అన్వేషించండి

No Driving License: డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా

తక్కువ ధరలో లభించడం, సులభంగా ఉపయోగించుకునేలా ఉండటం ఈ Electric Scooters అతిపెద్ద ప్రత్యేకత. ఎవరైనా రోజూ కొన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉండి, ఎక్కువ వేగం అవసరం లేకపోతే ఇవి సరిపోతాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్‌లో తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్లకు అధిక డిమాండ్ ఉంది.
  • తక్కువ వేగం, పవర్‌తో లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు.
  • కొమాకి వంటి చవకైన స్కూటర్లు రూ.47 వేల నుంచి లభిస్తాయి.
  • రోజువారీ చిన్న ప్రయాణాలకు ఇవి చాలా అనుకూలం, ఉపయోగకరం.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అందులోనూ తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆకట్టుకుంటున్నాయి. వీటి వేగం తక్కువగా ఉండటం వల్ల వీటిని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ (Driving License), రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. ఇటువంటి స్కూటర్లు మీకు రోజువారీ పనుల కోసం ఉపయోగపడతాయి. రూ. 47 వేల నుంచి ప్రారంభమయ్యే ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.

మోటార్ పవర్ 250W కంటే తక్కువగా ఉండి, టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ కంటే తక్కువగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లకు(Electric Scooters) డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడమే వీటి ప్రత్యేకత. ఏదైనా మోడల్‌ను కొనుగోలు చేసే ముందు దాని స్పెసిఫికేషన్లు, అమలులో ఉన్న నిబంధనలను తెలుసుకోవాలి.

కొమాకి- Komaki XGT KM

ఈ జాబితాలో అత్యంత చవకైన ఈవీలలో కొమాకి XGT KM ఒకటి. దీని ధర సుమారు రూ. 46,924 ఉంటుంది. ఇందులో 60V 28Ah బ్యాటరీ ఇచ్చారు. కంపెనీ ప్రకారం, ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 60 నుండి 65 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటల టైం పడుతుంది. తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్. 

జెలియో లిటిల్ గ్రేసీ స్కూటర్ (Zelio Little Gracy)

తక్కువ బడ్జెట్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ కోరుకునేవారికి జెలియో లిటిల్ గ్రేసీ స్కూటీ ఒక మంచి ఆప్షన్. ధర సుమారు రూ. 49,500. ఇందులో 1.5kW ఎలక్ట్రిక్ మోటార్ ఇచ్చారు. ఒకసారి ఛార్జ్ అయితే దాదాపు 60 నుంచి 90 కిలోమీటర్ల వరకు నడుస్తుందని కంపెనీ తెలిపింది.

Also Read: 2026 Bajaj Pulsar 125 రివ్యూ: కేవలం కమ్యూటర్ బైక్ కాదు.. కొత్త ఇంజిన్, కొత్త ఫ్రేమ్, కొత్త టెక్నాలజీ!

ఈ-స్ప్రింటో రోమీ (e-Sprinto Roamy) 

ఈ-స్ప్రింటో రోమీ ఈవీ ధర సుమారు రూ. 54,999గా ఉంది. ఆయా నగరాల్లో ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇందులో 250W BLDC మోటార్ ఇచ్చారు. ఈ స్కూటర్ ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 100 కిలోమీటర్ల వరకు వెళ్తుందని కంపెనీ తెలిపింది. దీని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయడానికి దాదాపు 4 నుంచి 5 గంటల టైమ్ పడుతుంది.

యులు విన్ ఈవీ (Yulu Wynn)

తక్కువ ధర ఆప్షన్లలో యులు విన్ ఎలక్ట్రిక్ స్కూటీ ఒకటి. దీని ధర సుమారు రూ. 55,555గా ఉంది. ఇందులో 19.3Ah బ్యాటరీ ఇచ్చారు. రేంజ్ దాదాపు 68 కిలోమీటర్లు అని కంపెనీ తెలిపింది. ఈవీని స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసి స్టార్ట్ చేయవచ్చు. ఇందులో కీ-లెస్ సిస్టమ్ లభిస్తుంది.

ఒకినావా లైట్ స్కూటర్ (Okinawa Lite)

ఒకినావా లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 69,093. ఇందులో 1.25kWh బ్యాటరీ, 250W మోటార్ ఇచ్చారు. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 60 కిలోమీటర్లు వెళ్తుందని ఒకినావా కంపెనీ పేర్కొంది. పూర్తిగా ఛార్జింగ్ చేయడానికి దాదాపు 4 నుంచి 5 గంటల టైమ్ పడుతుంది.

జెమోపై రైడర్ ఈవీ (Gemopai Ryder)

జెమోపై రైడర్ ధర సుమారు రూ. 70,850. ధర కాస్త ఎక్కువ ఉన్నప్పటికీ దీనికి సైతం డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ అవసరం లేదు. ఇందులో 250W మోటార్‌తో పాటు 1.7kWh బ్యాటరీ వస్తుంది. ఫుల్ ఛార్జ్‌పై స్కూటీ దాదాపు 120 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి దాదాపు 4 గంటలు పడుతుంది.

