అన్వేషించండి

Kakinada AE Nookaraju family suicide case: సాదిక్ ఖాన్ మామూలోడు కాదు - ప్లాన్లన్నీ బయట పెట్టేశాడు - కొబ్బరి నీళ్లలో సైనెడ్ ఇచ్చి సౌజన్య భర్తను లేపేశాడు!

Sadiq Khan: నూకరాజు కుటుంబం ఆత్మహత్య, జగదీశ్వరరెడ్డి హత్య కేసులో షేక్ సాదిక్ ఖాన్ పోలీసుల కస్టడీలో నిజాలు ఒప్పుకున్నాడు. రూ.25 కోట్ల ఆస్తి కోసమే కొబ్బరి నీళ్లలో సైనైడ్ ఇచ్చినట్లు అంగీకరించాడు.

Shaik Sadiq Khan confession Kakinada:   ఆంధ్రప్రదేశ్‌లో  సంచలనం సృష్టించిన పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి. నూకరాజు కుటుంబం ఆత్మహత్య , ఆయన అల్లుడు జగదీశ్వరరెడ్డి హత్య కేసులో మైండ్ బ్లాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రైఫిల్ షూటింగ్ కోచ్ షేక్ సాధిక్ ఖాన్ పోలీసుల విచారణలో తన పాపాలను ఒప్పుకున్నాడు. రూ.25 కోట్ల విలువైన ఆస్తిని కాజేసేందుకు జగదీశ్వరరెడ్డిని పక్కా పథకం ప్రకారమే సైనైడ్ విషమిచ్చి హతమార్చినట్లు విచారణాధికారుల ముందు అంగీకరించాడు. 3 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సైనైడ్ నమూనాలతో పాటు నిందితుడిని   కాకినాడ కోర్టులో హాజరుపరచనున్నారు.

తమదైన స్టైల్లో పూర్తి వివరాలు రాబట్టిన పోలీసులు

పోలీసు కస్టడీ విచారణలో మొదటి రెండు రోజులు ఏమీ తెలియనట్లు బుకాయించిన సాధిక్ ఖాన్‌కు పోలీసులు హైదరాబాద్ అత్తరు వ్యాపారుల వద్ద సైనైడ్ కొనుగోలు చేసిన సాక్ష్యాలు, సిసిటివి ఫుటేజీలు చూపించడంతో నోరు విప్పక తప్పలేదు. మొదట జగదీశ్వరరెడ్డిని మట్టుబెట్టేందుకు కొబ్బరి నీళ్లలో విష పదార్థం కలిపి ఇచ్చానని, ఆపై అతను కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా మూడ్నాలుగు సార్లు విషం అందించానని తెలిపాడు. అయితే జగదీష్ హైదరాబాద్ ఆస్పత్రికి వెళ్లి కోలుకుని తిరిగొచ్చాక, మళ్లీ సైనైడ్ పంపించగా.. అది వాడిన మరుసటి రోజే జగదీశ్వరరెడ్డి ప్రాణాలు వదిలాడని సాధిక్ సంచలన వాంగ్మూలం ఇచ్చాడు.

నూకరాజు కుటుంబ ఆస్తిపై కన్నేసే !

ఈ ఘాతుకం వెనుక రూ.25 కోట్ల విలువైన రావులపాలెం ఆస్తుల దాహమే ఉన్మాదంగా మారినట్లు విచారణలో తేలింది. జగదీశ్వరరెడ్డిని అడ్డు తొలగించుకున్న తర్వాత ఆయన భార్య సౌజన్యను వివాహం చేసుకుంటే, నూకరాజు కుటుంబానికి చెందిన రూ.25 కోట్ల ఆస్తి మొత్తం తన చేతికి వస్తుందని సాధిక్ స్కెచ్ వేశాడు. అయితే సౌజన్య తండ్రి ఏఈ నూకరాజు ఈ పెళ్లికి ససేమిరా అనడమే కాకుండా, ఆస్తిని మనవడు కార్తికేయరెడ్డి పేరు మీద లేదా కుటుంబంలో మరొకరి పేరు మీద రాస్తామని తెగేసి చెప్పడంతో సాధిక్ తట్టుకోలేకపోయాడు.

నూకరాజు అంగీకరించకపోవడంతో వేధింపులు

 ఆస్తి కోసమే నేను ఇదంతా చేస్తే, వేరే వాళ్లకు ఎలా రాసిస్తారు  అంటూ సాధిక్ ఖాన్ నూకరాజు కుటుంబంతో తీవ్రంగా గొడవపడి, వారందరినీ చంపేస్తానని బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. సాధిక్ పెడుతున్న మానసిక నరకం, బ్లాక్‌మెయిలింగ్ తట్టుకోలేక నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు గోదావరి వారధిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటారని తాను అస్సలు ఊహించలేదని సాధిక్ విచారణలో వెల్లడించాడు. ఘటనకు సంబంధించి విషపదార్థాల శాంపిల్స్ సీజ్ చేసిన పోలీసులు, నిందితుడు సాధిక్ ఖాన్ పై సైనైడ్ ప్రయోగం, బెదిరింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడంపై పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ సిద్ధం చేశారు. ఒకవైపు అల్లుడిని విషమిచ్చి హత్య చేసి, మరోవైపు కోట్లాది ఆస్తి కోసం కుటుంబాన్ని బలితీసుకున్న ఈ రాక్షస క్రైమ్ మిస్టరీని ఛేదించిన పోలీసులు, నిందితుడికి కఠిన శిక్ష పడేలా కోర్టు ముందు బలమైన సాక్ష్యాధారాలు ఉంచుతున్నారు.     

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget