అన్వేషించండి

ఫేమస్ ఫుడ్ వ్లాగర్‌ ఆత్మహత్య, బెడ్‌రూమ్‌లోనే ఉరి వేసుకుని బలవన్మరణం

Kerala Crime News: కేరళకు చెందిన ఫుడ్ వ్లాగర్ రాహుల్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

Kerala Vlogger Suicide: 


కొచ్చిలో ఫుడ్‌వ్లాగర్‌ ఆత్మహత్య

కేరళలోని కొచ్చిలో ఓ ఫుడ్‌ వ్లాగర్‌ ఇంట్లోనే ఆత్మహత్య (Food Vlogger Suicide) చేసుకున్న ఘటన కలకలం రేపింది. 33 ఏళ్ల రాహుల్ ఎన్‌ కుట్టి (Rahul N Kutty) బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. తన బెడ్‌రూమ్‌లో ఉరి వేసుకున్నాడు. ఎంత సేపటికీ తలుపు తీయకపోవడం వల్ల తల్లిదండ్రులు కంగారు పడ్డారు. ఆ తరవాత స్నేహితులూ ఇంటికి వచ్చారు. ఎలాగోలా రూమ్‌లోకి వెళ్లి చూడగా వేలాడుతూ కనిపించాడు. వెంటన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. హాస్పిటల్ నుంచే పోలీసులకు సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. 'Eat Kochi Eat' ఆన్‌లైన్ ఫుడ్‌ ప్లాట్‌ఫామ్‌ కొచ్చిలో చాలా ఫేమస్. అందులోనే వ్లాగర్‌గా పని చేస్తున్నాడు రాహుల్. చాలా అరుదైన వంటకాలను పరిచయం చేయడమే ఈ ప్లాట్‌ఫామ్‌ స్పెషాల్టీ. కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయ్యాడు రాహుల్. కానీ...ఉన్నట్టుండి ఇలా ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ మృతిపై పోస్ట్ చేసింది ఈట్ కొచ్చి ఈట్‌ ప్లాట్‌ఫామ్. అసహజ మరణంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని వెల్లడించారు. 

"రాహుల్ ఎన్ కుట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇది చాలా బాధాకరమైన ఘటన. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాం. రాహుల్ కుటుంబ సభ్యులు ఈ బాధను తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఆ భగవంతుడే ఇవ్వాలి"

- ఈట్ కొచ్చి ఈట్ 

యూపీలోనూ ఓ వ్యక్తి ఆత్మహత్య

పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి ఇంటికి రాలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. యూపీలో జరిగిందీ ఘటన. భార్య రాలేదని అసహనానికి గురైన వ్యక్తి ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయాడు. మృతుడి పేరు ప్రమోద్ కుమార్‌ అని పోలీసులు వెల్లడించారు. గుగా గ్రామానికి చెందిన ప్రమోద్ కుమార్ తన గదిలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్టు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్‌మార్టం జరిపించారు. ప్రమోద్ భార్య ప్రీతి రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఇంకా ఇంటికి రాలేదని ప్రమోద్ భార్యకు కాల్ చేశాడు. ఆ సమయంలో ప్రీతి తల్లి ఫోన్‌లో గొడవ పడింది. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది తట్టుకోలేక రాత్రి పూట ఆత్మహత్య చేసుకున్నాడు ప్రమోద్. ఉదయం ఎంత సేపటికీ తలుపు తీయకపోవడం వల్ల అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలకు వెళ్లారు కుటుంబ సభ్యులు. గదిలో వేలాడుతూ కనిపించడం చూసి షాక్ అయ్యారు. కర్వా చౌత్‌ రోజున భార్య తన పక్కనే లేదన్న ఆవేదనతో ఇలా బలవన్మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Jio Vs Airtel: నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
నెట్‌ఫ్లిక్స్, హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్లు ఇచ్చే జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లు ఇవే - రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయా?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget