News
News
X

Komaram Bheem Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో వ్యభిచారం ముఠా గుట్టురట్టు - పాడుబడ్డ ఫ్యాక్టరీనే అడ్డా!

Komaram Bheem Asifabad: కుమురం భీం జిల్లాలోని ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీలో పలువురు గప్ చుప్ గా వ్యభిచారం సాగిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిర్వాహకుడితో పాటు మరికొందర్ని అరెస్ట్ చేశారు. 

FOLLOW US: 
Share:

Komaram Bheem Asifabad: ఓ వ్యక్తి ఐదుగురు అమ్మాయిలతో వ్యభిచార దందా సాగిస్తున్నాడు. ఇందుకు ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీని ఆవాసంగా చేసుకొని అక్కడే దందాలు కొనసాగిస్తున్నారు. చాలా కాలంగా ఇది సాగుతుండగా... ఇటీవలే పోలీసులకు దీని గురించి పలువురు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు చేరుకొని వ్యభిచార ముఠాను గుట్టు రట్టు చేశారు. 

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన మండల పరిధిలోని ఓ పాడుబడ్డ ఫ్యాక్టరీలో ఓ వ్యక్తి అమ్మాయిలతో వ్యభిచారం సాగిస్తున్నాడు. ఇది చాలా రోజులుగానే సాగుతున్నప్పటికీ... పోలీసులకు విషయం తెలియలేదు. అయితే ఇటీవలే చాలా మంది వ్యక్తులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్న వ్యక్తితోపాటు ఐదుగురు వేశ్యలు, మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని రెబ్బన పోలీస్ స్టేషన్ కి తరలించినట్లు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. 

హైదరాబాద్ లో సెక్స్ రాకెట్..

 ఈ మధ్యే హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. నార్సింగిలోని ఓ ఫ్లాట్‌లో హైటెక్ పద్ధతిలో ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీని నిర్వహకులు ఉగాండా దేశస్తులు అని పోలీసులు నిర్ధరించారు. వారిని అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడం కోసం ఈ ఉగాండా దేశీయులు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరూ వీఐపీలేనని గుర్తించారు. ఈ వ్యభిచార యాప్‌ను బ్యాంకు యాప్‌ మాదిరిగా ప్రత్యేక సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ముందుగా బుక్ చేసుకున్న ప్రకారం ప్రత్యేక కోడ్ లేదా ఓటీపీ వాడితేనే లోనికి రానిచ్చే విధంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నారు. ఆ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. 

విటుడు డబ్బు చెల్లించడానికి ఒప్పుకున్న తర్వాత ఆ ఇంటిలోకి, మహిళ వద్దకు వెళ్లేందుకు ఆ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆ వెంటనే నిర్వహకులు కస్టమర్ ఫోన్ నుంచి సంప్రదించిన వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. అలా చేయడం ద్వారా వినియోగదారుడు ఆ డేటాను దుర్వినియోగం చేయకుండా వీలు ఉంటుందని పోలీసులు వివరించారు. హైటెక్ పద్ధతిలో ఇలాంటి సెక్స్ రాకెట్‌ను ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు.

జీడిమెట్లలోనూ..

జీడిమెట్లలోనూ మరో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. రహస్యంగా వ్యభిచారం ని­ర్వహిస్తున్న ఇంటిపై జీ­డిమెట్ల పోలీసులు దాడి చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదా­వరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు అనే 33 ఏళ్ల వ్యక్తి జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కా­లనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్‌­(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నా­రు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వహకుడు వీరరాజు సహా విటుడిపై కేసు నమోదు చేశారు.

Published at : 12 Dec 2022 01:17 PM (IST) Tags: prostitution racket komaram bheem asifabad Asifabad Crime News Telangana Crime News Eight Prostitutes Arrest

సంబంధిత కథనాలు

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Hero Naveen Reddy : టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ రెడ్డి అరెస్టు, చీటింగ్ చేసి జల్సాలు!

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Panjagutta Police Video : గస్తీ గాలికి వదిలేసి మందు కొడుతున్న పంజాగుట్ట పోలీసులు, వీడియో వైరల్

Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!

Srikakulam Road Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం, కూలీలపై దూసుకెళ్లిన లారీ, ముగ్గురు మృతి!

Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?

Jaggayyapeta News : జీతాల విషయంలో సీఎంను దూషించిన కానిస్టేబుల్, కోర్టు ఏమందంటే?

Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ

Guntur Crime : గుంటూరు జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు- కాపరికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి, 50 గొర్రెలు చోరీ

టాప్ స్టోరీస్

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Peddagattu Jatara 2023 Effect: హైదరాబాద్‌ - విజయవాడ హైవేపై ఈ నెల 9 వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు ఇలా

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

Buggana Rajendranath: మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1.34 లక్షల కోట్లు: మంత్రి బుగ్గన

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో 'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

AOC Recruitment 2023: పదోతరగతి అర్హతతో  'ఇండియన్ ఆర్మీ'లో ఉద్యోగాలు, 1793  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!

Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి

Weather Latest Update: నేడు ఈ 3 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! చాలా జిల్లాల్లో వణికించనున్న చలి