Also Read: ఒకే కారు.. నాలుగు రకాల పవర్‌ట్రెయిన్‌లు! టాటా నెక్సాన్‌లో మీ అవసరానికి తగిన బెస్ట్ ఆప్షన్ ఏదంటే?

చిన్న ప్రయాణాలకు చాలా ఉపయోగకరం

ఈ స్కూటర్ల ప్లస్ పాయింట్ ఏంటంటే తక్కువ ధర, సులభంగా ఉపయోగించవచ్చు. తేలికగా ఉంటాయి. రోజూ కొన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించాల్సి ఉండి, ఎక్కువ స్పీడ్ అవసరం లేనివారికి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు సెట్ అవుతాయి. తక్కువ స్పీడ్ వల్ల వీటిని సాధారణ పెట్రోల్ స్కూటర్లతో పోలిస్తే నడపడం తేలిక అనిపిస్తుంది. అలాగే, లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ప్రస్తుత నిబంధనలను కూడా సరిచూసుకోవడం మంచిది. 

 

Frequently Asked Questions

భారత్‌లో తక్కువ ధర ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ ఎందుకు పెరుగుతోంది?

తక్కువ ధర, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేకపోవడం వంటి కారణాల వల్ల భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఇవి రోజువారీ పనులకు ఉపయోగపడతాయి.

డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేని ఎలక్ట్రిక్ స్కూటర్లకు షరతులు ఏమిటి?

మోటార్ పవర్ 250W కంటే తక్కువగా ఉండి, టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ కంటే తక్కువగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లకు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

ఈ తక్కువ వేగం ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రయోజనాలు ఏమిటి?

వీటి ధర తక్కువ, ఉపయోగించడానికి సులువు, తేలికైనవి. రోజూ కొన్ని కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉన్నవారికి, ఎక్కువ స్పీడ్ అవసరం లేనివారికి ఇవి అనుకూలం.

తక్కువ ధరలో లభించే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్ల పేర్లు చెప్పగలరా?

కొమాకి XGT KM, జెలియో లిటిల్ గ్రేసీ, ఈ-స్ప్రింటో రోమీ, యులు విన్ వంటివి తక్కువ ధరలో లభించే కొన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Fuel Efficient Diesel SUVs: డీజిల్ ఎస్‌యూవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? లీటర్‌కు దాదాపు 22 కి.మీ. మైలేజీ ఇచ్చే బెస్ట్‌ కార్లు ఇవే!
బెస్ట్‌ మైలేజ్‌ ఇచ్చే టాప్‌-10 మిడ్‌సైజ్‌ డీజిల్ SUVలు.. ఫస్ట్‌ ప్లేస్‌లో Hyundai Creta!
ఆరు లక్షల అమ్మకాల మైలురాయిని దాటిన Maruti Fronx.. నెలకు 20,000 కార్లు అమ్ముడవుతున్నాయ్!
రోజుకు 667 మంది కొంటున్న మిడిల్‌ క్లాస్‌ కారు ఇది.. రేటు ఎక్కువేం కాదు, మీరూ తీసుకోవచ్చు!
17,000 రూపాయలు పెరిగిన కొత్త Bajaj Pulsar RS200 ధర.. USD ఫోర్క్స్, క్విక్‌షిఫ్టర్‌తో అప్‌డేటెడ్‌ మోడల్ వచ్చేసింది!
Bajaj Pulsar RS200 అప్‌డేటెడ్‌ వెర్షన్‌ లాంచ్‌.. కొత్త TFT డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్‌తో మరింత ఫన్‌
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Fraud: మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
మంత్రి పేషీ పేరుతో ఉద్యోగాల దందా.. నలుగురి వద్ద రూ.50 లక్షలు వసూలు చేసిన నకిలీ ఓఎస్డీ!
UP CM Yogi Tears: తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
తల్లికి చివరి వీడ్కోలు.. భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్న UP CM యోగి ఆదిత్యనాథ్
TG Bharath: ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
ఏపీకి పెట్టుబడుల మంత్రం బ్రాండ్ చంద్రబాబు.. సూపర్ సిక్స్ 100 శాతం అమలు: మంత్రి టీజీ భరత్
CM Revanth Reddy: ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
ఇటలీ నేత వోట్ చోర్ నినాదంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు
Kia Carens Clavis EVని డిటో దింపేసిన కొత్త Hyundai Neira.. ఫీచర్లు, రేంజ్, ఇండియా లాంచ్ వివరాలు
Hyundai Neira MPV ఇంటీరియర్ అదిపోయింది.. 7 సీట్లు, పానోరమిక్‌ సన్‌రూఫ్, Bose సౌండ్ సిస్టమ్
IND VS NZ 1st Test Highlights: వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
వెల్లింగ్టన్ టెస్టులో భారత టాప్ 5 బ్యాటర్ల సరికొత్త చరిత్ర.. సేనా దేశాల్లో తొలిసారి ఐదుగురు యాభైకి పైగా పరుగులు
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Embed widget