Kamareddy News : రైతు భూమిలో అటవీ మొక్కలు - పురుగు మందు తాగిన రైతు !
అటవీ అధికారులు, గిరిజనుల మధ్య వివాదాలు ఆగడంలేదు. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఓ గిరిజన రైతు పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
Kamareddy News : కామారెడ్డి జిల్లాలో అటవీ అధికారులు వేధిస్తున్నారంటూ ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నo చేసిన ఘటన కలకలం రేపుతోంది. లింగంపేట మండలం నల్ల మడుగు పెద్ద తండాలో ధరావత్ రాములు ప్రాణం తీసుకోబోయారు. ధరావత్ రాములు నాయక్‌కు 2005లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూమిని పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. అప్పటి నుండి రాములు నాయక్ ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ... జీవనం కొనసాగిస్తున్నాడు.
కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీ - భర్తీ చేయాలని మోదీకి కేటీఆర్ లేఖ !
రైతు భూమిలో అటవీ అధికారుల మొక్కలు
అయితే అటవీ శాఖ అధికారులు రాములు నాయక్‌కు చెందిన వ్యవసాయ భూమి అటవీ శాఖకు సంబంధించినదoటూ.. మొక్కలు నాటేందుకు వచ్చారు. మొక్కలు నాటడానికి జేసీబీతో గుంతలు తీస్తుండగా విషయం తెలుసుకున్న రాములు నాయక్ ఆందోళనకు గురయ్యాడు. అటవీ శాఖ అధికారులకు ఆ భూమి నాదే అంటూ చెప్పుకొచ్చారు. కానీ అధికారులు ఏ మాత్రం వినకుండా ఇది అటవీ శాఖకు చెందిన భూమి అని ఇది సాగు చేయొద్దని రాములు నాయక్ కు తేల్చి చెప్పారు.
రాష్ట్రపతి ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహం ఏమిటి ? మౌనమే ఫైనలా ?
ఆవేదనతో పురుగు మందు తాగిన రైతు
ప్రభుత్వo ఇచ్చిన భూమిలో సాగుచేసుకుంటే ఇప్పుడు వచ్చి ఉన్నఫలంగా చెట్లు నాటడమెంటని రైతు ప్రశ్నించారు. అధికారులకు ఎంత చెప్పినా వినలేదు. దీంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే రాములు నాయక్ ను తండావాసులు చికిత్స కోసం కామారెడ్డిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. రాములు నాయక్‌కు జీవనాధారమైన వ్యవసాయ భూమిని అటవీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం వల్లే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడని గ్రామస్తులు చెబుతున్నారు. తమకు న్యాయం చేయాలని రాములు నాయక్ కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
బండి సంజయ్ వర్సెస్ నిరంజన్ రెడ్డి - రైతుల కష్టాలకు కారణం మీరంటే మీరని లేఖలు
అనేక సార్లు ఇలాంటి పరిస్థితులు
ఇటీవలి కాలంలో అటవీ భూముల విషయంలో గిరిజనలుకు.. అటవీ అధికారులుక మధ్య అనేక రకాలుగా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా పరిష్కారం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే తరచూ ఘర్షణలు మాత్రం ఆగడం లేదు. ఈ అంశంపై ప్రజా ప్రతినిధులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు.