అన్వేషించండి

టైర్‌ మార్పు నుంచి టోయింగ్‌ వరకు, నిల్‌ పెట్రోల్‌ నుంచి ఇంజిన్‌ డౌన్‌ వరకు.. మీ ఆపదలో ఆదుకునే సర్వీస్‌ ఇది!

టైర్‌ పంక్చర్‌, బ్యాటరీ డౌన్‌, ఇంధనం కొరత నుంచి కారు బ్రేక్‌డౌన్‌ వరకు ఎదురయ్యే సమస్యల్లో రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ ఎలా సాయం చేస్తుందో తెలుసుకోండి.

Roadside Assistance Service India: ప్రతిరోజూ కారులో ప్రయాణించేవారికి చిన్నపాటి సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. టైర్‌ పంక్చర్‌ కావచ్చు. బ్యాటరీ డౌన్‌ కావచ్చు. పెట్రోల్‌ అయిపోవచ్చు. ఒక్కోసారి కారు అసలు స్టార్ట్‌ కాకపోవచ్చు. ఇలాంటి సమస్యలు ఎప్పుడు వస్తాయో చెప్పలేం. ముఖ్యంగా వర్షంలో, చీకటిలో, హైవేపై లేదా అపరిచిత ప్రాంతంలో కారు ఆగిపోతే పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో "రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌" సేవలు ఎంతో ఉపయోగపడతాయి. అత్యవసర పరిస్థితుల్లో వాహనదారుడికి వెంటనే సాయం అందిస్తాయి. చిన్న సమస్యను అక్కడికక్కడే పరిష్కరించడంతో పాటు, అవసరమైతే కారును సురక్షిత ప్రాంతానికి తరలిస్తాయి.

టైర్‌ పంక్చర్‌ అయితే..
టైర్‌లో గాలి పూర్తిగా పోయినా లేదా టైర్‌ దెబ్బతిన్నా ప్రయాణం కొనసాగించడం ప్రమాదకరం. రోడ్డుపై ఉన్న గాజు ముక్కలు, మేకులు, గుంతలు, తక్కువ గాలి, టైర్‌ అరిగిపోవడం వంటి కారణాలతో పంక్చర్‌ కావచ్చు. ఇలాంటి సమయంలో రోడ్‌సైడ్‌ సిబ్బంది టైర్‌ మార్చడంలో లేదా మరమ్మతు చేయడంలో సాయం చేస్తారు.

బ్యాటరీ డౌన్‌ అయితే..
కారు స్టార్ట్‌ కాకపోవడానికి బ్యాటరీ సమస్య ప్రధాన కారణం. లైట్లు ఆపకుండా ఉంచడం, ఎక్కువ కాలం కారు నడపకపోవడం, పాత బ్యాటరీ, విద్యుత్‌ వ్యవస్థలో లోపాలు దీనికి కారణం కావచ్చు. జంప్‌ స్టార్ట్‌ సాయంతో కారును మళ్లీ నడిపించే అవకాశం ఉంటుంది.

పెట్రోల్‌ అయిపోతే..
దూర ప్రయాణాల్లో ఇంధనం ఎంత అవసరమో సరిగ్గా అంచనా వేయలేకపోతే మధ్యలోనే కారు ఆగిపోవచ్చు. ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల కూడా ఇంధనం ఊహించిన దానికంటే వేగంగా ఖర్చవుతుంది. ఇలాంటి సందర్భాల్లో అత్యవసర ఇంధన సరఫరా ఉపయోగపడుతుంది.

కారు స్టార్ట్‌ కాకపోతే..
బ్యాటరీతో పాటు స్టార్టర్‌, ఇగ్నిషన్‌, ఇంధన సరఫరా వంటి వ్యవస్థల్లో లోపం వల్ల కారు స్టార్ట్‌ కాకపోవచ్చు. సమస్యను ప్రాథమికంగా గుర్తించి అవసరమైన సాయం అందించడంలో రోడ్‌సైడ్‌ సేవలు ఉపయోగపడతాయి.

