Amritpal Singh Wife: అమృత్ పాల్ సింగ్ భార్య అరెస్ట్? లండన్‌కు పారిపోతుండగా అడ్డుకున్న పోలీసులు!
Amritpal Singh Wife: అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Amritpal Singh Wife Arrest:
లండన్‌కు పరారీ..?
ఖలిస్థాన్ వేర్పాటువాది అమృత్ పాల్ సింగ్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లండన్‌కు పారిపోవాలని ప్లాన్ చేసిన ఆమెను శ్రీ గురు రామ్ దాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమెను అడ్డగించారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె లండన్‌కు వెళ్లాల్సి ఉంది. ఫ్లైట్ ఎక్కేందుకు అమృత్‌సర్‌కి వచ్చిన ఆమెపై నిఘా పెట్టారు పోలీసులు. కొద్ది నెలల క్రితమే అమృత్ పాల్...కిరణ్‌దీప్ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు. పంజాబ్‌లోని జల్లుపూర్ ఖేడాలో కాపురం పెట్టారు. అప్పటి నుంచి అమృత్ పాల్ సింగ్ ఉద్యమం ఉద్ధృతమైంది. ప్రత్యేక ఖలిస్థాన్ దేశం కోసం నానా రచ్చ సృష్టించాడు. వారిస్ పంజాబ్ దే పేరిట ఓ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించాడు. కిరణ్‌దీప్ కౌర్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారని ముందస్తు సమాచారం పోలీసులకు అందింది. ఈ మేరకు ముందే అక్కడ నిఘా పెట్టారు. ఆమె ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఖలిస్థాన్ మద్దతుదారులకు కిరణ్‌దీప్ కౌర్ భారీ మొత్తంలో ఫండ్స్ అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే...ఆమె అరెస్ట్‌పై పంజాబ్ పోలీసులు క్లారిటీ ఇవ్వడం లేదు. కేవలం ఆమెను ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. ఇమిగ్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులు కూడా ఆమెను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
UPDATE | Amritpal Singh's wife Kirandeep Kaur has not been detained yet clarify Punjab Police source but is being questioned by the Immigration department, more details awaited. https://t.co/kQO3qPhzy8
— ANI (@ANI) April 20, 2023
భార్యను హింసించాడు: రిపోర్ట్
అమృత్ పాల్ సింగ్‌పై నిఘా వర్గాల రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో లగ్జరీ లైఫ్ గడిపే వాడని, థాయ్‌లాండ్‌కు తరచూ వెళ్లొచ్చే వాడని వెల్లడైంది. భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను హౌజ్ అరెస్ట్ చేశాడని, తీవ్రంగా కొట్టేవాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వీరిద్దరికీ వివాహమైంది. అప్పటి నుంచి ఆమెను వేధిస్తూనే ఉన్నాడని చెప్పాయి. అమృత్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ పోలీసులు అమృత్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌ను ప్రశ్నించారు. Waris Punjab De పార్టీకి ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయో విచారించారు. మార్చి 18న అమృత్ పాల్‌ను అరెస్ట్ చేసేందుకు ఆపరేషన్ మొదలు పెట్టారు. అప్పటి నుంచి పరారీలోనే ఉన్నాడు. ఈ ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌లో మరి కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో కిరణ్‌దీప్ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు అమృత్ పాల్ సింగ్. అప్పటి నుంచి ఆమెను ఇంట్లోనే నిర్బంధించాడు. కిరణ్‌దీప్ పంజాబ్‌లోనే పుట్టినా...ఆమె యూకేలో సెటిల్ అయ్యారు. అమృత్ పాల్ తరచూ థాయ్‌లాండ్‌కు వెళ్లాడు. మరో సంచలన విషయం ఏంటంటే...అక్కడ ప్రాస్టిట్యూషన్ చేసినట్టు అనుమానాలున్నాయి. అంతే కాదు. అక్కడ మరో మహిళతో సంబంధం పెట్టుకున్నట్టూ తెలుస్తోంది.
Also Read: Stampede In Yemen: డబ్బుల కోసం ఎగబడ్డ జనం, తొక్కిసలాటలో 85 మందికి పైగా మృతి - వందలాది మందికి గాయాలు