Kakinada Accident: కాకినాడ జిల్లాలో ఘోరం- 2 బైకులు ఢీకొని ఒకరు సజీవ దహనం, మరొకరి పరిస్థితి విషమం
Kakinada Road accident: కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం సీతంపేట హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా, మరో వ్యక్తి కాలిన గాయాలయ్యాయి.
Kakinada Road accident: కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంకు వద్ద జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం కాగా, మరో వ్యక్తి కాలిన గాయాలయ్యాయి. శంఖవరం మండలం సీతంపేట హెచ్ పీ పెట్రోల్ బంకు వద్ద రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
శంఖవరం మండలం సీతంపేట లోని బంకులో ఓ వ్యక్తి పెద్ద క్యాన్ లో డీజిల్ కొట్టించాడు. ఆ డీజిల్ క్యాన్ ను బైక్ పై తీసుకుని వెళుతున్నాడు. అంతలోనే పల్సర్ బైకు, డీజిల్ తీసుకెళ్తున్న వ్యక్తి బైక్ ను ఢీకొట్టడంతో ఊహించని విషాదం చోటుచేసుకుంది. రెండు బైకులు ఢీకొనడంతో ఒక్కసారిగా అక్కడ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చేసరికి జరరాని నష్టం జరిగిపోయింది. క్షణాల్లో మంటలు వ్యాప్తించడంతో బైకుతో పాటు ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పల్సర్ బైకుపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. సజీవ దహనం అయిన వ్యక్తి తొండంగి మండలం ఏ. కొత్తపల్లి గ్రామానికి చెందిన వెలుగుల చక్రం (60) గా గుర్తించారు. కాలిన గాయాలైన వ్యక్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.