కారు తాళాలు లోపలే ఉండిపోయినా..
తాళాలు కారులోనే పెట్టి తలుపులు లాక్‌ చేసుకోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. తాళం చెవి పాడవడం లేదా ఆటోమేటిక్‌ లాకింగ్‌ వల్ల కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ నిపుణుల సాయంతో కారు తలుపును తెరవవచ్చు.

ఇది కూడా చదవండి: కేవలం రూ.6.30 లక్షలకే సేఫెస్ట్ హ్యాచ్‌బ్యాక్.. Tata Altroz కనీస డౌన్‌పేమెంట్‌, నెలవారీ EMI లెక్కలు చూశారా?

ఇంజిన్‌ వేడెక్కినా..
కూలెంట్‌ తగ్గడం, రేడియేటర్‌లో లీకేజీ, కూలింగ్‌ ఫ్యాన్‌ సమస్య, థర్మోస్టాట్‌ లోపం వల్ల ఇంజిన్‌ వేడెక్కుతుంది. అలాంటి సమయంలో కారును వెంటనే ఆపాలి. ఎక్కువసేపు నడిపితే ఇంజిన్‌కు తీవ్ర నష్టం కలగవచ్చు.

విద్యుత్‌ సమస్యలు వచ్చినా..
ఫ్యూజ్‌లు కాలిపోవడం, వైర్లలో సమస్యలు, బ్యాటరీ లోపాలు, సెన్సార్‌ సమస్యలు వంటి కారణాలతో కారులో విద్యుత్‌ వ్యవస్థ దెబ్బతినవచ్చు. కొన్ని సందర్భాల్లో ఇది భద్రతకు కూడా ముప్పుగా మారుతుంది.

బ్రేకులు పనిచేయకపోతే..
బ్రేక్‌ ప్యాడ్లు అరిగిపోవడం, బ్రేక్‌ లిక్విడ్‌ లీక్‌ కావడం, డిస్క్‌ల సమస్య వంటి కారణాలతో బ్రేకింగ్‌ సామర్థ్యం తగ్గుతుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన సమస్య. ఇలాంటి సమయంలో కారును నడపకుండా సురక్షితంగా తరలించడం మంచిది.

క్లచ్‌ విఫలమైనా..
క్లచ్‌ ప్లేట్‌ అరిగిపోవడం, క్లచ్‌ లిక్విడ్‌ లీక్‌ కావడం లేదా క్లచ్‌ కేబుల్‌ దెబ్బతినడం వల్ల గేర్లు మార్చడం కష్టమవుతుంది. సమస్య తీవ్రమైతే కారు ముందుకు కదలదు. అప్పుడు టోయింగ్‌ సాయం అవసరం కావచ్చు.

పూర్తిగా కారు మొరాయిస్తే..
ఇంజిన్‌, గేర్‌బాక్స్‌, ఇంధన వ్యవస్థ లేదా విద్యుత్‌ వ్యవస్థలో తీవ్రమైన లోపం వస్తే కారు పూర్తిగా ఆగిపోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో  రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ నిపుణుల సాయంతో సమస్యను గుర్తించడం లేదా కారును సర్వీస్‌ కేంద్రానికి తరలించడం చేయవచ్చు.

ఇది కూడా చదవండి: మీ డ్రైవింగ్ లైసెన్స్ గడువు ముగిసిందని టెన్షన్ వద్దు.. ఇంట్లో కూర్చునే ఎలా రెన్యువల్ చేసుకోవాలంటే?

