అన్వేషించండి

Nagpur SBI ATM cash robbery: మమ్మీ ఎవడీడు? - ప్యాకెట్ కారంతో ఏకంగా బ్యాంకే లూఠీ - కానీ ఏ కాలంలో ఉన్నాడు!

Chilli powder bank robbery : నాగ్‌పూర్ భండే ప్లాట్‌లో ఎస్‌బీఐ సిబ్బంది కళ్లలో మిరపకారం చల్లి రూ.4.53 లక్షలు ఎత్తుకెళ్లిన నిందితుడు సూరజ్ బోర్కర్‌ను 30 నిమిషాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు.

SBI staff cash robbery Bhande Plot Nagpur:  సినిమాల్లో హీరోలనో, బ్యాంకు సెక్యూరిటీలనో బురిడీ కొట్టించడానికి పాతకాలపు  కారప్పొడి ట్రిక్ వాడటం మన దర్శకులకు బాగా అలవాటు. సరిగ్గా అదే రొటీన్ ఫార్ములాను రియల్ లైఫ్‌లో అప్లై చేసి రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోదామని ప్లాన్ వేశాడు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఒక లేత దొంగ. నాగ్‌పూర్ భండే ప్లాట్ ప్రాంతంలోని ఎస్‌బీఐ  ఏటీఎం నుంచి బ్యాంకు సిబ్బంది మిగిలిన నగదును సేకరించి భద్రంగా తిరుగు ప్రయాణమయ్యారు. ఇంతలో వెనుక నుంచి సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన సూరజ్ బోర్కర్ అనే కిలాడీ గ్యాంగ్ మాస్టర్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సిబ్బంది కళ్లలో గుప్పెడు మిరపకారం కొట్టేశాడు!

క్షణాల్లో కళ్లు మండటంతో పాపం బ్యాంకు సిబ్బంది దిక్కుతోచక అల్లాడిపోయారు.  ఆహా.. నా ప్లాన్ సూపర్ హిట్   అనుకుంటూ సదరు కేటుగాడు వారి చేతిలో ఉన్న రూ. 4.53 లక్షల నగదు బ్యాగును లాక్కొని, హాలీవుడ్ రేంజ్ స్పీడుతో అక్కడి నుంచి కాళ్లకు బుద్ధి చెప్పాడు. అయితే మనోడి ఆనందం కేవలం అరగంట సేపు కూడా నిలవలేదు. కళ్లు మండే బాధలోనూ బ్యాంకు సిబ్బంది సమయస్ఫూర్తితో గట్టిగా అరిచి కేకలు వేయడంతో, ఆ వీధిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అలర్ట్ అయ్యారు.

సమాచారం అందుకున్న వెంటనే నాగపూర్ పోలీసులు రియల్ హీరోల మోడ్‌లోకి వచ్చేశారు. పారిపోతున్న నిందితుడి వెంట పడి గంటల తరబడి కాకుండా.. సరిగ్గా  30 నిమిషాల రికార్డు టైమ్‌లో తటోలి ప్రాంతానికి చెందిన నిందితుడు సూరజ్ బోర్కర్‌ను చుట్టుముట్టి కాలర్ పట్టుకున్నారు. కారం చల్లి డబ్బులు కొట్టేస్తే పోలీసులు కళ్లు మూసుకుని కూర్చుంటారనుకున్న నిందితుడి ఆశలపై పోలీసులు కారం చల్లేశారు.

పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి దొంగిలించిన రూ. 4.53 లక్షల మొత్తం నగదును పోలీసులు క్షేమంగా స్వాధీనం చేసుకున్నారు. బాలీవుడ్ టైప్ ఐడియాతో కోట్లు కొల్లగొట్టొచ్చని భావించిన ఆ ఘనుడు, ఇప్పుడు నాగ్‌పూర్ పోలీస్ స్టేషన్ లాకప్‌లో కూర్చుని కారప్పొడి లాజిక్కులను నెమరువేసుకుంటున్నాడు. ప్రస్తుతం పోలీసులు ఇతనిపై కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నారు.   

కళ్లలో కారం చల్లి కోట్లు కొల్లగొట్టడం సినిమాల్లోనే సాధ్యమని, రియల్ లైఫ్‌లో ఇలాంటి  కారప్పొడి తెలివితేటలు ప్రదర్శిస్తే ఖాకీల చేతిలో తన్నులు తప్పవని నాగ్‌పూర్ జనాలు ఈ ఘటనతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఏది ఏమైనా, క్షణాల్లో స్పందించి దొంగను పట్టుకున్న బీట్ మార్షల్స్ సమయస్ఫూర్తికి, ఎస్‌బీఐ రికవరీకి నెటిజన్లు మాత్రం ఫిదా అయిపోతున్నారు!                  


 

 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Loud Sound: హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
హైదరాబాద్‌లో భారీ శబ్దం.. రాజేంద్రనగర్, లంగర్‌హౌస్ పరిసరాల్లో ప్రకంపనలు!
Vijayawada Digital Arrest: విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
విజయవాడ డిజిటల్ అరెస్ట్ కేస్.. బాధితుడి ఖాతాలో రూ.7.32 కోట్లు జమ.. ముగ్గురు నిందితులకు కస్టడీ!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DA Hike For Govt Employees: దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
దీపావళికి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం DA పెంపును ప్రకటించిన కేంద్రం
Paneer Ban: ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
ఏపీలో కృత్రిమ పన్నీర్‌పై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం
Telangana Congress: ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
ఐదారు రోజులు చూసి పర్మిషన్ నిరాకరించడం కుట్రే! ఢిల్లీకి బస్సుల్లో తరలివస్తాం: మహేష్ గౌడ్
Cyclone Arnab Damage: అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
అర్నబ్ తుపాను బీభత్సం.. ఏపీలో ముగ్గురు మృతి.. గోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టం!
IAS Transfers: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. అటవీ శాఖకు జయేష్ రంజన్, ఇంధన శాఖకు వికాస్ రాజ్
Emotional Drama OTT: కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కడుపు మాడ్చుకున్న కూతురు... దొంగతనం చేసిందా? ETV Win ఓటీటీలోకి ఎమోషనల్ డ్రామా - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
YS Sharmila: తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
తన కుమార్తె వివాహానికి తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి సీతక్కకు షర్మిల ఆహ్వానాలు
Comedy Movie OTT: ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి మహేష్, ఎన్టీఆర్ పొగిడిన సినిమా... ఫాంటసీ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Embed widget