By: ABP Desam | Updated at : 21 Apr 2022 06:29 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కోనసీమ ఎస్పీ ప్రెస్ మీట్
Konaseema Crime : ఒంటరిగా ఉంటున్న మహిళలే అతని టార్గెట్. ఆ మహిళలను పరిచయం చేసుకుని సహజీవనం చేస్తూ ఆపై వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించడమే అతని నైజం. ఈ క్రమంలోనే తనతో ఉంటున్న ఓ మహిళ కూతురిపై కన్నేసిన వ్యక్తిని ఆ మహిళే చివరకు కాటికి పంపింది. పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. తల్లిని లోబర్చుకుని ఆమెతో వ్యభిచారం చేయిస్తూ ఆమె కూతురిపై కన్నేసిన ప్రియుడ్ని హత్య చేసిన మహిళను, అమెకు సహకరించిన వ్యక్తులును అరెస్ట్ చేసినట్లు కోనసీమ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కేసు వివరాలు వివరించారు.
గత ఏడాది కేసు
గత ఏడాది జూన్ 19న కొత్తపేట మండలం అవిడి గ్రామ రేవు కాలువలో గాయాలతో ఓ వ్యక్తి మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. దీనిపై స్థానిక వీఆర్వో రిపోర్ట్ పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతుండగా ఈ కేసులో సరైన ఆధారాలు లభించలేదు. తాను బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రత్యేక బృందాలను నియమించామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో చనిపోయిన వ్యక్తి రాజమండ్రి రూరల్, చింతల నామవరానికి చెందిన షేక్ బాషాగా గుర్తించామన్నారు. బాషా గతంలో వివాహం చేసుకొని భార్య పిల్లలను వదిలేసి కొంత మంది స్త్రీలతో నన్నిహితంగా మెలిగేవాడని, వారిని బెదిరించి లోబర్చుకొని వారి చేత వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించేవాడని తెలిపారు.
పక్కా పథకంతో హత్య
కొప్పిశెట్టి నాగ మహాలక్ష్మి అనే మహిళతో చనిపోయిన బాషాకి గత సంవత్సరం జనవరిలో పరిచయం ఏర్పడిందని ఎస్పీ తెలిపారు. అప్పటి నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత ఆమె కుమార్తెపై కన్నేశాడు బాషా. అమ్మాయిని ఎత్తుకుపోతానని బెదిరించటంతో మహాలక్ష్మి ఆ విషయాన్ని తన అన్న గుత్తుల ప్రసాదరావు, తల్లి సత్యవతికి చెప్పిందన్నారు. బాషాని చంపకపోతే అన్నంతపని చేస్తాడనే భయంతో అతనిని చంపటానికి పథకం వేసి గత సంవత్సరం జూన్ 18న రాత్రి సమయంలో ఇంటికి రమ్మని భోజనంపెట్టి అతడు కూర్చుని ఉండగా మరగబెట్టిన వంట నూనెను ముఖంపై పోశారు. పోయగా గుత్తుల ప్రసాదరావు, కొప్పిశెట్టి నాగ మహాలక్ష్మి ఇరువురు వారు ముందుగా సిద్ధంగా ఉంచుకున్న ఇనుపరాడ్ తో తలపై కొట్టి గాయపరచి ఆ తరువాత మెడకు తుండు చుట్టి బిగించి బాషా హత్యచేశారని ఎస్పీ సుబ్బారెడ్డి వివరించారు.
చంపిన ఆయుధం పట్టించేసింది
అతడు చనిపోయాడని నిర్ధారించుకుని మృతదేహాన్ని వారి ఇంటి సమీపంలోని కాలువలో పడేశారు. అయితే పోలీసుల దర్యాప్తులో బాషాను చంపటానికి వాడిన ఆయుధం పోలీసులకు లభించింది. దీంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. రావులపాలెం సీఐ వెంకట నారాయణ, కొత్తపేట ఎస్సై మణి కుమార్, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కేసులో నిందితులు గుత్తుల ప్రసాదరావు, కొప్పిశెట్టి నాగ మహాలక్ష్మి, గుత్తుల సత్యవతిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు ఎస్పీ సుబ్బారెడ్డి తెలిపారు.
Rajanna Sircilla: కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్ అకౌంట్, డబ్బులు కావాలని అధికారులకు మెసేజ్‌లు - ట్విస్ట్ ఏంటంటే !
Nara Lokesh : రేపు విజయవాడ కోర్టుకు నారా లోకేశ్, ఆ కేసులోనే!
UP News: వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం- 8 మంది మృతి
Kakinada News : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు బిగిస్తున్న ఉచ్చు, పోస్ట్ మార్టంలో వెలుగు చూసిన నిజాలు!
Secunderabad: లిఫ్టులో చీర కొంగు అడ్డు పెట్టి మహిళ పాడు పని, సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు - అవాక్కైన పోలీసులు
Weather Updates: చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు - ఏపీ, తెలంగాణలో నేడు ఆ జిల్లాల్లో మోస్తరు వర్షాలు
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే
HbA1c Test: ఆరు నెలలకోసారైనా ఈ టెస్టు చేయించుకుంటే మంచిది, డయాబెటిస్ రాకను ముందే కనిపెట్టవచ్చు