అయితే, సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ వాహనాన్ని క్రమం తప్పకుండా సర్వీసింగ్‌ చేయించాలి. టైర్లలో గాలి, బ్యాటరీ, కూలెంట్‌, బ్రేకులు పరిశీలించాలి. డాష్‌బోర్డ్‌లో హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదు. కారులో అత్యవసర వస్తువులను కూడా ఉంచుకోవాలి. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోని సమస్యలు రావచ్చు. అలాంటి సమయంలో రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ దొరికితే భరోసాగా ఉంటుంది. కాబట్టి, రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌ సర్వీస్‌ కాంటాక్ట్‌ నంబర్‌ మీ మొబైల్‌ ఫోన్‌లో తప్పకుండా ఉండాలి.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

LFP vs NMC Batteries: ఎలక్ట్రిక్‌ కారు బ్యాటరీ విషయంలో ఈ తప్పు చేయకండి! 100% ఛార్జింగ్ దేనికి అవసరం? దేనిని 80% దగ్గర ఆపాలి?
ఎలక్ట్రిక్ కారులో LFP లేదా NMC బ్యాటరీల్లో ఏది బెస్ట్? తెలుగు రాష్ట్రాల వాతావరణానికి ఏది సరిపోతుంది?
Car Insurance: కారు ఇన్సూరెన్స్‌లో ఏ యాడ్‌-ఆన్‌ ఎంచుకోవాలి? ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌ పూర్తి వివరాలు
ఇంజిన్‌ ప్రొటెక్షన్‌ vs జీరో డిప్రిసియేషన్‌: కార్ ఇన్సూరెన్స్‌లో ఈ రెండింటి మధ్య తేడా ఏంటి?
పెద్ద ఫ్యామిలీల కోసం 6 సీటర్, 7 సీటర్ SUVలు.. పెట్రోల్, డీజిల్‌తో పాటు ఎలక్ట్రిక్ ఆప్షన్లు కూడా!
ఫ్యామిలీతో పిక్నిక్‌కు వెళ్లడానికి బెస్ట్ SUVలు.. రూ.8.57 లక్షల నుంచే 7 సీటర్ కార్లు!
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul on Revanth Reddy: నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
నాతో చేతులు కలపండి.. రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చేస్తా.. కాంగ్రెస్ నేతలకు కేఏ పాల్ పిలుపు
CM Revanth Reddy: హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో PRTS కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
హైదరాబాద్‌లో కొత్త రవాణా వ్యవస్థ.. 3 కారిడార్లలో పీఆర్టీఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం
Hyderabad Bharat Summit : హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
హైదరాబాద్‌లో భారత్ సమ్మిట్.. 70 దేశాల ప్రతినిధుల రాక, రాహుల్ గాంధీ పర్యటనపై ఉత్కంఠ!
Why Close Aides Are Leaving YS Jagan: విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
విజయమ్మ, షర్మిల నుంచి విజయసాయిరెడ్డి వరకు - వైఎస్ జగన్‌కు ఆప్తులే ఎందుకు శత్రువులవుతున్నారు? అసలు తప్పు ఎక్కడుంది?
Makhana For Thyroid : థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
థైరాయిడ్ ఉన్నవారు రోజూ మఖానా తింటే కలిగే లాభాలు ఇవే.. ఎలా తింటే మంచిదంటే..
AP Municipal Elections 2026: 4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
4 కార్పొరేషన్లలో టీడీపీ ఒక్క చోటే పోటీ.. పుంజుకోవడానికి వైసీపీకి ఇది మరో సువర్ణావకాశమా?
Expert Opinion: కాలంతో పాటు బైక్‌లు మారుతున్నా సర్వీసింగ్‌ తీరు మారడం లేదు.. ఇంకా మెరుగుపడాలి!
ఖరీదైన, మోడ్రన్‌ బైక్‌లు.. నాసిరకం, పాతకాలపు సర్వీసింగ్! మెకానిక్‌లు మెరుగుపడేది ఎప్పుడు?
Telangana Volunteer System : తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
తెలంగాణలో వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు - రేవంత్ మాస్టర్ ప్లాన్.. సంక్షేమానికి తోడ్పాటా, పొలిటికల్ రిస్కా?
Embed widget