అన్వేషించండి

Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు

కాకినాడలో జరిగిన గిరిధర్‌ హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అశ్లీల వీడియోలు ఇవ్వలేదనే కారణంతోనే ఈ హత్య చేసినట్లు నిందితులు అంగీకరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కాకినాడ త్రీ టౌన్ పోలీసులు గిరిధర్ హత్య కేసు ఛేదించారు.
  • అశ్లీల వీడియోలు ఇవ్వనందుకే నిందితులు గిరిధర్‌ను హత్య చేశారు.
  • నిందితుల నుండి కత్తి, ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 2న జరిగిన హత్య కేసును జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కాకినాడ సాంబమూర్తినగర్‌లో గండి గిరిధర్‌ (30) హత్యకు గురైన కేసులో పాలేపు వివేక్, ఏలూరి రామకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వదకద నుంచి 4 ఫోన్లు, కత్తి, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు. అశ్లీల వీడియోలు ఇవ్వని కారణంగా గిరిధర్‌ను హత్య చేసినట్లు విచారణలో నిందితులు అంగీకరించారు. 

ఈ నెల 2న దారుణహత్య

హత్య కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ, ఇన్చార్జి డిఎస్పి డాక్టర్ మహంతి కిషోర్ కుమార్  ఆదివారం నాడు మీడియాకు వెల్లడించారు. కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీ, సెవెన్ హిల్స్ రోడ్లో నివాసం ఉంటున్న గండి గిరిధర్ అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన తన నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురయ్యాడు. 


Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు

మృతుడి తల్లి గండి జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ హత్య కేసును కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ఆయన ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో, కాకినాడ త్రీ టౌన్ లా ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలతో పాటు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సంఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించామని కిషోర్ కుమార్ తెలిపారు.

నిందితులు అరెస్టు
  దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఈ నెల 12వ తేదీన తేదీన కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ నిందితుల్ని గుర్తించారు. పాలేపు వివేక్ @ బన్నీ, ఏలూరి రామకృష్ణ అనే ఇద్దరు యువకులను చేసినట్లు తెలిపారు. 


Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు

 దర్యాప్తులో తేలింది ఏంటంటే..

మృతుడు గండి గిరిధర్  గతంలో వివాహం అయ్యి భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం తన తల్లితో కలిసి ఉంటున్నాడు. మృతుడు తనకు పరిచయం ఉన్న కొంత మంది యువతులు, మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను తన సెల్‌ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. తనతో సన్నిహితంగా తిరిగే అదే ప్రాంతానికి చెందిన నిందితులు బన్నీ, రామకృష్ణలకు మద్యం మత్తులో ఆ ఫొటోలు, వీడియోలను చూపించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ నిందితులు, ఆ ఫొటోలు, వీడియోలను మృతుడి వద్ద నుంచి తీసుకుని, వాటిలో ఉన్న మహిళల కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు సంపాదించవచ్చని భావించారు. ఈ ఉద్దేశంతో మృతుడి వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను ఎలాగైనా తీసుకోవాలని నిందితులు ప్లాన్ వేసుకున్నారు.


Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు

ఈ నెల 1వ తేదీ రాత్రి సమయంలో మృతుడి తల్లి, పక్క పోర్షన్లో నివసించే మృతుడి అన్నయ్య, వారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని తెలుసుకున్నారు నిందితులు. అదే రోజు రాత్రి సుమారు 12.15 గంటలకు మృతుడి ఇంటికి వెళ్లారు. అక్కడ  మృతుడితో యువతుల ఫొటోలు, వీడియోలు కావాలని అడగగా ఇచ్చేందుకు గిరిధర్ నిరాకరించాడు. ముందుగానే తీసుకువెళ్లిన కత్తితో మృతుడి గొంతుపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై గిరిధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. హత్య అనంతరం నిందితులు సంఘటనా స్థలం నుండి పరారయ్యారు. కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన  సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్, ఇతర అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా విశ్లేషించారు. నిందితులను విచారించగా, ఈ హత్య చేసినట్లు వారు అంగీకరించారు. మరిన్ని సాక్ష్యాధారాల సేకరణ, సాంకేతిక ఆధారాల విశ్లేషణ, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.

నిందితుల వద్ద నుండి ఆధారాలు స్వాధీనం 

నిందితుల వద్ద నుండి మృతుడిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి, హత్య జరిగిన సమయంలో నిందితులు ధరించిన  దుస్తులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సంబంధించిన 4 సెల్ ఫోన్లు, ఒక పెన్ డ్రైవ్, మృతుడి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇతర సాక్ష్యాధారాలను కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి శాస్త్రీయ పరీక్షలు, చట్టపరమైన ప్రక్రియ నిమిత్తం భద్రపరిచామన్నారు.

పోలీసు బృందానికి అభినందనలు
 హత్య జరిగిన అనంతరం కేసును సవాలుగా తీసుకుని, దర్యాప్తు పూర్తి చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు  జివివిఎస్ చౌదరి, వి ఆంజనేయరాజు హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్స్ మురళిరాజు, బి శ్రీనివాసరావు, ప్రేమ్ కుమార్, క్రైమ్ టీం సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ అభినందించారు.

Frequently Asked Questions

కాకినాడలో జరిగిన హత్య కేసు ఏమిటి?

కాకినాడ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 2న గండి గిరిధర్ హత్యకు గురయ్యాడు. అశ్లీల వీడియోలు ఇవ్వనందుకు ఈ హత్య జరిగినట్లు పోలీసులు ఛేదించారు.

ఈ హత్య కేసులో పోలీసులు ఎవరిని అరెస్టు చేశారు?

పాలేపు వివేక్ మరియు ఏలూరి రామకృష్ణ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 4 ఫోన్లు, కత్తి, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు.

గిరిధర్ హత్యకు గల కారణం ఏమిటి?

మృతుడు గిరిధర్ తన ఫోన్‌లో సేవ్ చేసుకున్న అశ్లీల వీడియోలను నిందితులకు ఇవ్వడానికి నిరాకరించాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నిందితులు ఆ వీడియోలతో డబ్బు సంపాదించాలనుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Vijayawada Crime News: పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
పాకిస్థాన్ ఏజెంట్లతో లింకులు.. ‘ఆపరేషన్ ఫైర్‌వాల్’లో ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
Fake High Court Judge: హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
హైకోర్టు జడ్జినంటూ ప్రచారం.. వైజాగ్ సీపీపైనే కుట్ర.. లాయర్ కార్తీక్ సిద్ధార్థపై క్రిమినల్ కేసు నమోదు!
RTC Conductor Cheating: రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
రోజూ బస్సెక్కితే మాయమాటలు చెప్పి 20 లక్షలు గుంజేసిన కండక్టర్.. మంత్రికి బాధితురాలు ఫిర్యాదు
Advertisement

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget