగులేటి - రాజీనామా చేయమంటున్న పువ్వాడ ! ఇద్దరి కామన్ డైలాగ్‌లో "దమ్ము" హైలెట్ !

Khammam Politics :  సస్పెండ్ చేయమంటున్న పొంగులేటి - రాజీనామా చేయమంటున్న పువ్వాడ !  ఇద్దరి కామన్ డైలాగ్‌లో