అన్వేషించండి

PUC Certificate: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!

PUC సర్టిఫికెట్ లేకపోయినా, గడువు ముగిసినా వాహనదారులకు భారీ జరిమానా. PUC చలాన్ నిబంధనలు, ఫైన్, సర్టిఫికెట్ పొందే విధానం తెలుసుకోండి.

PUC Challan in India: మీకు సొంత వాహనం ఉందా? అయితే డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్సీతో పాటు మరో ముఖ్యమైన పత్రం తప్పనిసరిగా ఉండాలి. అదే పీయూసీ (PUC) సర్టిఫికెట్. పీయూసీ అంటే.. పొల్యూషన్‌ అండర్‌ కంట్రోల్‌ (Pollution Under Control). అంటే, వాహనం నుంచి వెలువడే పొగ ప్రభుత్వం నిర్ణయించిన పరిమితుల్లోనే ఉందని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. పీయూసీ లేకుండా వాహనం నడిపితే జరిమానా తప్పదు. సాధారణంగా, మనం PUC సర్టిఫికెట్‌ను పొల్యూషన్‌ సర్టిఫికెట్‌ అని పిలుస్తుంటాం.

పీయూసీ చలాన్ అంటే ఏమిటి?

వాహనానికి చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికెట్ లేకపోతే అధికారులు విధించే జరిమానానే పీయూసీ చలాన్. పెట్రోల్, డీజిల్ వాహనాలకు PUC సర్టిఫికెట్ ఉండటం తప్పనిసరి. వాహనం నుంచి వచ్చే పొగను ప్రత్యేక పరికరాలతో పరీక్షిస్తారు. కాలుష్య స్థాయిలు నిబంధనల పరిధిలో ఉంటే PUC సర్టిఫికెట్ జారీ చేస్తారు.

సర్టిఫికెట్ గడువు ముగిసినా సమస్యే. PUC లేకుండా రోడ్డుపై వాహనం నడిపినా చలాన్ పడొచ్చు. కొన్ని సందర్భాల్లో వాహనం ఉద్గారాలు అనుమతించిన స్థాయిని మించితే కూడా చర్యలు తీసుకుంటారు.

ఎంత జరిమానా?

PUC నిబంధనలను ఉల్లంఘిస్తే భారీ జరిమానా పడే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం కొన్ని సందర్భాల్లో రూ.10,000 వరకు ఫైన్ విధించవచ్చు. కేసు తీవ్రతను బట్టి కోర్టుకు కూడా తీసుకెళ్లవచ్చు. వాహనం కాలుష్య పరీక్షలో విఫలమైతే మరమ్మతులు చేయించి మళ్లీ పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే చిన్న నిర్లక్ష్యం పెద్ద మొత్తంలో ఖర్చుకు దారితీయొచ్చు. వాహనదారులు తమ PUC గడువు తేదీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.

PUC ఎంతకాలం చెల్లుతుంది?

కొత్త వాహనాలకు PUC సర్టిఫికెట్ సాధారణంగా మొదటి ఏడాది వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలో పునరుద్ధరించుకోవాలి. సాధారణంగా ఆరు నెలలకు ఒకసారి PUC పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే వాహనం రకం, నిబంధనల ఆధారంగా చెల్లుబాటు వ్యవధి మారవచ్చు.

PUC స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో PUC వివరాలు చెక్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలుసుకోవచ్చు. గడువు దగ్గరపడితే ముందుగానే PUC పునరుద్ధరించుకోవడం మంచిది. ఫిజికల్ కాపీతో పాటు డిజిటల్ కాపీని కూడా అందుబాటులో ఉంచుకోవచ్చు.

ఇది కూడా చదవండి: మైండ్ బ్లోయింగ్ Hero Xoom స్కూటర్ రూ.78 వేలకే.. దీని లోన్‌ వివరాలు, EMI లెక్కలు తెలుసుకోండి

PUC ఎక్కడ తీసుకోవాలి?

దేశవ్యాప్తంగా అనుమతి పొందిన కాలుష్య పరీక్ష కేంద్రాల్లో PUC సర్టిఫికెట్ పొందొచ్చు. పెట్రోల్ బంకులు, సర్వీస్ కేంద్రాల్లో కూడా ఇలాంటి కేంద్రాలు ఉంటాయి. వాహనం నుంచి వెలువడే కాలుష్యాన్ని పరికరాలతో పరీక్షిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే సర్టిఫికెట్ జారీ చేస్తారు.

చలాన్ నుంచి ఎలా తప్పించుకోవాలి?

PUC గడువు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. సమయం పూర్తయ్యేలోపే పునరుద్ధరించుకోవాలి. వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి. ఇంజిన్‌లో సమస్యలు ఉంటే కాలుష్యం పెరిగే అవకాశం ఉంది. వాహనానికి సరైన ఇంధనం ఉపయోగించడం కూడా ముఖ్యం.

ముఖ్యంగా.. PUC గడువు ముగిసిన తర్వాత వాహనం నడపకపోవడం ఉత్తమం. కొన్ని నిమిషాల్లో పూర్తయ్యే పరీక్షను నిర్లక్ష్యం చేస్తే కొన్ని వేల రూపాయల జరిమానా చెల్లించాల్సి రావచ్చు. పీయూసీ సర్టిఫికెట్‌ను సకాలంలో పునరుద్ధరించుకోవడం ద్వారా జరిమానా నుంచి తప్పించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవచ్చు.

ఇది కూడా చదవండి: మీ బడ్జెట్‌లో వచ్చే 17 రకాల హీరో బైక్‌లు, స్కూటర్లు.. ధర రూ.1 లక్షలోపే, మీరు ఏది తీసుకుంటారు?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bayon vs Creta: క్రెటా కంటే బేయాన్ ధర తక్కువ.. ఏ కారులో ఫీచర్లు ఎక్కువ? కొనే ముందే ఈ తేడాలు తెలుసుకోండి!
హ్యుందాయ్ బేయాన్ vs హ్యుందాయ్ క్రెటా.. ఏది బెస్ట్ SUV?
2027 Triumph Tiger 1200 వచ్చేసింది.. ధర తెలిస్తే షాక్‌ అవుతారు! ఇందులోని రాడార్‌ టెక్నాలజీకి ఫిదా అవ్వాల్సిందే!
2027 ట్రయంఫ్‌ టైగర్‌ 1200 లాంచ్‌.. దీని లెవెలే వేరబ్బా! ఈ బైక్‌కు పెట్టే ఖర్చుతో ఒక లగ్జరీ కారు కొనొచ్చు
Hatchback Car Diwali Offers: దీపావళికి కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారు కొనాలనుకుంటున్నారా? టాటా నుంచి మారుతి వరకు లక్షల్లో డిస్కౌంట్లు!
కారు కొనడానికి ఇదే సరైన సమయం! హ్యాచ్‌బ్యాక్‌లపై దీపావళి ఆఫర్లు.. లక్షల్లో డిస్కౌంట్లు!
FASTag Pass: ఫాస్టాగ్‌ యాన్యువల్‌ పాస్‌ vs లోకల్‌ పాస్‌ vs రెగ్యులర్‌ రీఛార్జ్‌.. మీకు ఏది బెస్ట్?
హైవేపై మీ ప్రయాణానికి ఏ FASTag పాస్ ప్రయోజనం? మీ ఖర్చు తగ్గించే ఆప్షన్ ఇదే!
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget