అన్వేషించండి

ఒకే కారు.. నాలుగు రకాల పవర్‌ట్రెయిన్‌లు! టాటా నెక్సాన్‌లో మీ అవసరానికి తగిన బెస్ట్ ఆప్షన్ ఏదంటే?

టాటా నెక్సాన్ పెట్రోల్, డీజిల్, CNG, EV వేరియంట్ల ధర, మైలేజీ, పనితీరు & నిర్వహణ ఖర్చులను పోల్చి మీకు సరైన ఆప్షన్ ఏదో తెలుసుకోండి.

Tata Nexon Price, Mileage And Features Telugu: ఒకే కారు.. నాలుగు ఆప్షన్లు - అదే టాటా నెక్సాన్‌. ఈ మోడల్‌లో పెట్రోల్, డీజిల్, CNG, EV వేరియంట్లు ఉన్నాయి. డిజైన్, స్పేస్‌, ప్రాక్టికాలిటీ, భద్రత, ఫీచర్లలో పెద్దగా తేడా ఉండదు. కానీ ఇంజిన్, పనితీరు, మైలేజీ, ప్రయాణ ఖర్చులో మాత్రం భారీ తేడా ఉంటుంది. అందుకే మీ అవసరానికి ఏ నెక్సాన్ సరిపోతుందో తెలుసుకోవడం ముఖ్యం. 

పెట్రోల్ వేరియంట్‌ 
1.2 లీటర్ మూడు సిలిండర్ టర్బో ఇంజిన్ 120hp శక్తి, 170Nm టార్క్ ఇస్తుంది. ఐదు స్పీడ్, ఆరు స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్సులతో పాటు 6-స్పీడ్ AMT, 7-స్పీడ్ DCA ఆప్షన్లు ఉన్నాయి. ధర రూ.7.40 లక్షల నుంచి రూ.13.90 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్ వేరియంట్లలో 7-స్పీడ్ DCA ఎక్కువ ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే, నిపుణులు చేసిన వాస్తవ ట్రాఫిక్‌ పరీక్షల్లో, ఈ కారు నగరంలో 7.7 కిలోమీటర్లు, హైవేపై 13.9 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. ఒక్కో లీటరుకు అయ్యే ప్రయాణ ఖర్చును బట్టి, ఈ లైనప్‌లో ఇదే ఎక్కువ ఖర్చు పెట్టిస్తుంది.

డీజిల్ వేరియంట్‌ 
1.5 లీటర్ 4 సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. పవర్‌ట్రెయిన్‌లో టార్క్ బలంగా ఉంటుంది. హైవే ప్రయాణాలకు ఇది మంచి ఎంపిక. అయితే రిఫైన్‌మెంట్ విషయంలో పెట్రోల్ కంటే వెనుకబడి ఉంటుంది. రియల్‌ వరల్డ్‌ టెస్ట్‌లో డీజిల్ మాన్యువల్ 17.95 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చింది. కిలోమీటర్‌కు సుమారు రూ.5.30 ఖర్చు వచ్చింది. ఏడాదికి ఎక్కువ దూరం ప్రయాణించేవారికి డీజిల్ సరైన ఎంపికగా చెప్పొచ్చు. 

EV వేరియంట్‌ 
నెక్సాన్ EVలో 30 కిలోవాట్ అవర్, 45 కిలోవాట్ అవర్ బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. 30kWh వెర్షన్ వాస్తవ వినియోగంలో 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇస్తుంది. 45kWh వెర్షన్ సుమారు 350 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. డ్రైవింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. శబ్దం తక్కువ. పికప్ కూడా వేగంగా ఉంటుంది. ఇంట్లో ఛార్జింగ్ చేస్తే కిలోమీటర్‌కు సుమారు రూ.1.03 మాత్రమే ఖర్చవుతుంది. 45kWh వెర్షన్‌ను 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సుమారు 29 నిమిషాలు పడుతుంది. 

ఇది కూడా చదవండి: మీ వాహనానికి PUC ఉందా? లేదంటే రూ.10,000 వరకు ఫైన్.. ఇలా తప్పించుకోండి!

CNG వేరియంట్‌ 
ఈ లైనప్‌లో ఇదే బాగా బ్యాలెన్స్ అయిన ఆప్షన్‌గా కనిపిస్తుంది. పెట్రోల్‌లో ఉన్న 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో ఇంజిన్‌నే ఇందులోనూ ఉపయోగించారు.ఈ వేరియంట్‌ 100hp, 170Nm టార్క్ ఇస్తుంది. నిజ జీవిత ట్రాఫిక్‌లో.. నగరంలో 15.1 కిలోమీటర్లు, హైవేపై దాదాపు 24 కిలోమీటర్లు మైలేజీ ఇచ్చింది. కిలోమీటర్‌కు సుమారు రూ.4.28 ఖర్చవుతుంది. పెట్రోల్‌ వేరియంట్‌ తరహా డ్రైవింగ్, తక్కువ ప్రయాణ ఖర్చు, మంచి రేంజ్ దీని ప్రధాన బలాలు. అయితే CNG స్టేషన్లు అందుబాటులో లేకపోవడం, కొన్నిచోట్ల ఎక్కువ సమయం క్యూలో నిలబడాల్సి రావడం ఇబ్బంది. 

ఏది మీకు సరైనది?
తక్కువ ప్రారంభ ధర & ఎక్కువ గేర్‌బాక్స్ ఎంపికలు కావాలంటే పెట్రోల్ వేరియంట్‌; ఏడాదిలో ఎక్కువ ప్రయాణం, హైవే వినియోగం ఉంటే డీజిల్ వేరియంట్‌; ఇంట్లో ఛార్జింగ్ సౌకర్యం ఉండి, ఎక్కువగా నగరంలో నడిపితే EV వేరియంట్‌; తక్కువ ఖర్చుతో పెట్రోల్‌ లాంటి డ్రైవింగ్ కావాలంటే CNG వేరియంట్‌ అనువుగా ఉంటాయి.

ఇది కూడా చదవండి: 2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ కొనబోతున్నారా? కొత్త ధరలు వచ్చేశాయ్.. ఏ వేరియంట్ ఎంతంటే?

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shivam Dube New Car: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు!
Mahindra XEV 9S ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ కొన్న శివమ్‌ దూబే.. ఏంటి ఆ కారు స్పెషాలిటీ?
Hyundai Verna Safety Rating: హ్యుందాయ్ వెర్నాకు భారత్ NCAPలో 5 స్టార్ రేటింగ్.. పెద్దలతో పాటు పిల్లల భద్రతలోనూ 5 స్టార్లు
హ్యుందాయ్ వెర్నాకు 5 స్టార్ సేఫ్టీ రేటింగ్.. క్రాష్ టెస్టుల్లో అదరగొట్టిన పాపులర్‌ సెడాన్!
పుష్కరం పాటు సాగిన ప్రయాణం.. ఇక అమ్మకాలకు గుడ్‌బై చెప్పిన TVS Star City Plus
మార్కెట్ నుంచి TVS Star City Plus అవుట్.. ఈ బైక్‌ ఇక కనిపించదు బాస్‌!
Tata Cars: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
కారు టాటాది.. కారు పైన బ్యాడ్జ్‌ మాత్రం హోండా, హ్యుందాయ్‌ది! టెక్నాలజీ షేరింగ్‌ గురూ
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Embed widget