అన్వేషించండి

Telangana News: తెలంగాణలో వారికి గుడ్ న్యూస్.. దసరా నుంచి చేయూత కొత్త పింఛన్లు పంపిణీకి నిర్ణయం

Cheyutha Pension Scheme | తెలంగాణలో సర్టిఫికేట్ల సమస్యల వల్ల చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలనను పొడిగించారు. వచ్చే నెలలో అర్హుల జాబితా రూపొందించి, దసరాకు కొత్త పెన్షన్లు పంపిణీ చేయనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • చేయూత పెన్షన్ల దరఖాస్తు పరిశీలన గడువు నెలాఖరు వరకు పొడిగించారు.
  • సర్టిఫికేట్ల సమస్యతో అర్హులెందరో ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం గుర్తించింది.
  • ఒంటరి మహిళలకు సర్టిఫికేట్లు జారీకి పలువురు అధికారులకు అధికారం.
  • అర్హులకు దసరా కానుకగా కొత్త పెన్షన్లు వచ్చే నెల పంపిణీ.

Telangana Cheyutha Pension Scheme | హైదరాబాద్: తెలంగాణలో చేయూత పథకం కింద కొత్త పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తుదారులకు ఎదురవుతున్న సర్టిఫికేట్ల సమస్యల కారణంగా ధ్రువీకరణ పత్రాల జారీలో పలు వెసులుబాట్లు కల్పిస్తోంది. ఈ నెలలోనే ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని భావించినప్పటికీ, సర్టిఫికేట్ల సేకరణలో జాప్యం జరగడంతో ప్రక్రియను కొన్ని రోజులపాటు పొడిగించారు. ఈ నెలాఖరు నాటికి అప్లికేషన్లు పరిశీలించి, వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన వారికి దసరా పండుగ కానుకగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం తెలిసిందే. అందుకు అనుగుణంగా సెర్ప్ (SERP) సంస్థ ద్వారా గత నెల 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. మొదట్లో ఆగస్టు నెలాఖరు వరకు మాత్రమే గడువు ఇచ్చినా, నిబంధనల ప్రకారం దరఖాస్తుతో పాటు సరైన సర్టిఫికేట్లు జత చేయడం చాలామందికి వీలు కావడం లేదు. దీంతో దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 15 వరకు పెంచడమే కాకుండా, దరఖాస్తు సమయంలో సర్టిఫికెట్లు లేకపోయినా పరిశీలన నాటికి సమర్పించేలా సడలింపు ఇచ్చారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్, ఫైలేరియా బాధితులు అవసరమైన సర్టిఫికెట్లు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విడాకులు పొందిన ఒంటరి మహిళలకు కోర్టు ఉత్తర్వులు లేదా ఏడాదిగా ఒంటరిగా ఉంటున్నట్లు తహసీల్దార్ (MRO) నివేదిక అవసరం కాగా, వివాహం కాని వారు పంచాయతీ లేదా వార్డు అధికారుల వెరిఫికేషన్ కోరాల్సి వస్తోంది. అలాగే భర్త చనిపోయి 2 ఏళ్లు దాటిన వితంతువులకు మరణ ధ్రువీకరణ పత్రం (Death Certificate) ఇచ్చే అధికారం ఎవరికి ఉందనే దానిపై స్పష్టత లేకపోవడంతో సర్టిఫికేట్ల అందక పంపిణీ నిలిచిపోతోంది. ఈ సమస్యలను తీవ్రంగా పరిగణించిన సెర్ప్ సంస్థ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. 

ఒంటరి మహిళలకు సర్టిఫికేట్లు ఇచ్చే అధికారాన్ని తహసీల్దార్లతో (MRO) పాటు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు కల్పిస్తూ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లు దాటిన వితంతువుల మరణ ధ్రువీకరణ పత్రాల సమస్యను పరిష్కరించేందుకు, వారికి అవసరమైన వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్పుల ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ సకాలంలో చేయూత పెన్షన్ అందుతుందని, ఏ సమస్య ఉండదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

Frequently Asked Questions

చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన గడువు ఎప్పటి వరకు పొడిగించబడింది?

దరఖాస్తుదారులకు సర్టిఫికెట్ల సమస్యల కారణంగా, చేయూత పెన్షన్ల దరఖాస్తుల పరిశీలన గడువు ఈ నెలాఖరు వరకు పొడిగించబడింది. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన లబ్ధిదారుల జాబితా రూపొందించబడుతుంది.

చేయూత పెన్షన్ దరఖాస్తులకు సర్టిఫికెట్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి వెసులుబాట్లు కల్పించింది?

ఒంటరి మహిళలకు సర్టిఫికెట్లు ఇచ్చే అధికారాన్ని ఎంఆర్‌ఓలతో పాటు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు కల్పించారు. వితంతువుల మరణ ధ్రువీకరణ పత్రాల సమస్యకు పరిష్కారం కోసం అనుమతి కోరబడింది.

కొత్త చేయూత పెన్షన్లను ఎప్పుడు పంపిణీ చేయనున్నారు?

ఈ నెలాఖరు నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి, వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి జాబితాను రూపొందిస్తారు. దసరా పండుగ కానుకగా కొత్త పెన్షన్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణలో ఎన్ని కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది?

రాష్ట్రంలో 2.5 లక్షల కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సెర్ప్ సంస్థ ద్వారా గత నెల 9 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fire Accident: దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
దేవుడికి పెట్టిన దీపం కాల్చి బూడిద చేసింది -పేట్ బషీరాబాద్‌లో 2 ఫ్లాట్లలో సామాగ్రి దగ్దం
KTR News: కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
కృష్ణా జలాల్లో తెలంగాణకు కాంగ్రెస్ తీరని ద్రోహం.. బీఆర్ఎస్ మరో పోరాటం తప్పదన్న కేటీఆర్
N Ramchander Rao: 15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
15 వేల కుటుంబాల ఇళ్ల జోలికి రావద్దు.. మియాపూర్ భూముల వేలాన్ని అడ్డుకుంటామన్న రాంచందర్ రావు
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget