అన్వేషించండి

2026 Bajaj Pulsar 125 రివ్యూ: కేవలం కమ్యూటర్ బైక్ కాదు.. కొత్త ఇంజిన్, కొత్త ఫ్రేమ్, కొత్త టెక్నాలజీ!

2026 బజాజ్ పల్సర్ 125లో భారీ మార్పులు వచ్చాయి. కొత్త ఇంజిన్, ఫ్రేమ్, మోనోషాక్, ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ పనితీరు, ధర, సౌకర్యం ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

2026 Bajaj Pulsar 125 Price, Mileage And Features Telugu: బజాజ్ పల్సర్ 125 అనే పేరే టూవీలర్‌ మార్కెట్‌లో ప్రత్యేకమైనది. తక్కువ ఖర్చుతో పల్సర్ కొనాలనుకునేవాళ్లకు ఇది అందుబాటులో ఉన్న మోడల్. ఇటీవల, 2026 పల్సర్ 125 కూడా లాంచ్‌ అయింది. ఇది, కొత్త రూపంతో మాత్రమే కాకుండా భారీ మార్పులతోనూ వచ్చింది. మామూలుగా చూస్తే పాత పల్సర్‌లానే కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం పూర్తిగా కొత్త బైక్ అని చెప్పొచ్చు.

కొత్త పల్సర్ 125లో పాత డబుల్ క్రేడిల్ ఫ్రేమ్ స్థానంలో తేలికైన డైమండ్ ఫ్రేమ్ వచ్చింది. రెండు షాక్ అబ్జార్బర్ల స్థానంలో మోనోషాక్ ఇచ్చారు. ఇంజిన్ కూడా కొత్తదే. 124.6cc సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజిన్ 12.1hp శక్తిని, 11.4Nm టార్క్‌ను అందిస్తుంది. ఐదు స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. కొత్త మార్పులతో బైక్ బరువు కూడా తగ్గింది. ట్యాంక్‌లో ఇంధనం పూర్తిగా నింపితే బైక్ బరువు 131 కిలోలుగా ఉంది.

డిజైన్ 
బయటి డిజైన్ విషయంలో బజాజ్ పెద్దగా ప్రయోగాలు చేయలేదు. పల్సర్‌కు గుర్తింపు తెచ్చిన వూల్ఫ్ ఐ హెడ్‌లైట్, బలమైన ఇంధన ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్లు, వెనుక వైపు షార్ప్‌ డిజైన్ కొనసాగాయి. అందుకే కొత్త బైక్‌ను చూసిన వెంటనే ఇది పల్సర్ అని గుర్తుపట్టేయొచ్చు.

సీటింగ్ కూడా కమ్యూటర్ బైక్‌కు తగ్గట్టుగానే ఉంది. రైడింగ్ పొజిషన్ నిటారుగా ఉంటుంది. ఫుట్‌పెగ్‌లు కొద్దిగా వెనక్కి ఉండటంతో స్పోర్టీ టచ్ కనిపిస్తుంది. సీటు ఎత్తు 795 మిల్లీమీటర్లు. అందువల్ల తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు కూడా బైక్‌ను నడపడం సులభంగా ఉంటుంది. సింగిల్ పీస్ సీటు, స్ప్లిట్ సీటు వేరియంట్లను బట్టి అందుబాటులో ఉన్నాయి.

నగర ట్రాఫిక్‌లో పల్సర్ 125 మంచి సౌకర్యాన్ని అందిస్తుంది. ఇంజిన్ స్మూత్‌గా ఉంటుంది. తక్కువ, మధ్యస్థ వేగాల్లో టార్క్ బాగుంటుంది. క్లచ్ చాలా తేలికగా ఉండటంతో ట్రాఫిక్‌లో పదేపదే గేర్ మార్చాల్సి వచ్చినా ఇబ్బంది తక్కువ. హైవేపై కూడా బైక్ సౌకర్యంగా ప్రయాణిస్తుంది. గంటకు 80 నుంచి 85 కిలోమీటర్ల వేగం వరకు సౌకర్యవంతంగా క్రూజ్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: టైర్‌ మార్పు నుంచి టోయింగ్‌ వరకు, నిల్‌ పెట్రోల్‌ నుంచి ఇంజిన్‌ డౌన్‌ వరకు.. మీ ఆపదలో ఆదుకునే సర్వీస్‌ ఇది!

రైడ్ & హ్యాండ్లింగ్‌లో కూడా బైక్ నమ్మకంగా అనిపిస్తుంది. మలుపుల్లోనూ, నేరుగా వెళ్లేటప్పుడూ స్థిరంగా ఉంటుంది. అయితే వెనుక మోనోషాక్ కొద్దిగా స్ప్రింగీగా అనిపిస్తుంది. పెద్ద గుంతలు, గట్టి రోడ్డు దెబ్బల వద్ద రైడర్‌కు కుదుపులు ఎక్కువగా అనిపించవచ్చు. గేర్ మార్పులు కూడా కొద్దిగా రబ్బరీగా అనిపిస్తాయి.

ఫీచర్లు
ఫీచర్ల విషయంలో మాత్రం టాప్ వేరియంట్లు ఆకట్టుకుంటాయి. USB-C ఛార్జింగ్ పోర్ట్, 4 రైడింగ్ మోడ్‌లు, బ్లూటూత్ కనెక్టివిటీ, రంగుల టీఎఫ్‌టీ డిస్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. కొన్ని ఫీచర్లు దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ధర
2026 బజాజ్ పల్సర్ 125 ధర రూ.93,893 నుంచి ప్రారంభమై రూ.1,04,867 (ఎక్స్‌షోరూమ్) వరకు ఉంటుంది. ధరల ప్రకారం చూస్తే పోటీకి తగ్గట్టుగానే ఉంది. కొన్ని చిన్న లోపాలు ఉన్నప్పటికీ, పాత పల్సర్ 125తో పోలిస్తే కొత్త మోడల్‌లో వచ్చిన అంతర్గత మార్పులు చాలా పెద్దవి. ధరకు తగ్గ విలువ, సౌకర్యం, పనితీరు కోరుకునే వారికి కొత్త పల్సర్ 125 మంచి కమ్యూటర్ బైక్‌గా నిలుస్తుంది.

ఇది కూడా చదవండి: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

3-Cylinder Vs 4-Cylinder: 3-సిలిండర్‌ లేదా 4-సిలిండర్‌.. మీ ఫ్యామిలీ కారుకు ఏ ఇంజిన్ సరిపోతుందో తెలుసుకోండి
3 సిలిండర్ ఇంజిన్‌ vs 4 సిలిండర్ ఇంజిన్.. ఏ కారు బెస్ట్? మైలేజ్, పెర్ఫార్మెన్స్‌, వైబ్రేషన్స్‌ పూర్తి వివరాలు
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
ప్రయాణానికి 'సేఫెస్ట్‌ కారు' అని నిరూపించుకున్న Mahindra XEV 9S.. భారత్ NCAP పరీక్షల్లో '5 స్టార్ సేఫ్టీ రేటింగ్'
మహీంద్రా XEV 9S కారు చాలా సేఫ్‌ గురూ! క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ రేటింగ్
VinFast e-scooters: విన్‌ఫాస్ట్ నుంచి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. భారతీయుల కోసమే ప్రత్యేకంగా తయారీ!
వియత్నాం దేశపు ఎలక్ట్రిక్‌ స్కూటర్లు.. ఇండియా కోసమే ప్రత్యేకంగా తయారీ!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Cyclone Akvan Update: దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
దిశ మార్చుకున్న అక్వాన్ తుపాన్.. ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశాలకు ముప్పు, కంట్రోల్ రూమ్ నంబర్లు
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
LeT Commander Encounter: వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
వీడియో కాల్ చేసినా వినలేదు.. మసీదులో దాక్కున్న లష్కరే టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం
Indiramma Kutumba Jeevitha Bima: కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
కోటికిపైగా కుటుంబాలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ .. రేపటి నుంచి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' స్కీమ్ ప్రారంభం!
Siddipet Politics: సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన.. నిలిచిపోయిన పనులపై ఫ్లెక్సీలతో స్థానికులు స్వాగతం
FIVA Award: భారత్‌లో కార్ల విప్లవానికి నాంది పలికిన Maruti 800.. గ్లోబల్ అవార్డు అందుకున్న తొలి భారతీయ కారు!
కామన్‌మ్యాన్‌ తొలి కారు మారుతి 800 గుర్తుందిగా.. ఇప్పుడు ఈ కారుకు ప్రతిష్టాత్మక గ్లోబల్‌ అవార్డ్‌
Morne Morkel Comments: తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
తొలి టెస్ట్ తుది జట్టులో సిరాజ్ చోటుపై సస్పెన్స్.. తుది నిర్ణయం కెప్టెన్  గిల్ చేతిలోనే ఉందన్న బౌలింగ్ కోచ్ 
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
కార్తీకమాసంలో సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు ఆచరించాలి?
Embed widget